DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ విజయోత్సవ సభలో మోడీ విశ్వరూప సందర్శనం

ఆంధ్రా ను à°†à°¦à±à°•à±à°¨à±‡à°¦à°¿ మేమే, : విశాఖలో మోడీ ప్రకటన 

అభినందన్ à°°à°¾à°•à°¤à±‹ హర్షాతిరేకాలు 

విశాఖపట్నం, మార్చ్ 01, 2019 (DNS Online) : ఆర్ధికంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ ను

అన్ని విధాలా ఆదుకునేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రకటించారు. ఒక ప్రక్క దాయాది పాకిస్తాన్ కు చుక్కలు

చూపించి, మరో పక్క ప్రతిపక్షాలతో కబడ్డి ఆడుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం విశాఖలో చేపట్టింది విజయోత్సవ సభ గానే సాగింది. విశాఖనగరం లోని రైల్వే

మైదానం వేదికగా భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ప్రజా చైతన్య సభ లో నరేంద్ర మోడీ ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ను కడిగిపారేశారు. అరవై ఏళ్లుగా

ఢిల్లీ లో ఒక కుటుంబం, నలభై ఏళ్లుగా ఆంధ్ర లో ఒక కుటుంబం చేపట్టిన స్వార్ధ పూరిత రాజకీయాలకు అటు దేశం, ఇటు ఆంధ్ర బలయ్యాయన్నారు.

సైనికులతో మొదలు పెట్టి,

సింహాద్రి నాధుని స్మరించుకుంటూ మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ఆరంభించగానే వేలాదిగా వచ్చిన ప్రజానీకం హర్షం వ్యక్తం చేశారు. 
దేశం కోసం, జవాన్ల కోసం, విజయం

కోసం భారత్ మాతాకీ జై- వరాహ లక్ష్మీ నరసింహస్వామి, అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథంల ఆనవాళ్లున్న నగరం విశాఖ- ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేం కట్టుబడి

ఉన్నామని తెలిపారు.  à°…ందమైన విశాఖను చూస్తుంటే మనస్సు పులకిస్తోందని,  à°¯à±à°µà°¤ ఆకాంక్షలకు ప్రతిరూపమైన విశాఖ నగరం ఎలా అభివృద్ధి చెందాలో.. దాన్ని నెరవేర్చడమే మా

కర్తవ్యం అన్నారు. 

రైల్వే జోన్ పై . . . . :

విశాఖ ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను అందించామని మోడీ తెలియచేసారు.

 à°µà°¿à°­à°œà°¨ చట్టంలోని ప్రతి అంశాన్ని నెరవేర్చడానికి మేం కట్టుబడి ఉన్నామని,  à°µà°¿à°¶à°¾à°– రైల్వే జోన్ కలను à°—à°¤ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా.. మేం విభజన చట్టంలో ఉన్న

నేపథ్యంలో ఇచ్చామన్నారు. 
ఈ రైల్వే జోన్ వల్ల కొత్త రైల్వే లైన్లు, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, కొంతమంది తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై

ఆరోపణలు చేస్తున్నారన్నారు. 
 à°‡à°•à±à°•à°¡à°¿ ప్రభుత్వ అసమర్థత ప్రజల పురోగతికి నిరోధకంగా మారుతోందని,  à°µà°¿à°¶à°¾à°– 

నగరానికి ఇచ్చినవి ఇవే . . . . :

నగరాన్ని స్మార్ట్

సిటీగా చేసేందుకు వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 
విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి,

ఐఐఎం, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్, ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్, స్టీల్

ప్లాంట్ విస్తరణ, రిఫైనరీ ఆధునికీకరణకు, ఆయిల్ రిజర్వ్ నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 

మీ ప్రధాన సేవకుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి

కట్టుబడి ఉన్నానని,  à°®à±‡à°‚ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకు ఎలాంటి భయాలు లేవన్నారు. 
 à°®à°¾à°•à± వెనకాల ఎవరో ఏదో చేస్తారనే సంకోచం లేదని,  à°‡à°•à±à°•à°¡à°¿

నాయకుల అవినీతి బయటపడుతుందని వీళ్లు భయపడాలన్నారు.  à°•à±à°Ÿà±à°‚à°¬ పాలన చేసే వారు తమ వెనుక ఏదో జరుగుతుందని సంకోచించాలని, నిత్యం మాటలు మారుస్తూ యూటర్నులు తీసుకునే

నాయకులు రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చేస్తారు? అని ప్రశ్నించారు.  à°‡à°•à±à°•à°¡à°¿ నాయకుల అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై విమర్శలు చేస్తున్నారని,  à°¯à±‚టర్న్ లు

తీసుకునే వారు తమ గుండె మీద చేతులు పెట్టుకుని తమ చరిత్ర చూసుకోవాలన్నారు.  à°à°ªà±€ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా నిర్ణయాలు తీసుకుంటున్న నాయకులతో జాగ్రత్తగా

ఉండాలని కోరారు. మహాకూటమి కట్టిన నాయకులకు స్పష్టమైన ఎజెండా అంటూ లేదని,  à°•à±‡à°µà°²à°‚ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేదే వారి ఆలోచనగా అని ఎద్దేవా చేశారు. బడుగు

బలహీన వర్గాలు ఎదిగేలా చేస్తుండటం వల్లే వారు మాపై విమర్శలు చేస్తున్నారని, మోదీని పదవీచ్యుతుడిని చేయడం ద్వారా దేశాన్ని దోచుకోవాలనుకుంటున్నారన్నారు.

 à°¦à±‡à°¶à°¾à°¨à°¿à°•à°¿ సంక్షేమాన్ని అందిస్తున్నందుకే మోదీని గద్దె దింపాలనుకుంటున్నారని, నవ భారతానికి కొత్త దిశానిర్దేశం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారని తెలిపారు.

బలమైన ప్రభుత్వం వల్ల దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడం సాధ్యమైంది- కూటమి కుటిల నీతిని దేశ ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు- భావసారూప్యత లేని మహాకూటమి వల్ల

దేశం బలహీనమవుతుంది. 

పాకిస్తాన్ పై సక్రమంగా స్పందించాలి :

ప్రపంచమంతా పాకిస్తాన్ ను ప్రశ్నిస్తున్న సమయంలో సైన్యం మనోధైర్యం క్షీణించేలా దేశంలోని

కొంతమంది వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  à°‡à°•à±à°•à°¡ కొంతమంది మాట్లాడుతున్న మాటలను పాకిస్తాన్ పార్లమెంట్ లో చెప్పుకొంటున్నారంటే వీరు ఏ స్థాయిలో వ్యాఖ్యలు

చేస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. దేశంలో బలహీనమైన ప్రభుత్వాన్ని తేవాలనుకుంటున్న మహాకూటమి దేశాన్నే బలహీనపరచాలని చూస్తోందన్నారు. 

ఈ బలమైన ప్రభుత్వం

రైతుల కోసం చారిత్రాత్మకమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది- ఈ పథకం ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏటా ఆరు వేల సాయం అందుతుంది- ఈ పథకం వల్ల

ఆంధ్రప్రదేశ్ లోని 78 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారు- రైతులు ఈ నగదుతో విత్తనాలు లేదా ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చు- ఈ పథకం కోసం కేంద్రం ఏటా 78 వేల కోట్లు

ఖర్చు చేయనుంది- మన దేశంలో 7500 కిలోమీటర్లకు పైగా సముద్రతీరం ఉంది- గడిచిన దశాబ్దాలుగా ఈ తీర ప్రాంతాన్ని వినియోగించడంపై ఏ ప్రభుత్వం కూడా సరైన నిర్ణయాలు

తీసుకోలేదు- ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి కోసం హార్బర్లు అనే పథకం ద్వారా తీరప్రాంతాన్ని ఉపయోగంలోకి తెస్తోంది- మత్స్యకారుల సంక్షేమం కోసం, వారి మౌలిక

సదుపాయాలు కల్పించడంపై మేం దృష్టి పెట్టాం- మన దేశంలో హరిత విప్లవాన్ని చూసినట్లుగా.. ఇప్పుడు మన దేశంలో నీలి విప్లవాన్ని తీసుకువస్తున్నాం- తద్వారా

మత్స్యకారులు సముద్రంలోతుల్లోకి వెళ్లి మరీ చేపలు పట్టుకునేలా ప్రభుత్వం సహకరిస్తుంది- ఇందుకోసం అవసరమైతే లోన్లు కూడా ఇస్తాం- సముద్రంలోకి వెళ్లే

మత్స్యకారులకు ఇస్రో సాంకేతిక సహకారంతో రూపొందించిన పరికరాలు అందించడం జరుగుతుంది- సముద్రంలో వచ్చే ఆటుపోటులు, సునామీ హెచ్చరికలు అందేలా ఈ పరికరాలు

ఉపయోగపడతాయి- సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులతో పాటు చేపలను సాగు చేసే వారిని ఆదుకునేందుకు కేంద్రం 7700 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. 

చేపల

సాగులో ఉన్న రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు అందించాలని కేంద్రం యోచిస్తోందన్నారు.  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± వ్యక్తుల ద్వారా లోన్లు తీసుకోవడం వల్ల

వచ్చేఇబ్బందులు తొలగించేలా à°ˆ నిర్ణయం తీసుకుంటున్నాం అన్నారు. 

 à°¦à±‡à°¶ చరిత్రలోనే మొదటిసారిగా మధ్య తరగతి ప్రజల కోసం ఐదు లక్షల ఆదాయం వరకు పన్నును పూర్తిగా

మినహాయించామని, ప్రతి ఒక్కరూ నిజాయితీగా పన్నులు చెల్లిస్తుండటం వల్లే à°ˆ నిర్ణయం తీసుకోగలిగామని వివరించారు. 

ఆయుష్మాన్ భవ పథకం కింద ప్రతి పేద

కుటుంబానికి ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నామని, ప్రతి పేద, మధ్యతరగతి వారి కల అయిన సొంత ఇల్లు అందించేలా ప్రధాని ఆవాస యోజన కింద ఐదు నుంచి ఆరు లక్షల వరకు

లబ్ధి చేకూరేలా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల యజమానులపై భారం తగ్గించేలా జీఎస్టీని 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించామని వివరించారు.

 à°…లాగే పేద, మధ్యతరగతి ప్రజలు నిర్మించుకునే వారి కోసం జీఎస్టీని 8 శాతం నుంచి ఒక్క శాతానికి తగ్గించామని, దీనివల్ల దేశంలోని మధ్య, దిగువ మధ్య తరగతి వారందరికీ

ప్రయోజనం చేకూరనుందన్నారు.  à°¦à±‡à°¶à°‚లో ఎప్పుడూ ఉన్నట్లుగానే అధికారులు, ఉద్యోగులు ఉన్నారు,  à°•à°¾à°¨à±€ ప్రభుత్వం ధృడమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుందంటే ప్రజా శక్తి,

ఓటు శక్తే కారణం- ధృడమైన ప్రభుత్వం ఏర్పడితే గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతాం- రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకోవాలి- ధృడమైన ప్రభుత్వాన్ని

ఎన్నుకోవాలి అని కోరారు.  à°ˆà°¯à°¨ హిందీ లో చేసిన ప్రసంగాన్ని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగులో అనువదించారు. 

ఈ సమావేశం లో బీజేపీ ఆంధ్ర

ప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, విశాఖపట్నం ఎంపీ డాక్టర్ కె. హరిబాబు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్సింహారావు,

ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, పైకొండల మాణిక్యాల రావు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #government  #india  #prime minister  #narendra modi  #andhra

pradesh  #kanna lakshminarayana  #Haribabu  #MP  #MLA  #MLC 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam