DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకాపా లో కార్మిక వర్గాల చేరికతో విశాఖ పశ్చిమ మళ్ల ఖాతాలోకే

అందరితో కలిసి, అందరిలో కలిసి ప్రచారం....

విశాఖపట్నం, ఏప్రిల్ 3 , 2019 (DNS Online డి ఎన్ ఎస్ ) : అధికార పక్షానికి సింహ స్వప్నం గా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత

మళ్ల విజయ్ ప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడంలో ముందంజలో ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు. గత ఐదేళ్లుగా చేస్తున్న నియోజకవర్గంలో

ప్రజలతో మమేకమై చేస్తున్న పర్యటనలు ఆయన పట్ల నమ్మకాన్ని ఏర్పరుచుకోగలిగాయి. ఎన్నికల ప్రకటన విడుదలైన తదుపరి చేస్తున్న విస్తృత ప్రచారం లో కొన్ని అవాంతరాలు

ఏర్పడినప్పటికీ ముందడుగు వేస్తూ వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చేరువ చెయ్యడం లో కృతకృత్యులయ్యారు. దీనికి అదనంగా విశాఖపట్నం కార్మిక నేతలు బుధవారం వైఎస్

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం ఈయనకు మరింత కలిసి వచ్చే అంశం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో అధిక భాగం పరిశ్రమలు ఉండడంతో పాటు కార్మిక కుటుంబాలు వేల

సంఖ్యలో ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాయి. 

మంత్రి రాజశేఖర్ రాక మరింత బలం :

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా ఉన్న ఎన్టీయూసీ కార్మిక సంఘం జిల్లా

అధ్యక్షులు మంత్రి రాజశేఖర్ తన సహచర కార్మిక నేతలతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ప్రచారం లో వెనుకపడ్డారేమో అనుకున్న మళ్ల విజయ్ ప్రసాద్

ఒక్కసారిగా అగ్రతాంబూలం దక్కించుకున్నారు. సుమారు రెండున్నర లక్షలకు పైగా ఓటు బ్యాంకు ఉన్న ఐ ఎన్ టి యూసీ కార్మిక వర్గం లో 80 శాతం సభ్యులు, వారి కుటుంబాలు విశాఖ

పశ్చిమ లోనే నివాసం ఉండడంతో పాటు, వారికి ఇక్కడే ఓటు ఉండడం ఈయనకు బాగా కలిసి వచ్చే అంశం. 

అధికార పార్టీకి గండి కొట్టేసినట్టే :

మళ్ల చేస్తున్న విస్తృత

ప్రచారం తో పాటు, అధికార పార్టీ à°•à°¿ చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే పిజివిఆర్ నాయుడు కేవలం à°’à°• వర్గానికే పరిమితం కావడంతో, అధికార పార్టీ చేసిన అవినీతి పై  à°ªà±à°°à°œà°²à±à°²à±‹

అధికార పార్టీ పట్ల వ్యతిరేకత రోజు రోజుకూ పెరిగిపోతోంది. పైగా గతంలో ఇదే నియోజకవర్గం లో ఎమ్మెల్యే గా చేసిన పనులకు మళ్ల పట్ల ప్రజల్లో నమ్మకం కలగంతో పాటు, మరో

మారు మళ్లకు అవకాశం ఇవ్వాలి అని దాదాపుగా నిర్దారించుకున్నట్టే తెలుస్తోంది. ఇక కేవలం ప్రచారానికి కేవలం ఆరు రోజులే మిగిలి ఉండడంతో నియోజక వర్గంలో ప్రతి

సామజిక వర్గాన్ని కలుస్తూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహనా పెంచుకుంటున్నారు మళ్ల.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #ysr congress  #YSR CP  #telugudesam  #visakha west  #Malla Vijay Prasad  #Industrial area

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam