DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ దక్షిణంలో ముదిరిన కులాల ఎన్నికల కోటరీ.

గతంలో కానరాని కులమే నేడు దిక్కాయేనా ?

విశాఖపట్నం, ఏప్రిల్ 4 , 2019 (DNS Online డిఎన్ఎస్ ) : ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు చెయ్యలేని పనంటూ ఏదీ లేకుండా పోయింది.

ప్రధానంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం లో కులాల లంపటం బాగా ముదిరిపోయింది. గతంలో కానరాని, పట్టించుకోని ఈ లంపటాలను వెతికి మరీ దాదాపుగా దేహీ అనేస్తున్నారు.

ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ రంగంలో ముందంజలో ఉన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం, తదుపరి రాత్రి వేళల్లో కుల సమీకరణాలు, కాళ్లావేళ్లా

బేరాలు, సముదాయించడాలు, కుల పెద్దలతో హెచ్చరింపులు  à°‡à°²à°¾ ఒక్కటేంటి ? కాదేదీ ఓట్లు పొందేందుకు అనర్హం అన్నట్టు . . ముందుగా ఎవరి కుల సంఘాల పెద్దలతో వాళ్ళు

చర్చించుకుని, అనంతరం సంఘ సభ్యులతో విందు భోజన సమావేశాలు ఇలా రోజంతా హడావిడిగా జరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి రోజూ ఒక సంఘం వారితో సమావేశంలో, బుజ్జగింపులు, వారి

డిమాండ్లకు తలొగ్గి, చర్చలు జరపడం, కానీ పక్షంలో కాళ్లబేరానికి సైతం మద్దతు దారులు దిగుతున్నట్టు తెలుస్తోంది. అంతా బహిరంగ రహస్య సమావేశంలో, చర్చలే కావడం

గమనార్హం. అయితే ఈ కులాల కుంపటి లో ఇరు వర్గాల అభ్యర్థుల మద్దతు దారులు తునామునకలు అవుతుండడం నగరంలోని స్టార్ హోటళ్లకు మంచి గిరాకీ బేరాలు రోజూ తగులుతూనే ఉంది. ఈ

కులాల కుంపట్లు ఎన్ని ఓట్లు రాలుస్తాయో తెలియదు కానీ, అభ్యర్థులకు నమ్మకమే కలగడం లేదు.

 

#dns   #dns live  #dns media  #dns news  #dnslive   #dnsmedia   #dnsnews   #bjp    #telugudesam    #Visakha south  #ys jagan   #chandrababu naidu   #dronamraju srinivas    #hotel dasapalla    #vasupalli ganesh

kumar 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam