DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల నుంచి రాష్ట్ర ప్రక్షాళన మొదలా? 

జగన్ తిరుమల పర్యటనతో  à°ªà±†à°¨à± మార్పులు?

టిటిడి బోర్డు మార్పు తోనే మొదలా?

ఈసారైనా జాగ్రత్తలు  à°šà±†à°ªà±à°ªà°‚à°¡à°¿ :

తిరుమల,  à°®à±‡ 28 , 2019 (DNS Online ): à°—à°¤ ఐదేళ్లు à°—à°¾ భ్రస్టుపట్టి

పోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రక్షాళన ప్రక్రియకు తిరుమల లో శ్రీకారం చుట్టనుందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బుధవారం తిరుమల శ్రీనివాసుని దర్శనానికి రానున్న నూతన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వామి దర్శనం అనంతరం రాష్ట్రాన్ని గాడిలో  à°ªà±†à°Ÿà±à°Ÿà±† ప్రక్రియకు తిరుమల శ్రీనివాసుని సాక్షిగానే మొదలు పెడతారు అనే

సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఈ రోజు జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానముల ( టిటిడి) బోర్డు సమావేశం. ఈ సమావేశం మొదలు కాగానే ఆలయ ఈఓ అనిల్ కుమార్

సింఘాల్, జె ఈ ఓ రామచంద్ర రాజులూ సభను వీడి (వాకౌట్ చేసి) వెళ్లిపోయారు. అనంతరం ఒకరిద్దరు సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే

చైర్మన్ హోదా లో ఉన్న పుట్ట సుధాకర్ మాత్రం తన పదవీకాలం ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉందని, అప్పటివరకూ తానే టిటిడి చైర్మన్ గా ఉంటా అంటూ ప్రకటన చేశారు. వచ్చే

ప్రభుత్వం బోర్డు ను రద్దు చేసే వరకూ తాను పదవి దిగేది లేదు అని ప్రకటించడం వెనక బలమైన కారణమే ఉంది. ఈయన వియ్యంకుడు తలసాని శ్రీనివాస యాదవ్ కావడం, అయన తెలంగాణ

ముఖ్యమంత్రి కేసీఆర్ కి సన్నిహితుడు కావడమే కాకా, మంత్రి కూడా కావడం, కేసీఆర్ తో వైఎస్ జగన్ సు సన్నిహిత సంబంధం ఉండడం తో తనకు డోకా లేదు అనే ధీమాలో ఉన్నట్టు

తెలుస్తోంది. అయితే. . . ఈయన నియామకమే పెద్ద వివాదం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ పదవి కోసం ఆ కుర్చీలో ఏనాడో తుండు గుడ్డలు వేసేసారు. ఇక పార్టీ

మారినా కీలక పదవుల్లో పాతచింతకాయ పచ్చడేంటి అనే వాదనలూ వినిపిస్తున్నాయి. 
ఇక ఈఓ , జె ఈ ఓ ల వాకౌట్ తో ఈ బోర్డు కు కలం చెల్లినట్టే అనే సంకేతాలు అనధికారికంగా

వచ్చేసాయి. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాల ప్రక్షాళనకు తిరుమల శ్రీవారి సన్నిధి సాక్షిగా టిటిడి బోర్డు మార్పు తోనే మొదలు పెడతారు అనే వాదనలు బలంగా

వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ అమలు చేస్తున్న అక్రమ విధానాలపై కొరడా జులిపించడం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే బుధవారం జగన్ మోహన్

రెడ్డి పర్యటన పదవి ప్రమాణ స్వీకారానికి ముందు కావడంతో ప్రక్రియను సిద్ధం చేసి, పదవి ప్రమాణం అనంతరం ప్రక్షాళనకు శ్రీకారం చుడతారు అని తెలుస్తోంది. రానున్న

బోర్డు లోనైనా హైందవ సంప్రదాయం పై విశ్వాసం ఉన్నవారికి స్థానం కల్పిస్తే భక్తులు హర్షం వ్యక్తం చేయగలుగుతారు. 

ఈసారైనా జాగ్రత్తలు  à°šà±†à°ªà±à°ªà°‚à°¡à°¿ :.

 à°µà±ˆà°Žà°¸à±

జగన్ మోహన్ రెడ్డి గతం లో తిరుమల పర్యటన కు వచ్చిన సమయంలో పాదరక్షలతో ఆలయ ప్రవేశం చేసారంటూ వివాదం రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే లేపింది. ఈ పర్యాయమైనా నాలుగు మాడ

వీధుల్లో నడిచే టప్పుడు పాదరక్షలు వేసుకోకుండా సన్నిహితులు జాగ్రత్తలు తీసుకుంటే ఆలయ మర్యాద కాపాడబడుతుంది. 

 

pix courtesy: to whom so ever it may concern

#dns #dnsnews  #dnslive  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #tirumala  #tirupati  #ttd  #jagan  #YSR 

#mohan  #board

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam