DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒరిస్సా అమీర్ పై గరీబీ సన్యాసి అసామాన్య విజయం 

బాలాసోర్ ఎంపీగా ప్రతాప్ చంద్ర సారంగీ ఘన విజయం  . 

విశాఖపట్నం, మే 25 , 2019 (DNS Online ): కేవలం ధనం తోనే రాజకీయాలు చెయ్యవచు అని బలంగా నడుస్తున్న భారతీయ రాజకీయాల్లో ఒక

సాధారణ సన్యాసి అసామాన్య విజయాన్ని చూపించారు. ఒరిస్సా లోని బాలాసోర్ లోక్ సభ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో 
బిజూ జనతా దళ్ పార్టీ లోని ఒక పాలక పార్టీ ఎంపీ

(రవీంద్ర కుమార్ జేనా) ని, ధనికుడైన ఒక పారిశ్రామికవేత్తను ఒక ప్రతాప్ చంద్ర సారంగీ (భారతీయ జనతా పార్టీ ) అనే సన్యాసి మట్టి కరపించారు. ఈ ఘోర పరాజయం తో దశాబ్దాలుగా

ఏలుతున్న కళింగనాడులోని బిజెడి గట్టి షాక్ తగిలినట్టయ్యింది. సారంగీ అతి సామాన్యంగా ప్రజల మధ్య ప్రజాసేవలో జీవించే అయన బాలాసోర్ నియోజకవర్గం నుండి మంచి

మెజారిటీతో గెలిచారు . ఇపుడు అయన వాణి దేశం మొతం వినబోతోంది. 

à°—à°£ శిక్షా యోజన మందిర్ పేరిట బాలాసోర్, మయూరి గంజ్ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో  à°…నేక

పాఠశాలలను ఏర్పాటు చేసి వారిలో విద్యాజ్ఞానాలు పెంచడానికి కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. అత్యంత సామాన్య జీవనాన్ని గడిపే సారంగీ గ్రామీణ  à°ªà±à°°à°œà°¾à°¨à±€à°•à°‚

నుంచి ఉన్నత వర్గాల ప్రజల వరకూ అందరితోనూ నిత్యం పలు కార్యాచరణలో పాల్గొంటూ ఈ ఘన విజయాన్ని చేజిక్కించుకున్నారు. ఈయన బీజేపీ కేంద్ర కమిటీ సభ్యునిగా కూడా

కొనసాగుతున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఈయన అన్ని వర్గాల ప్రజలతోనూ మమేకమై వారికి అండగా నిలుస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఒరిస్సా శాసన సభ లో

సభ్యునిగా విశేష సేవలు అందించారు.  à°—à°¤ లోక్ సభ ఎన్నికల్లో సైతం పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చూసారు. నాటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో విశేష సేవలు అందిస్తున్నారు.

ఈయన సేవలకు ప్రతిఫలంగా బాలాసోర్ ప్రజలు ఈయనను లోక్ సభ కు పంపారు. 

 

#dns  #dns_news  #dns_media  #dns_online  #dns_newsline  #vizag  #visakhapatnam  #bangalore  #south  #loksabha  #MP  #tejasvi  #surya  #bandi   #sanjay  #sadhvi  #prajna  #thakur  #Orissa  #Odisha  #Sarangi  #Balasore  #BJP  #BJD  #MP
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam