DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశాభివృద్ధి జరగాలంటే దేశ ప్రధానిగా మోడీ యే ఉండాలి: డాక్టర్ లక్ష్మణ్

దేశాభివృద్ధికి మోడీ మరోమారు ప్రధాని కావాలి : డాక్టర్ లక్ష్మణ్ 

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ 

అన్నవరం,

మార్చి 08, 2019 (డి ఎన్ఎస్): భారత దేశ అభ్యున్నతి మరింతగా కొనసాగడానికి నరేంద్ర మోడీ మరో మారు భారత ప్రధానిగా ఎన్నికవ్వలసిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ

తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం కు విచ్చేసిన ఆయన రత్నగిరి కొండ పై  à°¶à±à°°à±€ రమా సమేత శ్రీ వీర వెంకట

సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి అనంతరం స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా భారత దేశానికి మంచి మార్గ దర్శకం చేస్తూ దిశా నిర్దేశంగా నిలిచిన నరేంద్ర మోడీ

మరోసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం సాగించాలి అని ప్రార్ధించినట్టు తెలియచేసారు. ఇటీవల కాలంతో

భారత దేశం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులను సైతం ఎటువంటి తొట్రుపాటు పడకుండా ప్రపంచ దేశాలను సైతం తన వైపుకు త్రిప్పుకొని దాయాది దేశం పాకిస్తాన్ కి

అంతర్జాతీయ ప్రతినిధుల నుంచి గట్టిగా బుద్ది చెప్పించిన ఏకైక భారత ప్రధానిగా మోడీ నిలిచిపోయారన్నారు. ఒకటి రెండు నిర్ణయాలు ఇబ్బంది కల్గించినా, దేశం మొత్తం

అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్తున్నారన్నారు. ఆయన మరోమారు కొనసాగితేనే ఈ దేశం గాడి లో పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నవరం రావడంతో ఆంధ్ర

ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిరంజీవి కామర్సు ( అన్నవరం వాస్తవ్యులు) ఆయనతో పాటు రత్నగిరి వచ్చి, తగు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. డాక్టర్

లక్ష్మణ్ తో పాటు రైల్వే బోర్డు సభ్యులు  à°µà±†à°‚à°•à°Ÿ రమణి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి  à°¨à°šà±à°šà°°à°¾à°œà± సుభాష్ ,బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సత్య

కృష్ణంరాజు ,బిజెపి తెలంగాణ కార్యాలయ కార్యదర్శి కే వి ఎస్ ఎన్ రాజు, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు  à°¸à°¿à°‚గిలిదేవి సత్తిరాజు, ప్రత్తిపాడు బిజెపి కన్వీనర్

చిలుకూరు రామకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

pix courtesy : Sri. Chiranjivi Kamarsu

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #annavaram   #telangana  #K Lakshaman  #Laxman  #Chiranjeevi  #Kamarsu  #Satyanarayana swamy  #temple  #Ratnagiri  #Vratam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam