DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాలయం లాంటి చట్టసభ కు విద్యాధికులే ఎన్నికవ్వాలి: ఐవైఆర్ 

చట్టసభ అంటే ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటిది: ఐవైఆర్. 

విశాఖ తూర్పులో సుహాసిని ని గెలిపించే భాద్యత యువత తీసుకోవాలి

బ్రాహ్మణ మహిళకు టికెట్

ఇచ్చిన ఘనత బీజేపీ దే. 

ఆమె గెలుపుకు ప్రతి ఒక్కరూ à°’à°• మిసైల్ à°—à°¾ పనిచేయాలి 

విశాఖపట్నం,  à°à°ªà±à°°à°¿à°²à± 1 , 2019  (à°¡à°¿ ఎన్ ఎస్ DNS Online ): చట్టసభలు అంటే ప్రజాస్వామ్యంలో à°’à°•

దేవాలయం లాంటిదని, దానికి ఎన్నికయ్యే వారికి విలువలతో పాటు నిస్వార్ధం, విద్యావంతులై,  à°¸à±‡à°µ గుణం ఉండాల్సిన అవసరం ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా

రావు పిలుపునిచ్చారు. సోమవారం విశాఖ నగరం లోని మద్దిలపాలెం లో గల కళాభారతి వేదికగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని కె. సుహాసిని కి సంఘీభావం

తెలియచేస్తూ నిర్వహించిన బ్రాహ్మణ చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా విధులు

నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలకు సంపూర్ణ పరిష్కరణ లభించాలంటే నిస్వార్ధ విద్యావంతులనే చట్టసభలకు పంపవలసిన అవసరం ఉందని  à°ªà±à°°à°œà°¾ సమస్యలను

చట్టసభల్లో సరైన రీతిలో వివరించి, వాటిని పరిష్కరించగలిగే మేధస్సు, తెలివితేటలూ కేవలం విద్యాధికులకే ఉంటాయన్నారు. అదే కోవకు చెందిన కొమరిగిరి సుహాసిని ఆనంద్

విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఆమెకు సంఘీభావం తెలియచేయడంతో పాటు మన ఓటు కూడా వేసి ఆమెను

ఆశీర్వదించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆమెలాంటి విద్యావంతులు చట్టసభకు ఎన్నికైతే కలిగే ఉపయోగాన్ని మీ ప్రాంతంలోని ప్రజలందరికీ వివరించి, వారి మద్దతు కూడా

కూడగట్టవలసిన భాద్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకువచ్చి ఈమె గెలుపుకు ఒక మిసైల్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర

ప్రదేశ్ చరిత్రలో ఒక బ్రాహ్మణ మహిళకు ఎమ్మెల్యే గా టికెట్ ఇచ్చిన రాజకీయ పార్టీలు అతి తక్కువ అని, అలాంటిది బీజేపీ సుహాసిని విద్యార్హతలు, నిస్వార్థ సేవాగుణం,

సున్నిత మనస్తత్వం, సమస్యల పై స్పందించే తీరు,  à°¤à°¦à°¿à°¤à°° అంశాలను పరిశీలించి పార్టీ ఆమెను ఎంపిక చేసిందన్నారు. వివాదరహితంగా ఉండే వారు చట్ట సభకు ఎన్నికైతే

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపగలరన్నారు. 

అంతకు ముందు సదస్సుకు అధ్యక్షత వహించిన సీనియర్

పాత్రికేయులు, విశాఖ సమాచారం సంపాదకులు ఎస్. వీరభద్ర రావు మాట్లాడుతూ ఎన్నికలు కేవలం ఐదేళ్లకు వచ్చే ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ఈ దేశ భవిష్యత్తును శాసించే

మహోత్సవం అన్నారు. గతం లో గెలుపు ఓటములు అభ్యర్థుల ఆర్ధిక పరిస్థితులబట్టి ఉండేదని, అయితే ప్రస్తుతం ప్రజలు విద్యావంతులు కావడంతో పాటు, తమ సమస్యలకు సానుకూల

పరిష్కారం చూపించగలిగే వారిని ఎన్నుకునే విజ్ఞత ఉన్నవారన్నారు. ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక మహిళగా సత్వర పరిష్కారం చూపించగలరని బీజేపీ

సుహాసిని ఆనంద్ ను ఎంపిక చేసిందన్నారు. మన ఇంటి ఆడపడుచు కు లభించగా అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆమెను అత్యంత మెజారిటీ తో గెలిపించి సగౌరవంగా

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు పంపించే భాద్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. 

వైజాగ్ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, మాజీ పొలిసు అధికారి టిఎస్సార్

ప్రసాద్ మాట్లాడుతూ సాధారణంగా బ్రాహ్మణులకు అవకాశాలు లభించవని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యావంతులైతే మద్యం, మనీ లాంటివి

పంపిణీలు ఉండవని, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. 

అంతకు ముందు భారత మాత చిత్రపటానికి పూలమాల వేసి, దీపారాధన చేసి కార్యక్రమాన్ని

ఆరంభించారు. కార్యక్రమం లో నగరానికి చెందిన పలు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns

news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #visakha east  #suhasini anand  #beach road  #arilova  #telugudesam  #IYR Krishna Rao   #jourlaist  #advocates  #lawyers  #teachers  #editor  #TSR Prasad  #Police
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam