DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయ పార్టీల బ్రతుకు తేలేది ఏప్రిల్ 11 నుంచే . . . . 

ఏపీ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎలక్షన్ తేదీ ఇదే..!

న్యూ ఢిల్లీ, మార్చి 10 ,2019 (DNS Online ): దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల బ్రతుకులు తేలే ప్రక్రియకు కేంద్ర ఎన్నికల

కమిషన్ తెరతీసింది. సార్వత్రిక ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఆదివారం సాయంత్రం పత్రికా సమావేశం లో ప్రకటించారు. తక్షణం ఎన్నికల కోడ్

దేశవ్యాప్తంగా వస్తుందని ఆయన ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ కు, శాసన సభ ఎన్నికలు ఏప్రిల్ 11 , 2019 నాడు ఒకే రోజు జరుగుతాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా,

సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ  à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à±à°²à±‹ ఎన్నికలు ఇదే రోజున జరగనున్నాయి.  à°†à°‚ధ్రప్రదేశ్‌లో 175 శాసన సభ సీట్లు.  à°’డిశాలో 147

శాసన సభ సీట్లు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60 శాసన సభ సీట్లు, సిక్కింలో 32  à°¶à°¾à°¸à°¨ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  

ఈసారి అదనంగా లక్ష పోలింగ్‌

కేంద్రాలు:

ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘాలు, ప్రభుత్వాలతో పలు దఫాలుగా సన్నాహక సమావేశాలు జరిపామని

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై చర్చలు జరిపామని ఆయన చెప్పారు. నిష్పక్ష, పారదర్శక ఎన్నికల నిర్వహణకు

పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు అరోడా వివరించారు. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షల దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించామన్నారు. వాతావరణం,

పంటకోతల సమయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా తాగునీరు, టాయ్‌లెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఓటు హక్కు

వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని అరోరా వివరించారు. ‘‘పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగానే ఓటర్లకు పోల్‌ చిట్టీలను పంపిణీ చేస్తాం.

దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. à°—à°¤ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. సమస్యాత్మక,

అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ నిర్వహిస్తాం’’ అని అరోరా వివరించారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #andhra pradesh  #delhi  #assembly 

#parliament  #lok sabha  #sunil arora  #chief election commissioner  #April 11  #2019
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam