DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరకొర ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సిద్ధం. 

à°—à°‚à°Ÿà°² తరబడి రోడ్డుపైనే వేచియున్న సిబ్బంది. 

ప్రయివేట్ రద్దు తో హుటాహుటిన అదనపు సిబ్బంది 

విశాఖపట్నం, ఏప్రిల్ 10 , 2019 (DNS Online ): గురువారం జరుగనున్న సార్వత్రిక

ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన అరకొర ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సిద్దపడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగం వద్ద ఎన్నికల

సిబ్బంది à°•à°¿ వివిధ ప్రాంతాల్లో విధులు కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం బుధవారం  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à± చేసింది. జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన పురుష, మహిళా

సిబ్బందిని బుధవారం ( ఏప్రిల్ 10 ,2019 ) నాడు తెల్లవారు ఝాము 4 à°—à°‚à°Ÿà°² కే  à°Žà°¯à± కు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు మంగళ

వారం రాత్రికే ఈ కేంద్రానికి చేరుకున్నారు. కనీస ఎర్పాట్లు లేకపోవడం తో నానా అవస్థలు పడ్డారు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు

తెల్లవారుఝామున 4 గంటలకే ఎయు కేంద్రానికి చేరుకున్నప్పటికీ సంబంధిత అధికారులు రాకపోవడంతో సిబ్బంది 6 :30 గంటల వరకూ ఎయు లోనే ఉండిపోయారు. వీరిని వివిధ నిర్దుష్ట

గమ్య స్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులను ముందు రోజే రాత్రే ఎయు కు చేర్చారు. 

ప్రయివేట్ రద్దు తో అదనపు సిబ్బంది. :

ఈ ఎన్నికల్లో ప్రభుత్వ

ఉద్యోగులతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల సిబ్బందికి కూడా ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం విధులను కేటాయించారు. దీనికై వారికి తగిన

శిక్షణ శిబిరాలు కూడా రెండు సార్లు నిర్వహించారు. అయితే ఎన్నికల్లో ప్రయివేట్ వారిని ఉపయోగించడంపై న్యాయస్థానం లో ఒకరు వ్యాజ్యం వెయ్యడంతో ప్రయివేట్ వారిని

తొలగించి, విధులు కేటాయించిన ప్రభుత్వ విభాగాల వారిని హుటాహుటిన విధులకు హాజరు కావాలని ఆదేశించారు. వీరికి శిక్షణ ఇచ్చే సమయం కూడా లేకపోవడంతో, గతంలో పనిచేసిన

అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

#dns   #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #telugudesam  #ysr congress  #janasena  #elections  #andhra pradesh  #collectorate  #anakapalle  #narsipatnam  #andhra university

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam