DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంచి ఆశయంతో వచ్చా,  ఒక్క అవకాశం ఇవ్వండి,  : వైకాపా కేకే రాజు 

విశాఖపట్నం, మార్చి 28, 2019 (DNS Online) : నిస్వార్ధంగా  à°ªà±à°°à°œà°²à°•à± సేవ చెయ్యాలనే మంచి ఆశయంతో వచ్చానని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కేకే రాజు కోరుతున్నారు. విశాఖపట్నం ఉత్తర

నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నఅయన గురువారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ముఖ ముఖి లో విస్పష్ట ప్రకటన చేసారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడనని, అర్హులైన పేదలకు ప్రజా సంబంధిత పథకాలు అందే వరకూ కృషి చేస్తున్నారన్నారు. à°—à°¤  à°à°¡à°¾à°¦à°¿à°¨à±à°¨à°° కాలంగా విశాఖ ఉత్తర

నియోజకవర్గం లో వివిధ కోలనీలలో పర్యటిస్తూ, ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందన్నారు. ప్రధానంగా ఏకలవ్య కోలని, మురళీనగర్ కొండవాలు ప్రాంతం, లో

ప్రజలు చాలా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, వారికి అనువైన నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇల్లు అందించడం, అదే విధంగా మురళీనగర్ ప్రాంతంలోని ఒక వృద్ధాశ్రమం లోని

వయోవృద్ధులకు ఆసరా అందించేందుకు ప్రభుత్వ పధకాలను వారికి అమలు చేసే విధంగా కృషి చేస్తానన్నారు. వారికి కనీసం ఆధార్ కూడా లేదని, దీంతో వారు ప్రభుత్వ పథకాలకు

దూరంగా ఉండిపోయారని సంస్థ నిర్వాహకులు తెలియచేసినట్టు తెలిపారు. పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతున్న ఈ కేంద్రంలో సుమారు 40 మంది వృద్ధులైన పురుషులు, మహిళలు ఆసరా

పొందుతున్నారన్నారు. అదే విధంగా సాంకేతిక విద్య ను అభ్యసిస్తున్న యువతీ యువకులకు ఉపాధి లభించే విధంగా పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదించి, ఉపాధి కల్పనా మేళాలు

ఏర్పాటు చేస్తానన్నారు. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధిలో భాగంగా వారు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చెయ్యడమే కాకుండా ప్రతి ఒక్కరికీ సుమారు 40 వేల రూపాయల

వడ్డేలేని రుణాలు  à°•à±‚à°¡à°¾ మంజూరు చేయిస్తానన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, వసతి గృహాల ఏర్పాటు, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు, ప్రతి వార్డులోనూ à°’à°• ఆరోగ్య

కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు సత్వర వైద్య సదుపాయాలు అందించే ప్రయత్నం చేస్తానన్నారు. గతం లో ఎందరినో ప్రజా ప్రతినిధులకు అవకాశం ఇచ్చారని, వారు చేసిన

ప్రజా సేవ పేరిట సొంత వ్యాపారాలను అభివృద్ధి పరుచుకోవంతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ మారు ఒక్క అవకాశం ఎమ్మెల్యే గా అవకాశం తనకి కల్పించాలని కోరుతున్నారు.

నిరంతంతరం ప్రజలకు అందుబాటులోనే ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని, ఓటుకు ఉన్న పవిత్రతను గౌరవంగా కాపాడతానని పత్రికా ముఖంగా ప్రజలకు హామీ

ఇచ్చారు. 

 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam