DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జంపింగ్ జపాంగ్ లకు కోర్టుకెక్కించాల్సిందే : మాడభూషి

జంపింగ్ జపాంగ్ లకు కోర్టుకెక్కించాల్సిందే 

రాజీనామా లేకుండా పార్టీ మారితే ప్రశ్నించాల్సిందే 

వైఎస్ జగన్ కు స్వీయ భాద్యత ఉన్నట్టు

కనపడుతోంది.

సమాచార హక్కు చట్ట ఏర్పాటుకు ఆద్యులు తెలుగు వారే. . . 

22500 కేసులకు పైగా తీర్పులు ఇచ్చా . .  . 

కేంద్ర మాజీ RTI కమిషనర్ మాడభూషి

శ్రీధరాచార్యులు. .

విశాఖపట్నం, జూన్  10 , 2019 (DNS Online) : à°’à°• పార్టీ గుర్తు పై గెలిచి, ఎమ్మెల్యే à°—à°¾ , ఎంపీగా లేదా ప్రజా ప్రతినిధిగా ఎన్నికై మరో పార్టీలోకి మారితే వారిని

కోర్టుకెక్కేంచే హక్కు ఓటర్లు కు ఉందని కేంద్ర సమాచార హక్కుల చట్టం మాజీ  à°•à°®à°¿à°·à°¨à°°à± మాడభూషి శ్రీధరాచార్యులు సూచించారు. సోమవారం విశాఖపట్నం నగరంలోని సమాచార

హక్కు ప్రతినిధులు నిర్వహించిన చర్చ సదస్సు కు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తు పై గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ

పదవులకు రాజీనామా చెయ్యకుండా ఇంకో పార్టీ లోకి మారితే వారిని నిలదీసే హక్కు ఓటర్లకు ఉంది. ముందుగా వారిని నియోజక వర్గ ప్రజలు నల్ల బ్యాడ్జీలు తో నిరసన తెలపాలి,

వారిని నిలదీయాలి, తమ చట్ట సభ పదవికి రాజీనామా చెయ్యమని డిమాండ్ చెయ్యాలి, ఆ తదుపరి, వారికి టికెట్ ఇచ్చిన పార్టీని నిలదీయాలి, స్పీకర్ కి ఆ సభ్యుని తొలగించమని

డిమాండ్ చెయ్యాలని, లేని పక్షంలో  à°¤à°¦à±à°ªà°°à°¿ స్పీకర్ ని ప్రశ్నించాలి, ఆపై ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి,  à°µà±€à°°à±†à°µà±à°µà°°à±‚ దీనికి సమాధానం చెప్పరు కారణం వారంతా అధికార

పార్టీ వారే కనుక, ఆపై రాష్ట్ర హై కోర్టు లో పిల్ దాఖ లు చెయ్యాలి అని చెప్పారు. ఇంతప్రక్రియ ను పాటించేందుకు ఓటర్లకు తీరిక లేకపోవడమే ఈ రాజకీయ పార్టీల డ్రామాలు

చెల్లుబాటవుతున్నాయన్నారు. 

వైఎస్ జగన్ కు స్వీయ భాద్యత ఉన్నట్టు తెలుస్తోంది. :

ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్వీయ భాద్యత ఉన్నట్టుగా

కనపడుతోందని, మాడభూషి శ్రీధరాచార్యులు ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో ను అందరూ మరిచిపోయేవాళ్లే నని, అయితే పాదయాత్ర సమయంలో వైఎస్

జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవ రత్నాలను నిరంతరం తనకు గుర్తుకు వచ్చే విధంగా ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత తన కార్యాలయ గోడలపై ఈ హామీలను

పోస్టర్లుగా పెట్టడం అభినందనీయమన్నారు. ఈ విధంగా చేసిన రాజకీయ నేతలు ఉన్నట్టుగా తెలియదన్నారు. దీన్ని స్వీయ నియంత్రణ గా భావించవచ్చని అన్నారు. సమాచార హక్కు

చట్టం కూడా ఇదే విధమైన వివరణ చెప్తోందని, పాలకులు పాటించవలసిన కర్తవ్యాలను, కార్యాచరణను ప్రజలకు తెలియచెల్సియుందన్నారు. 

సహా చట్ట ఏర్పాట్లు ఆద్యులు

తెలుగు వారే. . . :

సమాచార హక్కు చట్టం ఆవిర్భావానికి ఆద్యులు ఒక తెలుగు వారు కావడం అందరికి గర్వకారణం అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన పూర్వ నేర

చరిత్రను, విద్యార్హతలు, ఆర్ధిక లావాదేవీలను కచింతంగా ప్రకటించాలి అంటూ త్రిలోచన శాస్త్రి అనే భాద్యత కల్గిన తెలుగు వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు

చేయడం తో దేశంలోని మొత్తం రాజకీయ పార్టీలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. దీంతో సుప్రీం కోర్టు ను ఆశ్రయించడం జరిగిందన్నారు, దీనిపై కోర్టులో

వాదించిన వారు కూడా తెలుగు వారేనని, కోర్టులో తీర్పు ఇచ్చిన వై వి రెడ్డి కూడా తెలుగు వారే కావడం గమనార్హం అన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల చరిత్రను

బహిర్గతం చెయ్యడం కుదరదు అని  à°¸à±à°ªà±à°°à±€à°‚ కోర్టులో నిక్కచ్చిగా తేల్చేశాయి. పైగా దీన్ని సవాల్ చేస్తూ అన్ని  à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీలు ఏకమై భారత పార్లమెంట్ లో à°’à°• చట్టం

కూడా చేశాసాయన్నారు. దీన్ని సవాల్ చేస్తూ త్రిలోచన శాస్త్రి మరోసారి సుప్రీం కోర్టు ను ఆశ్రయించడం తో సుప్రీం ఆగ్రహించి, తానూ ఇచ్చిన తీర్పు పై చట్టం చెయ్యడం

వీలు పడదు అని, ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కచ్చితంగా తమ విద్యార్హతలు, నేర చరిత్ర, ఆర్థిక లావాదేవీలు తన నామినేషన్ లో వ్యక్తం చెయ్యాల్సిందే నని తుది

తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పు పర్యవసానమే. . . నేడు భారత దేశ వ్యాప్తంగా జరిగే ఏ ఎన్నికైనా ప్రతి అభ్యర్థి తన వ్యక్తిగత వివరాలతో పాటు, నేర చరిత్ర, ఆర్థిక వ్యవహారాలు

కూడా ప్రకటిస్తున్నారన్నారు. లేని పక్షంలో వారి దరఖాస్తు లు తిరస్కరించడం జరుగుతోందన్నారు.
 
ఈ విధమైన కేసుల పర్యవసానంగానే సహా చట్టం ఏర్పాటైందన్నారు. దీని

ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం లోనూ సంబంధిత వివరాలను కార్యాలయం బయట ప్రకటించాల్సిన భాద్యత ఉందన్నారు. 

తానూ 22500 కేసులకు పైగా తీర్పులు ఇచ్చానన్నారు.

అనంతరం పలు కేసుల వివరాలను వివరించారు.  à°ˆ సదస్సులో జిల్లాకు చెందిన పలువురు సహా స్వచ్చంద కార్యకర్తలు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dnsnews  #dnsonline  #dnsmedia  #dnsindia  #RTI  #information  #ACT  #Madabhushi  #Shidhar  #Vizag  #visakhapatnam 

#awareness

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam