DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవయవదానం కర్త ఆడారి కిషోర్ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు

అవయవదానం యజ్ఞం కంటే ఉత్తమం : చిన్న జీయర్ స్వామి 

విశాఖపట్నం, ఏప్రిల్ 28, 2019 (DNS online) : అవయవ దానం చేయడం యజ్ఞం కంటే ఉత్తమమైనదని ప్రముఖ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ

వేదాంత ఆచార్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ  à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿ చిన్న జీయర్ స్వామి వారు అన్నారు. 69 మందితో కలిసి అవయవ దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన నగరానికి చెందిన

తెలుగుదేశం యువ నాయకుడు, ఉద్యమ యువకుడు ఆడారి కిషోర్ కుమార్ కు స్వామిజి ప్రత్యేక మంగళా శాసనాలు అందించారు. విశాఖ జిల్లా కలెక్టర్ కె. భాస్కర్, విఎంఆర్డీఏ

కమిషనర్ పి బసంతి కుమార్, జిల్లా వికలాంగుల శాఖాధికారి వెంకటేశ్వర రావు ల సమక్షంలో సభ వేదిక పై స్వామిజి ఆడారి కిషోర్ ను అభినందించారు. ఈ సందర్భంగా స్వామిజి

మాట్లాడుతూ అవయవ దానం చెయ్యడానికి ఎంతో సుహృదయ భావం ఉండాలని, ఒకరి కి అవగాహనా కల్పించి అవయవదానం చేయించడం అంత సులభం కాదన్నారు. తాను ఒక్కరే అవయవదానం చెయ్యడమే

కాకుండా మరో 68 మంది తో అవయవ దానం చెయ్యడం మరింత స్ఫూర్తి దాయకం గా నిలిచినా ఆడారి కిషోర్ సమాజానికి తనవంతు భాద్యతను నిర్వర్తించారని అభినందించారు. ఈ సందర్బంగా

ఆడారి కిషోర్ మాట్లాడుతూ తనకు స్ఫూర్తి కల్గించిన వారు తన ఐదేళ్ల కుమారుడేనన్నారు. ఇటీవల కాలం చేసిన తన కుమారుడు ఆడారి చైతన్య భూషణ్ కళ్ళను దానం చెయ్యడం ద్వారా

ఇద్దరికీ నేత్ర దృష్ఠి లభించిందన్నారు. ఆడారి కిషోర్ ను జిల్లా కలెక్టర్ కె. భాస్కర్, విఎంఆర్డీఏ కమిషనర్ పి బసంత్ కుమార్ తదితరులు అభినందించారు. కిషోర్ తో పాటు

అవయవదానం చేసిన 69 మంది సభ్యులనూ స్వామిజి అభినందించారు. 

 

 

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #dnsonline  #dns online  #visakhapatnam  #vizag  #Varija  #Nethra vidyalaya  #bheemili  #chinna jeeyar swamiji  #blind school  #Games   #VUDA Children arena  #collector  #Bhaskar  #VMRDA  #commissioner  #Basanth Kumar  #My Home Group  #Rameswara Rao 

#adari kishore kumar  #organ donation

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam