DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల్లో పాత్రికేయులకు సహాయకారి గా గూగుల్

కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం : హైద్రాబాద్ ప్రతినిధి భరత్ 

పోటీ ప్రపంచంలో పాత్రికేయులకు à°ˆ శిక్షణ అవసరం: గంట్ల శ్రీనుబాబు 

విశాఖపట్నం, మార్చి 23 2019 (DNS Online) :

ప్రస్తుతం జరుగుతున్నఎన్నికల సమరంలో విలేకరులు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారని వారికి సహాయకారిగా ఉండేందుకు దేశ వ్యాప్తంగా శిక్షణ అందిస్తున్నట్టు

 à°—ూగుల్ సంస్థ ఢిల్లీ ప్రతినిధి గీతిక తెలిపారు. శనివారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో గూగుల్ సంస్థ, విజెఎఫ్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణ సమావేశంలో

ఆమే మాట్లాడుతూ నిత్యం ఎన్నో ఒత్తిళ్లకు లోనవుతూ విధులు నిర్వహించే పాత్రికేయులకు తగిన సూచనలు చేసేందుకు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఈ శిక్షణ

అందిస్తున్నామన్నారు. 
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో సైతం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తి

కల్గిస్తున్నందున, ఈ కేంద్రాన్ని తాము ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎన్నికలు 2019 ప్రక్రియ లో భాగంగా పాత్రికేయులు తీసుకోవాల్సిన భాద్యతలు, యు ట్యూబ్ , ఆన్ లైన్ వీడియో,

ఫోటోలు తదితర ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించాలి, సరైన, వాస్తవ సమాచారాలను అందించ వలసిన విధానాలు వివరించారు. అనంతరం పాత్రికేయులు అడిగిన

సందేహాలకు వివరణ ఇచ్చారు. ఈ శిక్షణా శిబిరాన్ని పవర్ పాయింట్ ద్వారా తెలియచేసారు. గూగుల్ సంస్థ హైదరాబాద్ ప్రతినిధి భరత్ మాట్లాడుతూ ఎన్నికల్లో తెలుగు ప్రాంతాలు

దేశ వ్యాప్తంగానే ప్రతిష్టాత్మకంగా మారాయని, ఎంతో ఉద్వేగ పూరితంగా జరిగే ఈ ఎన్నికలను అత్యంత ప్రొఫెషనల్ గా అందించేందుకు పాత్రికేయులకు తగు సూచనలు

చేస్తున్నట్టు తెలియచేసారు. 

ఎంతో ఉపయుక్తకారి : గంట్ల 

వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రపంచం అంతా గూగుల్

చుట్టూనే తిరుగుతోందని, అలాంటి పెద్ద సంస్థలు పాత్రికేయులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం అభిననీయమన్నారు. à°ˆ విధమైన శిక్షణ  à°ªà°¾à°¤à±à°°à°¿à°•à±‡à°¯à±à°²à°•à± మరింత

ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 

విజెఎఫ్ కార్యదర్శి ఎస్. దుర్గారావు మాట్లాడుతూ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం నగరాన్ని ఈ శిక్షణ కు ఎంపిక

చేసుకోడాన్ని అభినందించారు. విజెఎఫ్ కు దేశ వ్యాప్తంగా ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులు కారణంగా ప్రత్యేక ఎన్నికల శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ సంస్థ  à°ˆ నగరాన్ని

ఎంపిక చేయడాన్ని విజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజు పట్నాయక్ ధన్యవాదములు తెలియచేశారు. అనంతరం ఈ బృందాన్ని విజెఎఫ్ కార్యవర్గం అభినందించి సత్కరించింది. ఈ

కార్యక్రమం లో కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి, పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #google  #VJF press club  #training  #elections  #press club  #Delhi  #Hyderabad  #Telugudesam  #Janasena  #YSR Congress

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam