DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2021 నాటికి పూర్తి అవనున్న సొంతభవనాల్లోకి విశాఖ ఐఐఎం

2021 నాటికి పూర్తి అవనున్న  à°.ఐ.à°Žà°‚ : 

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు

విశాఖపట్నం, మార్చి 30, 2019 (DNS Online) : విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించబడుతున్న ఐఐఎం  2021సం. నాటికి

సొంత భవనాలతో పూర్తి వసతులతో సిద్ధమవుతుందని భారత ఉపరాష్ట్రపతి à°Žà°‚. వెంకయ్య నాయుడు తెలిపారు. శనివారం నగరానికి వచ్చిన అయన  à°¨à°—à°°à°‚ లో జరిగిన ఐ ఐ à°Žà°‚ మూడవ కాన్వకేషన్

కు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు

తెలిపారు. పట్టా పుచ్చుకున్న నాటి నుండి నిజమైన జీవన యాత్ర మొదలవుతుంది అన్నారు. తమ విజ్ఞానాన్ని,  à°¨à±ˆà°ªà±à°£à±à°¯à°¾à°¨à±à°¨à°¿ దేశ సేవకు వినియోగించాలన్నారు. పూర్వకాలంలో భారత

దేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించే గురువుగా భాసిల్లిందని పేర్కొన్నారు. విదేశీ యాత్రికులు మన దేశ గొప్పతనాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసారన్నారు.

మహోన్నతమైన జ్ఞాన సంపద, చరిత్ర కలిగిన భారతదేశం, భారతీయ నాగరికత ఈ నాటికీ చెక్కుచెదరని లేదన్నారు. విద్య అనేది ఉద్యోగం కోసమే కాదని సమాజాభివృద్ధికి మూలమని

అందరూ గ్రహించాలన్నారు. శాస్త్ర పరిశోధనలు మానవాళికి ఉపయోగపడాలి అన్నారు. యోగ శాస్త్రం భారతీయుల ప్రపంచానికి అందించిన ఉన్నతమైన శాస్త్రం అని చెప్పారు.

వ్యవసాయం మన సంస్కృతిలో భాగమని, పౌష్టికాహార ఉత్పత్తి లేకుండా ఆహార భద్రత రాదన్నారు. దేశంలో సొంతంగా ఉత్పత్తి చేసిన ఆహారంతోనే ఆహారభద్రత వస్తుందన్నారు. వాతావరణ

పరిస్థితులను బట్టి దేశ ఆహారం, ఆహారపు అలవాట్లు ముడిపడి ఉంటాయి అన్నారు. పుష్టికరమైన ఆహారపు అలవాట్లు, మన అలవాట్లు మన ఆరోగ్యం, అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి

అన్నారు. ఇప్పటికీ మన దేశం అనేకమంది మేధావులను ప్రపంచానికి అందిస్తున్నదని, ప్రపంచ ప్రముఖ సంస్థల సీఈవో లలో భారత దేశానికి చెందినవారు ఉన్నారని గుర్తు చేశారు.

ధన్వంతరి చరకుడు వరాహమిహిరుడు భాస్కరాచార్యుడు మొదలైనవారు విలువ కట్టలేని విజ్ఞాన సూత్రాలను అందించారన్నారు. భారతదేశం లో 20% మంది దారిద్ర్య రేఖకు దిగువన

ఉన్నారని, 22 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని చెప్పారు. అయినా మన ఆచార వ్యవహారాలు మూలంగా వారందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారని తెలిపారు.

స్త్రీలు అభివృద్ధి సాధించని దే దేశ అభివృద్ధి సాధ్యపడదని వివేకానందుడు చెప్పారన్నారు. దేశంలో స్వయం సహాయక  à°¬à±ƒà°‚దాల మూలంగా ఆర్థిక పరిస్థితి స్వయం సమృద్ధం

అయిందన్నారు. భేటీ బచావో బేటి పడావో బేటి బడావో నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. విశాఖపట్నంలో ఐఐయం స్థాపనకు సహకరించిన డి.ఆర్. ఎల్. రావును ఈ సందర్భంగా ఆయన

అభినందించారు.
     à°à°à°Žà°‚ చైర్ పర్సన్ హరి భాటియా, డైరెక్టర్ à°Žà°‚.చంద్రశేఖర్ సంస్థ అభివృద్ధి ని గూర్చి, నిర్వహణ గురించి వివరించారు. అనంతరం తమ కోర్సులలో గోల్డ్

మెడల్ లను సాధించిన గిరీష్, తరుణ్ చౌదరి,  à°ªà°¿. కార్తీక్ కౌండిన్యలకు బంగారు పతకాలను అందజేశారు. à°ˆ కార్యక్రమంలో ఐ ఐ à°Žà°‚ ఆచార్యులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #IIM  #vice president  #Venkaiah Naidu  #VUDA Childrens arena  #Andhra Pradesh  #convocation
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam