DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎదురు డబ్బిచ్చి మరీ పుచ్చు వంకాయలు అమ్ముతారు జాగ్రత్త . . . .

పార్టీల పుచ్చు వంకాయలు వచ్చాయి జాగ్రత్త :

విశాఖపట్నం , మార్చి 21, 2019 (DNS Online): ప్రజాస్వామ్యంలోని అమాయకులైన ప్రజల జీవితాలను బుగ్గిపాలు చెయ్యడానికి మరోసారి వివిధ

పార్టీలు తమ పుచ్చు వంకాయలను అంగడి లోకి వదిలాయి. వచ్చిన వంకాయలో దాదాపుగా అన్నింటికీ ఎదో ఒక పుచ్చు ఉంటూనే ఉంటోంది. వీటిని సరిగ్గా చూసి ఎంచుకోకపోతే రానున్న

ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్యం పూర్తిగా భ్రష్టుపట్టిపోతుంది అన్నది వాస్తవం. వ్యక్తిగత స్వార్ధానికే తప్ప సమాజానికి, ప్రజలకి దమ్మిడీ ఉపయోగపడని వ్యక్తులని తమ

అధికారిక అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టి ప్రజలమీదకి మార్కెట్లో సరకులు అమ్మినట్టు ప్రదర్శనలో నిలబెడుతున్నాయి ఈ రాజకీయ పార్టీలు. పైగా ఎదురు డబ్బిచ్చి

మరీ అమ్ముడు పోయేందుకు అందుబాటులో ఉన్న అన్ని అడ్డదారులూ తొక్కుతున్నాయి.   

ఎదురు డబ్బిచ్చి మరీ అమ్ముతారు . . . 

సాధారణ గదిలోకి వచ్చిన సామాగ్రిని జనం

డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి. ఇక్కడ ఎన్నికల అంగడిలోకి వచ్చిన సామాగ్రిని ఎదురు డబ్బు ఇచ్చి మరీ అమ్ముతుంటారు. ఓటుకి ఇంత అని లెక్కపెట్టి మరీ ప్రతి ఇంటికీ ఇంత

పడేస్తుంటారు. దీన్నే బలవంతపు బ్రాహ్మణార్ధం అంటారు. బలవంతంగా డబ్బిచ్చి మరీ వాళ్ళ కుళ్ళు కడుక్కోడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళకి ఓటు వెయ్యడం

లేకపోయినా సరే వీళ్లకు బలవంతంగా డబ్బిచ్చి ఓటు కొనుక్కుంటారు. వీధికో దళారిని పెట్టి మరీ జనాన్ని పీక్కుతింటుంటారు. 

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. .

ఎన్నికల బరిలో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ తప్పులు వాళ్ళు విస్మరించి ఎదుటివారి తప్పులని మాత్రమే బహిరంగంగా

ప్రకటించేస్తుంటారు. అధికార పార్టీ అంతా అవినీతి మాయం అని ప్రతిపక్ష పార్టీ అంటే, ప్రతిపక్ష పార్టీ అంతా గతంలోనే దోచుకు తినేసింది అని అధికార పార్టీ

విమర్శిస్తోంది. వీరిద్దరూ దొంగలేనని కొత్తగా పుట్టుకు వచ్చిన పార్టీ గొంతుచించుకుంటే. . .కేంద్రం ఇచ్చిన డబ్బుని అధికార పార్టీ పంచుకు తినేసిందని కేంద్రంలో

అధికారం లోని పార్టీ విరుచుకు పడుతుంది. 

తక్కువ పుచ్చు ఏరుకోక తప్పదు. . . 

అంగడి లోకి వచ్చిన సామాగ్రిని మాత్రమే ఎంచుకోవాలి అనే దౌర్భాగ్య స్థితి నుంచి

తప్పించుకునేందుకు నోటా అనే ఒక ఆయుధాన్ని ప్రజలకి ఎన్నికల కమిషన్ ఇచ్చింది. మీకు పుచ్చు తినడం ఇష్టం లేకపోతే నోటా తో తప్పించుకునే సౌలభ్యం ఉంది.

 

#dns  #dns live  #dns media 

#dns news  #dnslive  #dnsnews  #dnsmedia  #vizag  #viswanadha raju  #visakhapatnam  #telugudesam  #janasena  #voting  #elections  #polling  #lok sabha  #assembly  #parliament  #andhra pradesh  #brinjal  #vankaya  #bjp

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam