DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు చెయ్యడానికి ఇష్టపడని అద్భుతాలు జగన్ చేసి చూపుతారు 

బాబు అండ్ కో అక్రమాలపై కొరడా తప్పదు 

నిరంతరం ప్రజలతోనే, ప్రజల వెంటే. . వైఎస్ జగన్ 

ముఖ్యమంత్రిగా తొలి క్యాబినెట్ లోనే అద్భుత

నిర్ణయాలు: 

అగ్రిగోల్డ్ బాధితులను బాబు ముంచాలను చూసారు.

వైకాపా అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి  . . .

విశాఖపట్నం, జూన్ 11, 2019 (DNS Online ): నలభై ఏళ్ళ రాజకీయ

జీవితం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెయ్యని, చెయ్యలేని, చెయ్యకూడదు అనుకున్న ప్రజా సంక్షేమ పధకాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసి చూపిస్తారని  à°µà±ˆà°¸à±€à°ªà±€

రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి

కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా సంక్షేమాన్ని నింపుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం

సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 
అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపాలన్న

ద్యేయంతో జగన్ ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారని అన్నారు.ప్రమాణస్వీకారం అనంతరం ఆయన చేసిన తొలి సంతకంతోనే రాష్ట్రాభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారన్న

విషయం ప్రజలకు అవగతం అయిందని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులను చంద్రబాబు నిట్ట నిలువునా ముంచాలని చూస్తే బాధితులకు అండగా నిలిచి

వైఎస్ జగన్ వారికి న్యాయం చేసే ప్రయత్నం ఆరంభించారన్నారు. 

గత ప్రభుత్వాల అవినీతి పాలన కారణంగా ప్రజాధనం పూర్తిగా పక్కదారి పట్టిందని, మరల వైసీపీ

సర్కార్లో ఆ ధనాన్ని సక్రమమార్గంలో జగన్ తప్పకుండా వినియోగిస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన అక్రమాలను బట్ట బయలు చేసి,

అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, రైతులకు భరోసా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల

కల్పన వంటి నిర్ణయాలు , వాటి అమలు జగన్ పాలనలోనే చూస్తున్నామని, తండ్రికి తగ్గ తనయునిగా సీఎం తన సుపరిపాలనతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారన్న

నమ్మకం తమకు ఉందని అన్నారు. à°ˆ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం,  à°«à°¾à°°à±à°–à°¿ , à°…à°‚à°— రామ ప్రసాద్ , బోణి శివ రామకృష్ణ , తదితరాలు పాల్గొన్నారు.

/>  

 

#dns  #dnsnews  #dnslive  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #amaravati  #cabinet  #andhra  #pradesh  #jagan  #meeting  #anganwadi  #raitu  #pension  #CPS  #koyya  #prasad  #reddy
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam