DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖను విశ్వ నగరంగా మారుస్తాం : విశాఖ ఎంపీ అభ్యర్థులు 

విశాఖను అభివృద్ధి చేసిందే నేనే : బీజేపీ పురందేశ్వరి 

సింగపూర్ తరహా అభివృద్ధి చేస్తా : జనసేన జెడి

అవినీతి కి ఆస్కారం లేకుండా చేస్తా : వైకాపా

ఎంవివి 

పెద్దల అడుగుజాడల్లో నడుస్తా: టిడిపి భరత్ 

విశాఖ ఎంపీ అభ్యర్థులతో విజెఎఫ్ ముఖాముఖీ.. 

విశాఖపట్నం, మార్చి 27, 2019 (డి ఎన్ఎస్): అందాల సాగర తీరం గల

విశాఖ నగరాన్ని విశ్వ విఖ్యాత నగరం గా తీర్చిదిద్దుతామని ఎంపీ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రకటించారు. మరో రెండు వారాల్లో జరుగనున్న సార్వత్రిక

ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ కు పోటీ చేస్తున్న అభ్యర్థులతో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ (విజెఎఫ్) బుధవారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన ముఖ ముఖి కార్యక్రమం

లో ఐదు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంట్ల

శ్రీనుబాబు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, ప్రముఖులు విశాఖ నగరానికి వచ్చిన సందర్భాల్లోనూ వారితో ముఖ ముఖి నిర్వహించడం తమ సంస్థ ఆనవాయితీగా

కొనసాగిస్తోందన్నారు. దీనిలో భాగంగానే ఏప్రిల్ 11 2019 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో బుధవారం నుంచి ముఖాముఖి

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదటి రోజున విశాఖ లోక్ సభ కు పోటీ పడుతున్న అభ్యర్థులతో చర్చ వేదిక ను ప్రారంభిస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎవరూ ప్రత్యర్థులను

విమర్శించుకోకుండా సంయమనం పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ పది నిమిషాల సమయం తమ కార్యాచరణను వివరించాలని సూచించారు. పాత్రికేయులకు అన్ని పార్టీలు సమానమేనని,

అందరిపై ఒకే తరహా ప్రత్యేక అభిమానం ఉంటుందన్నారు. 

పెద్దల అడుగుజాడల్లో నడుస్తా : టిడిపి శ్రీభరత్. 

అధికార తెలుగుదేశం పార్టీ తరపున పోటీలో నిలిచిన

గీతం చైర్మన్ శ్రీ భరత్ మాట్లాడుతూ రెండు తరాలుగా తమ కుటుంబం రాజకీయం ద్వారా ప్రజా సేవలోనే ఉందని, వారి అడుగు జాడల్లో నడుస్తూ విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి లో

ప్రముఖంగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. వయసులో అందరికంటే చిన్న అయినా రాజకీయం కొత్త కాదని, తమ తాత లతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ప్రజా సమస్యలను

చిన్న నాటి నుంచే తెలుసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్నచాల సమస్యలకు చట్ట సభలో చర్చించడం ద్వారానే పరిష్కారం చూపగలమన్నారు. 

మరో మరు అవకాశం

ఇస్తే విశ్వ నగరంగా మారుస్తా : బీజేపీ పురంధేశ్వరి .

గతం లో విశాఖ ఎంపీ గాను, కేంద్ర మంత్రిగానూ విశాఖ నగరానికి ఎంతో సేవచేసానని, అయితే చేసిన ప్రతి పనికి

ప్రచారం చేసుకోవడం బీజేపీ సిద్ధాంతం కాదని బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించడంలో 2009 లోనే నాటి కేంద్ర

మంత్రిగా ప్రభుత్వంలోనూ, రైల్వే మంత్రి, ఆర్ధిక మంత్రులతో పోరాటమే చేసినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి పూర్తిగా అన్యాయం

చేసిందని, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చమని బిల్లు లో పెట్టలేదన్నారు. అన్ని పరిశీలించామని మాత్రమే ఉందన్నారు. రైల్వే జోన్, ప్రత్యేక హోదా పరిశీలించమనే ఉందన్నారు.

దాంతోనే తర్వాత అధికారం లోకి వచ్చిన బీజేపీ కి చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. వాటన్నింటిని దాటుకుని, సానుకూలంగా సమస్యలను పరిశేఖరించిన గొప్ప నేత ప్రధాని

నరేంద్ర మోడీ అన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా రైల్వే జోన్ ఇవ్వడమే కాక, 14 జాతీయ స్థాయి విద్య సంస్థలను కూడా ఇచ్చామన్నారు. ఒక్క గిరిజన విశ్వ విద్యాలయం తప్ప

మిగిలినవన్నీ ఇప్పడికే విద్య సంవత్సరాన్ని మొదలు పెట్టేశాయన్నారు. మరో మారు తనకు ఎంపీగా అధికారం ఇచ్చినట్లయితే విశాఖ నగరానికి రావాల్సిన మిగిలిన హామీలను

నెరవేరుస్తామన్నారు. ఆంధ్ర కి అన్యాయం చేసింది కనుకనే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చెయ్యడం తో పాటు ఎంపీ సీటుకి కూడా రాజీనామా చేసినట్టు

తెలిపారు. 

పుట్టుకతోనే విశాఖ వాసిని, సింగపూర్ కంటే అందంగా మారుస్తా : జనసేన లక్ష్మీనారాయణ .

అధిక శాతం ప్రజలు సింగపూర్ చూసేందుకు వెళ్తుంటారని, ఇక పై

వారంతా విశాఖ నగరం చూసేందుకు వచ్చేలా నగరాన్ని తీర్చిదిద్దుతానని జనసేన అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ తెలిపారు. తానూ పుట్టడం తోనే విశాఖ వాసినని, తానూ విశాఖ నగరం

లోనే పుట్టానని తెలిపారు. తన తండ్రి సీలేరు ప్రాంతంలో ఇంజనీర్ గా విధులు నిర్వహించినప్పుడు తాము విశాఖ లోనే నివాసం ఉన్నామని, అప్పుడే తానూ పుట్టినట్టు

వివరించారు. పుట్టుకతోనే విశాఖతో అనుబంధం ఉన్న కారణంగా తానూ స్థానికుడినేనన్నారు. ఇక ఉద్యోగ పరంగా దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో విధులు నిర్వహించి, అక్కడ ఉన్న

సమస్యలు, అభివృద్ధి పై పూర్తి అవగాహనా ఉందని, ఎంత క్లిష్టమైన సమస్యనైనా సత్వరం పరిష్కరించగలినే నేర్పు ఉందన్నారు. యువత కు అధిక ప్రాధాన్యం ఇస్తూ విశాఖ

కేంద్రంగానే పరిశ్రమలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం, స్థానికులకు ఉపాధి కల్పనా, నగర అభివృద్ధి తదితర అంశాలపైనే తన దృష్టి ఉన్నందున జనసేన అధినేత పవన్ కళ్యాణ్

తనను విశాఖ కొత్వాల్ à°—à°¾ ( సంరక్షకులు) పంపారన్నారు. 

అవినీతి కి అడ్డుకట్ట వేసి, అభివృద్ధి పధంలో నడిపిస్తా : వైకాపా ఎంవివి .

అధికార పార్టీ దారుణ దోపిడీకి

బలైన విశాఖ నగరాన్ని అవినీతి కూపం నుంచి బయటకు తీసుకువచ్చి అభివృద్ధి పధంలో నడిపే విధంగా కృషి చేస్తానని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంవివి

సత్యనారాయణ ప్రకటించారు. విశాఖ నగరంలోనే తానూ స్థిర నివాసం ఏర్పరుచుకుని, ఇక్కడే వ్యాపారవేత్తగాను, à°’à°• భవన నిర్మాణ కర్తగానూ   ఎదిగానని, వందలాది మందికి తమ

సంస్థల్లోనే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కల్పించామన్నారు. విశాఖ నగరానికి ఎన్నో బృహత్ నిర్మాణాలను అందించి, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు.

విశాఖ ప్రాంతంపై సంపూర్ణ అవగాహనా ఉందని, నగర అభివృద్ధికి, పారిశ్రామికీకరణ, నిరుద్యోగ యువతకు సాంకేతిక, స్వయం ఉపాధి కల్పనా, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడం,

పరిశ్రమల ఏర్పాట్లుపై జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి విశాఖను మహోన్నత నగరంగా మారుస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విశాఖ నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దీని అభివృద్ధి భాద్యతను తనపై ఉంచినట్టు ఎంవివి

తెలిపారు. 

గెలిస్తే ప్రత్యేక హోదా : కాంగ్రెస్ పేడాడ రమణ కుమారి .

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ కు తక్షణం ప్రత్యేక హోదా

ఇస్తామని అధ్యక్షులు రాహుల్ ప్రకటించారని, కాంగ్రెస్ అభ్యర్థి పేడాడ రమణ కుమారి తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లు లో రాష్ట్రానికి మేలు జరిగే ఎన్నో అంశాలను

చేర్చడం జరిగిందని, అయితే ప్రతిపక్షాలు వాటిని తప్పుదారి పట్టించాయన్నారు. 

à°ˆ ముఖాముఖీ కార్యక్రమం లో విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿

ఎస్ దుర్గారావు, ఉపాధ్యక్షులు ఆర్. జగరాజు పట్నాయక్ à°² ఆధ్వర్యవం లో లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను సత్కరించారు. à°ˆ కార్యక్రమం లో విజెఎఫ్ కమిటీ  à°¸à°‚యుక్త కార్యదర్శి

దాడి రవికుమార్, సభ్యులు ఎమ్మెస్సార్ ప్రసాద్, వరలక్ష్మి, శేఖర్ మంత్రి, గయాజ్, గిరి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు

అభ్యర్థులు తమదైన శైలి లో సమాధానాలు చెప్పారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #telugudesam  #janasena  #YSR congress  #Congress  #daggubati purandeswari  #JD Lakshminarayana  #MVV Satyanarayana  #Sri Bharat  #Gitam  #Pedada Ramana Kumari  #VJF Press Club  #Gantla Srinubabu  #Durga Rao  #Port city  #hotel meghalaya

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam