DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*బ్రహ్మదేవిలో ముగిసిన రోలర్ స్కేటింగ్ సమ్మర్ కోచింగ్ కాంప్*

విశాఖపట్నం, జూన్ 1 ,2019 (DNS  Online ): మే 1 నుండి 31 వరకు జిల్లా క్రీడాపాధికార సంస్థ అనుమతితో జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి

గ్రామం VBR రైసుమిల్లు నందు నిర్వహిస్తున్న వేసవి ఉచిత రోలర్ స్కేటింగ్ శిక్షణా శిబిరం ముగింపు సభకు ముఖ్య అతిధులుగా ముత్తుకూరు CI శ్రీ వీరయ్య చౌదరి మరియు VBR స్కూల్

డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి  à°µà°¿à°šà±à°šà±‡à°¸à°¿à°¨à°¾à°°à±. à°ˆ సందర్భంగా CI వీరయ్య చౌదరి మాట్లాడుతూ పట్టణాలకే పరిమితమైన à°ˆ క్రీడ గ్రామీణప్రాంతంలో నిర్వహించడం

ఎక్కువమంది రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు శిక్షణ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. చదువు పాటు క్రీడలను కూడా సమాన స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో సాధన చేయాలని

కోరారు. క్రీడాకారులందరు చక్కగా శిక్షణ తీలుకొని మంచి పథకాలను ఈ గ్రామానికి తీసుకొని రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా VBR స్కూల్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు

మాట్లాడుతూ తమ సంస్థ ఎప్పుడు సామాజిక సేవలో ఉంటుందని, త్వరలో ఒక మంచి స్కేటింగ్ రింకును తమ స్కూల్లో నిర్మిస్తామని తెలిపారు. ఈ స్కేటింగ్ రింకు లో తమ స్కూల్

పిల్లలకు మాత్రమే కాకుండా చుట్టు ప్రక్కల గల గ్రామంలోని విద్యార్థులకు కూడా అవకాశం ఇస్తామన్నారు. AP రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి NV

వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో గత 20 సం. ల నుండి రోలర్ స్కేటింగ్ లో శిక్షణ ఇస్తున్నామని మొట్ట మొదటి సారిగా గ్రామీణ ప్రాంతములో ఈ శిక్షణా శిబిరాన్ని

నిర్వహించడం జరుగు తున్నదని తెలుపారు. ఈ సందర్భంగా చిన్నారులకు శిక్షణ ఇచిన కోచ్ శరత్ ను అతిధులు అభినందించారు. రైసుమిల్లు ను శిక్షణా శిబిరానికి ఇచిన శ్రీ

శ్రీనివాసులు గారిని అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మలిరెడ్డి గౌతమ్, కోచ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline 

#visakhapatnam  #vizag  #rollar  #skating  #summer  #camp

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam