DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన మాజీ జెడి: ప్రచారం తక్కువ పిట్టకథలు ఎక్కువ ? 

పిట్ట కథలతో జనసేనకు ఓట్లు రాలేనా? 

పిట్టకథలు వినేంత సమయం జనం దగ్గర ఉందా? 

మితిమీరిన విశ్వాసం కొంప ముంచేనా ?

విశాఖపట్నం,  à°à°ªà±à°°à°¿à°²à± 1 ,2019  (à°¡à°¿ ఎన్ ఎస్ DNS

Online ): విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థుల ప్రచారాల్లో విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన తరపున బరిలో నిలిచినా సీబీఐ మాజీ జెడి వివి

లక్ష్మీనారాయణ చేస్తున్న ప్రయోగం వికటించే సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. గత ఆరు రోజులుగా విశాఖ ఎంపీ పరిధిలోని ఏడూ అసెంబ్లీ స్థానాల పరిధిలోనూ

విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి చోటా ఎన్నికల ప్రచారానికి మారుగా పిట్టకధలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైన ప్రచారం జనాన్ని

నవ్వించడానికి ఉపయోగపడుతుంది తప్ప, వాళ్ళ నుంచి ఓట్లు రాల్చుకోడానికి ఏమాత్రం ఉపయోగపడదు అని తెలిసే సమయానికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇక కేవలం తొమ్మిది

రోజులే గడువు ఉండడంతో సోమవారం నుంచి జరిగే ప్రచారం లో చెప్పేందుకు మరిన్ని కధలు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. 

కధలు వినే సమయం జనానికి ఉందా?
 
ప్రతీ

రాజకీయ నేతా ఇంతకాలం చెప్పిందంతా పిట్ట కథలే. ఇలాంటివి విని విసిగిపోయిన జనానికి ఈ మాజీ ఖాకీ చెప్పే కధలు వినేంత సమయం లేదు. పైగా ఒక టీచర్ చెప్పినట్టు చెప్తా

అంటే వినేవాళ్ళు విద్యార్థులు కాదు. కనీసం ఎన్నికల రోజున ఓటు వెయ్యడానికి కూడా సమయం వెచ్చించని జనానికి à°ˆ కధలు వినే టైము ఎక్కడిది.  à°ªà±ˆà°—à°¾ ఇతను కొత్త నేత, జనం పాత

ఓటర్లు. ఇలాంటి కధలు ఇతనికంటే జనమే ఇంకా బాగా చెప్పగలరు. 

 à°®à°¿à°¤à°¿ మీరిన విశ్వాసం జనసేన కొంప ముంచేనా?

జనసేనానే మా బలం, కనీసం 88 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం

అని పదే పదే ప్రకటిస్తున్న జనసేన ఎంపీ అభ్యర్థి, అతని సహచర గణం తీరు చూస్తుంటే ఇది కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ లా కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా ప్రజా

పోరాటాలు, ఉద్యమాల్లో పాతుకుపోయి ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలతో ధీ కొట్టడం అంటే అంత సులభం కాదు అనే విషయం జనసేన పార్టీకి పూర్తిగా అర్ధమైనట్టు లేదు. గెలవాలి

అనుకోవడం వేరు, కచ్చితంగా గెలుస్తాం అని చెప్పడం వేరు. ప్రజానాడి సరిగ్గా పట్టుకున్న రాజకీయ నేతా లేదు, పార్టీ కూడా ఇంత వరకూ ఈ దేశంలోనే లేదు. చేతులు కాలిన తర్వాత

ఆకులూ పట్టుకునే కంటే ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయాన్నైనా సద్వినియోగం చేసుకోకుంటే ఈ జనసేన మరో ప్రజారాజ్యం గా మారె అవకాశం

ఉంది. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #viswanadha raju  #bjp  #ganta srinivasa rao  #telugudesam  #janasena  #pawan kalyan  #VV lakshminarayana  #JD  #MP #pittta kadhalu  #elections  #campaigining  #assembly constituencies  #visakha east  #visakha north  #visakha south  #visakha west  #gajuwaka  #pendurty  #bhimili  #anakalapalle  #S kota

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam