DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మేనిఫెస్టో కంటే మనిషి మాటకే విలువ ఎక్కువ. .

ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మనిషి లేనట్టే లెక్క.

దీన్నే సత్య హరిశ్చంద్ర చరిత్ర తెలియచేస్తోంది. 

మేనిఫెస్టోలపై ఎన్నికల కమిషన్ మాట్లాడదేం

?

విశాఖపట్నం, ఏప్రిల్ 6 , 2019 (DNS Online డిఎన్ఎస్ ) : మహర్షి విశ్వామిత్రునికి ఇచ్చిన మాట కు కట్టుబడిన ఒక చక్రవర్తి కాటి కాపరి గా కూడా పనిచేసిన భూమి ఈ భారతావని. అదే

హరిశ్చంద్రుడు. . . .  à°®à°°à±à°¯à°¾à°¦à°¾ పురుషోత్తమునిగా ప్రపంచం యావత్తూ కొనియాడి శ్రీరామచంద్రుని పూర్వీకులు. ఇది త్రేతాయుగం నాటి మాట. నాటి నుంచి నేటి వరకూ ఆయన పేరు తలవని

వారు, వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అస్తుకులే కాదు, నాస్తికులు సైతం ఆయన పేరును తరుచు వింటూ ఉంటారు. ఆయన ప్రసిద్ధి కెక్కింది కేవలం తాను ఇచ్చిన మాటను

నిలబెట్టుకున్నందుకే. ఆయన చావడానికైనా సిద్ధపడ్డారు, ఆఖరికి భార్య బిడ్డలను సైతం విక్రయించిన సత్యవంతుడు ఆయన.  à°…ంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాడు

మరణించినవానితో సమానం అని ఆయనే ప్రకటించినట్టు చరిత్ర చెప్తోంది. 

ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మనిషి లేనట్టే ?.

అయితే ప్రస్తుతం రాజకీయ నేతలు చేస్తున్న

హామీలు కోటలు దాటిపోతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన మాటను మరో క్షణం లో ప్రక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారాల్లో ఒక్కో మనిషి, ఒక్కో

పార్టీ రూపొందించి ప్రకటిస్తున్న మేనిఫెస్టో ల్లో దాదాపుగా అమలు చెయ్యలేని ప్రకటనలే ఉంటున్నాయి. ఒక మనిషి బహిరంగ సమాజంలో ఇచ్చే మాటను తానే తుంగలోకి

తొక్కేస్తే హరిశ్చంద్రుని చరిత్ర ప్రకారం వీళ్ళు మరణించినట్టే లెక్క అని అనుకోవాల్సియుంది. 

గత ఎన్నికల్లో ఒక్కో రాజకీయ పార్టీ ఇచ్చిన ప్రధాన అంశాల్లో

ఆంధ్ర ప్రదేశ్ కి పదేళ్ల కాలం ప్రత్యేక హోదా ఇస్తానంటూ బీజేపీ, ఇంటికో ఉద్యోగం అంటూ తెలుగుదేశం పార్టీ లు హామీలు ( మాట) ఇవ్వడంతో ఆంధ్రులు వీరిని నమ్మి సంపూర్ణ

అధికారాన్ని కట్టబెట్టారు. అయితే అధికారం లోకి వచ్చాక వీళ్ళు ఆ మాటలను భూ స్థాపితం చేసేసారు. అంటే హరిశ్చంద్రుని చరిత్ర ప్రకారం వీళ్ళు జీవించి ఉన్నట్టా?

లేనట్టా ?
 
మరో సారి అన్ని పార్టీలు అసంబద్ధ అంశాలతో కూడిన చట్టాలతో మరోసారి ప్రజల ముందుకు వచ్చేసారు. అయితే వీరిని నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. వీళ్ళు కూడా

హరిశ్చంద్ర చరిత్ర చదువుకున్నారు. 

అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ? . 

డబ్బులు పంచి ఓటు అడుక్కుంటే పెద్ద నేరంగా పరిగణించే భారత ఎన్నికల కమిషన్..  à°ˆ

అసంబద్ధ హామీలపై నోరెత్తడం లేదేంటి.  à°’à°• నోటు పంపిణీ కంటే à°’à°• ఆచరణ సాధ్యం కానీ హామీలు బహిరంగంగా ఇవ్వడం కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడమే. అయితే à°ˆ మేనిఫెస్టోలను

ఎన్నికల కమిషన్ పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ దేశం లో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. పార్టీలు తయారు చేసే మేనిఫెస్టోలను కూడా ఎన్నికల

కమిషన్ పరిధిలోకి తీసుకు వచ్చి, పార్టీల నడుం విరిస్తేనే గానీ à°ˆ దేశ ప్రజల భవిష్యత్ బాగుపడదు అన్నది వాస్తవం. 

మాటకు అంత ప్రాధాన్యతా ? .

గతం లో గ్రామాల్లో

రచ్చబండ దగ్గర పెద్దల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతేనే ఊరు నుంచి వెలి వేసి కఠినంగా శిక్షించేవారు. à°’à°• పద్దతి à°•à°¿ కట్టుబడి తీర్పులు ఇచ్చే  à°†  à°—్రామ

రచ్చబండలకు నేడు అధికారిక గుర్తింపు లేదు. 
మరి అధికారిక గుర్తింపులు పొందిన  à°ˆ రాజకీయ పార్టీలు చేసే తప్పుడు ప్రకటనలకు శిక్షించక పోవడం à°ˆ దేశ ఔన్నత్యం.

 à°‡à°šà±à°šà°¿à°¨ మాట తప్పితే గ్రామ స్థాయిలోనే చర్యలు తప్పడం లేదు, మరి అలాంటిది దేశ ప్రజలను మోసగిస్తే à°ˆ రాజకీయ పార్టీలకు ఎలాంటి శిక్షలు విధించాలి. 

 

 

#dns  #dns live  #dns media  #dns

news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #telugudesam  #YSR Congress  #chandrababu naidu  #YS Jagan Mohan Reddy  #Narendra Modi  #Amit Shah  #Kanna Lakshminarayana  #Manifesto  #elections  #2019  #Andhra Pradesh  #special status #railway zone
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam