DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బొకేలు వద్దు. పుస్తకాలే ఇవ్వండి : కొత్త ఒరవడికి కిషన్ రెడ్డి శ్రీకారం

వేలాది పుస్తకాలతో నిండిపోయిన కార్యాలయం .

పార్టీలకు అతీతంగా సర్వత్రా హర్షం వ్యక్తం .

సికింద్రాబాద్, మే 28 , 2019 (DNS Online ): సికిందరా బాద్ లోక్ సభ సభ్యునిగా

ఎన్నికైన జి. కిషన్ రెడ్డి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. తనను ఎన్నుకున్న ప్రజలకు తాను చేసే ప్రతి పనిలోనూ కొంత ఉపయోగం ఉండాలి అనే సంకల్పంతో తనను

అభినందించేందుకు వచ్చే మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎవరైనా తనకోసం పుష్పగుచ్ఛాలు, పూలదండలు, శాలువాలు తీసుకురావొద్దని

సూచించారు. 

వాటికయ్యే ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్‌ పుస్తకాలు తేవాలని కిషన్‌రెడ్డి కోరారు. ఆయన విజ్ఞప్తికి

అనూహ్య స్పందన లభిస్తోంది. ఒక్కపూటలోనే అనేక మంది వేలాది పుస్తకాలు తీసుకొచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

కిషన్ రెడ్డి చేసిన విన్నపం :.

నాపై

ఎంతో విశ్వాసం ఉంచి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

అభినందించడానికి వచ్చే వారికీ

అయన వినమ్రపూర్వకమైన విజ్ఞప్తి చేసారు. ఎంతో ఖరీదు పెట్టి పూలదండలు, బొకేలు, శాలువాలు తీసుకు వచ్చే బదులు అదే ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద

విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నోట్ పుస్తకాలు తీసుకువచ్చి నాకు ఇచ్చి ఆశీర్వదించవలసిందిగా మనవి చేసారు.  à°¦à±€à°¨à°¿ వలన విద్యార్థులకు ఎంతో మేలు చేసినవారవుతారు.

పేదలకు, విద్యార్థులకు కావలసిన విద్యాభివృద్ధికి సహకరించినట్లవుతుంది.  

ఈ విధంగా ఒక ఆదర్శవంతమైన విధానానికి నాంది పలుకుదామని ఇచ్చిన పిలుపుకు స్పందనగా

భారీ సంఖ్యలో అభిమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున నోటు పుస్తకాలు కిషన్ రెడ్డి కార్యాలయం లో అందచేస్తున్నరు. ఇప్పడికే కార్యాలయం పుస్తకాలతో

నిండిపోయినట్టు తెలుస్తోంది. 

తన విజ్ఞప్తిని గౌరవించి పుస్తకాలు తీసుకువచ్చిన వారికి à°ˆ సందర్భంగా కిషన్‌రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. à°ˆ పుస్తకాలను

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించిన తర్వాత విద్యార్థులకు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

గతంలో ఎమ్మెల్యే గా ఎన్నికైన సందర్భంలో ఆయన బొకేలకు బదులుగా చేనేత

కండువాలు అందించాల్సిందిగా పిలుపునిచ్చారు. 

 

 

#dns  #dns_news   #news  #dns_online  #online  #dns_media  #dnslive  #vizag  #visakhapatnam  #kiresn  #reddy  #bjp  #secunderabad  #notebooks #bouquet

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam