DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవజ్యోత్ సిద్దు వ్యాఖ్యల్లో తప్పు లేదు :ఆంధ్ర కాంగ్రెస్ 

విశాఖపట్నం, మార్చ్ 02, 2019 (DNS Online) : ప్రపంచమంతా భారత్ కు అండగా నిలిచి, పాకిస్తాన్ ఉగ్ర ప్రేరిత దాడులను ఏక కంఠం తో తప్పుపడితే, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి, పంజాబ్

మంత్రి నవజ్యోత్ సిద్దు పాక్ కు అనుకూల వ్యాఖ్యలు చేయడాన్ని భారత సమాజం అంతా తప్పుపడుతోంది. అయితే ఆంధ్రా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉన్నత కమిటీ నేతలు

మాత్రం సిద్ధూను గట్టిగా సమర్థిస్తున్నారు. శనివారం విశాఖ నగరానికి వచ్చిన పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ రక్షణ సహాయ మంత్రి పల్లం రాజు, సుబ్బరామిరెడ్డి,

తదితరులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరుల అడిగిన ప్రశ్నకు పళ్లంరాజు సహా మిగిలిన వారు కొందరు సిద్దును బలంగా సమర్ధించారు. అతను తన వ్యక్తిగత

అభిప్రాయం చెప్పాడని, అంతమాత్రాన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు అంటూ పల్లంరాజు సమర్ధించే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ దేశాల

మధ్య అంత సన్నిహిత సంబంధాలు లేవు, అయితే ఇటీవలే పాకిస్తాన్ ఎన్నికల్లో గెలిచిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ను ప్రత్యక్షంగా అభినందించేందుకు పాకిస్తాన్

వెళ్లిన సిద్దు, అక్కడి మిలిటరీ అధికారిని ఆలింగనం చేసుకోవడం భారత సమాజం తప్పు పట్టింది. ఇటీవల జరిగిన ఉగ్ర దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయం లేదంటూ ఇమ్రాన్ కు

గుడ్డిగా మద్దతు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దేశ భద్రత, భారత రక్షణ ను పక్కన పెట్టి, దాయాదిని అంత బలీయంగా సమర్ధించడం అంటే

ఆలోచించవలసిన విషయమే. అయితే తమ పార్టీ నేతను మందలించవలసిన కాంగ్రెస్ పార్టీ సైతం కిమ్మనకపోవడం, అతనికి మద్దతుగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమర్ధించడం

చూస్తుంటే వీళ్ళ అభిప్రాయం కూడా అదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళ తీరు ఇలాగే ఉంటె ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పడికే కోమాలోకి పోయిన కాంగ్రెస్ పార్టీకి

దేశ వ్యాప్తంగా ప్రజలు గట్టిగా బుద్ది చెప్పడం ఖాయంగా కనపడుతుంది. ఇప్పడికే పుల్వామా దాడులకు కఠినంగా ప్రతీకారం తీర్చుకోవడం, తదుపరి భారత పైలట్ ను సురక్షితంగా

భారత్ కు తీసుకురావడం లో జరిగిన పరిణామాలను భారతీయ జనతా పార్టీ తన ఖాతాలోకి వేసుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు విపరీత వ్యాఖ్యలు చేస్తుంటే ప్రజలు వీళ్ళను

నమ్మే పరిస్థితి ఉండదు. 

 

#dns  #dns live  #dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns media  #congress  #APCC  #Navjyoth Singh Sidhu  #Raghuveeraa Reddy  #Pallamraju  #Subbaramireddy  #Dronamraju srinivas  #press meet

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam