DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి పాలనకు చరమ గీతం పలుకుతాం: ఉత్తర అభ్యర్థులు  

డబ్బు పంచకుండా పోటీ చేస్తామని ప్రమాణం చేస్తారా ? : విష్ణు కుమార్ రాజు 

విశాఖపట్నం, మార్చి 28, 2019 (డి ఎన్ఎస్): అవినీతిని రహిత ప్రాంతంగా విశాఖ ను తయారు చేస్తామని

విశాఖ ఉత్తర నియోజక వర్గం ఎన్నికల అభ్యర్థులు ప్రకటించారు. విశాఖపట్నం ఉత్తరం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ (విజెఎఫ్)

గురు వారం నగరం లోని à°“ హోటల్ లో నిర్వహించిన ముఖ ముఖి కార్యక్రమం లో ఐదు ప్రధాన పార్టీల అభ్యర్థులనూ ఆహ్వానించారు. 

ఈ స్థానం లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న

పి విష్ణు కుమార్ రాజు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ లో భారతీయ జనతా పార్టీ పక్ష నేత గా ఉండడంతో పాటు రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఇదే స్థానం నుంచి పోటీలో

ఉన్న నియోజకవర్గం కావడం తో రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పారిశ్రామిక వేత్త కేకే రాజు, జనసేన తరపున

విద్యా వేత్త పసుపులేటి ఉష కిరణ్ పోటీలో ఉన్నారు. 

ప్రస్తుతం బారి లో ఉన్నవారందరినీ ముఖా ముఖి కార్యక్రమానికి ఆహ్వానించినా మాజీ మంత్రి గంటా గైర్హాజరు

అయ్యారు. దీంతో అభ్యర్థులు విమర్శనాస్త్రాలు వదిలారు. 

ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు

మాట్లాడుతూ ఎన్నికల బరిలో నిలిచిన వారితో ముఖాముఖీ నిర్వహించడం విజెఎఫ్ ఆనవాయితీగా వస్తోందన్నారు. వ్యక్తిగత విమర్శలు చెయ్యవద్దని అభ్యర్థులను కోరారు. 
 
/> డబ్బు పంచకుండా పోటీ చేస్తామని ప్రమాణం చేస్తారా ? : విష్ణు కుమార్ రాజు 

ఎన్నికల్లో డబ్బులు పంచకుండా పోటీలో చివరిదాకా నిలబడతామని అభ్యర్థులు, ముఖ్యంగా

మాజీ మంత్రి గంటా ప్రమాణం చేస్తారా అని సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సవాల్ విసిరారు. ఈయన రాకతో ఉత్తర నియోజక వర్గంలో ఓటు రేటు విపరీతంగా

పెంచేశారన్నారు. కనీసం సామాన్యుడికి ఊపిరి కూడా సలపనంతగా ఓటు కోసం ఒత్తిడి తీసుకు వస్తున్నారన్నారు. 
రాష్ట్రం లో అవినీతి సామ్రాజ్య నేతగా మొదటి స్థానం లో

ఉvన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ ఎన్నికల్లో రాజకీయ సన్యాసం తప్పదని సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. రాష్ట్రం లో జరుగుతున్న ఎన్నో

సమస్యలను శాసన సభలో ప్రశ్నించి, పోరాడి విజయం సాధించినట్టు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం శాసన సభ సమావేశాలకు రెండేళ్ల కాలం రాకుండా భాద్యత రాహిత్యంగా ఉంటె ఆ

ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషించినట్టు తెలిపారు. గంటా బారి నుంచి వేల కోట్ల విలువ చేసే భూములు కాపాడానని, అర్హులైన పేదలకు ఇల్లు కేటాయించానని, వాటిలోనూ గంటా

మూడు లక్షలు చొప్పున రేటు కట్టి వాటిని అమ్ముకుతిన్నాడని మండిపడ్డారు. హోమ్ గార్డులకు జీతాలు పెంపు, బ్రాండిక్స్ సిబ్బందికి జీతం పెంపు, తాడితర విషయాల్లో

ముఖ్యమంత్రితోనే పోరాడి విజయం సాధించినట్టు తెలియచేసారు. తాము నిఖార్సైన నిజాయితీ గా పనిచేయడమే జీవిత లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయం

సాధించానన్నారు. యధాతధంగా వాల్తేర్ డివిజన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోనే ఉంటుందన్నారు. అధికారం లో ఉండగా నోరు మూసుకున్న కాంగ్రెస్ మరోసారి అధికారం ఇస్తే

ఏమి చేస్తుందో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర సమస్యలపై శాసన సభలో ముఖ్యమంత్రి 71 గంటల సమయం మాట్లాడగా, తర్వాత అధికంగా 36 గంటల సమయం మాట్లాడితే కేవలం తానేనన్నారు.

 

అవినీతిని చరమగీతం తప్పదు : వైకాపా కేకే రాజు 

ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్న అధికార పార్టీ అవినీతి చేష్టలకు చరమ గీతం పడతామని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు ప్రకటించారు. కనీసం ప్రజల అవసరాలను కూడా పట్టించుకోకుండా కేవలం స్వార్ధం కోసమే ప్రభుత్వ హోదాలను పూర్తిగా

దుర్వినియోగం చేసారని మండిపడ్డారు. మట్టి ని కూడా వదలకుండా పూర్తిగా దోచుకుంటున్నారన్నారు. ఉత్తర నియోజక వర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవని, ఆరోగ్య

కేంద్రాలు లేవని, కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలకు సరైన ఆసరా ఆవాసాలు లేవని, అర్హులైన వారందరికీ ఇళ్ళు అందించడం,   పోర్ట్ పరిధిలోని పాఠశాలలు తిరిగి కోనసాగించడం,

సంపూర్ణ మద్యపానం నిషేధం వంటివి అమలు చేస్తామని ప్రకటించారు. 

రాష్ట్ర ప్రజలకు రామ రాజ్యం అందిస్తాం : జనసేన ఉష కిరణ్ 

గత ఐదేళ్లుగా ఇబ్బడి ముబ్బడిగా

రాష్ట్రాన్ని దోచుకుంటున్న అధికార పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్గించి రామరాజ్యం అందిస్తామని జనసేన అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్ ప్రకటించారు.

మహిళలకు నాసిరకం వంట సామాగ్రి అందించకుండా నేరుగా మహిళల బ్యాంకు అకౌంట్ లోనే రూ. 3500 డిపాజిట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతారాహిత్యంగా ఉన్న పరిపాలనను

పూర్తిగా గాడిలో పెడతామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తిగా సాధించి, రాష్ట్ర అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు. యువతరానికి అవసరమయ్యే

అన్ని వనరులను సమకూరుస్తామన్నారు. మాధవ ధారా లోని అత్యంత పురాతన ఆలయం మాధవ స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరిచి, పునర్ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. 

అధికారం

లోకి వస్తే ప్రత్యేక హోదా ఇష్టం: కాంగ్రెస్ గోవింద్. 

రాష్ట్ర విభజనలో అన్నింటినీ తప్పనిసరిగా అమలు చెయ్యాలి అని చట్టం చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. మరో

సారి అధికారం లోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని తమ పార్టీ జాతీయ అధ్యక్షులు  à°°à°¾à°¹à±à°²à± ఇప్పడికే ప్రకటించారన్నారు. à°ˆ విషయాన్నిమిగిలిన పార్టీలు

వక్ర దారి పట్టిస్తున్నాయన్నారు.  

à°ˆ ముఖాముఖీ కార్యక్రమం లో విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ ఎస్ దుర్గారావు, ఉపాధ్యక్షులు ఆర్. జగరాజు

పట్నాయక్ à°² ఆధ్వర్యవం లో లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను సత్కరించారు. à°ˆ కార్యక్రమం లో విజెఎఫ్ కమిటీ  à°¸à°­à±à°¯à±à°²à± ఇరోతి ఈశ్వర్, ఎమ్మెస్సార్ ప్రసాద్, వరలక్ష్మి, శేఖర్

మంత్రి, గయాజ్, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు అభ్యర్థులు తమదైన శైలి లో సమాధానాలు చెప్పారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp 

#telugudesam  #ysr congress  #janasena  #congress  #North  #Vishnu Kumar Raju  #KK raju  #Usha Kiran  #Govind
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam