DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు రాజన్న బడిబాట 

విశాఖపట్నం, జూన్ 11 ,2019 (DNS Online ): కొత్త విద్య సంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న బడి బాట

కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12 నుంచి 15 వరకు అన్ని ప్రభుత్వం, ప్రయివేట్ పాఠశాలల్లో నిర్ధేశిత ప్రణాలికను అమలు

చెయ్యాల్సియుంటుంది. 

మొదటి రోజు : (జూన్ 12 , 2019 ) : .

.ఈ నెల 12 న తొలి రోజు ఉదయం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, యజమ్నాయం సహకారంతో పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం

చేసి, మామిడి తోరణాలతో పాఠశాలను అలంకరించాలి. పాఠశాల అసెంబ్లీ లో భారత జాతీయ పతాకావిశ్రాణ చేసి, రాజన్న బడి బాట ను ప్రారంభించాలి. కొత్తగా చేరిన విద్యార్థులను

ఆత్మీయంగా ఆహ్వానించాలి. అందరికీ పరిచయం చెయ్యాలి. గత విద్య సంవత్సరంలో జరిగిన పడవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ఫోటోలను, ప్రభుత్వం

పాఠశాల విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను, ఉపకారవేతనం వివరాలను అందరికీ తెలిసే విధంగా బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చెయ్యాలి. 
పిల్లలు వేసవి సెలవల్లో

గడిపిన అంశాలపై మాట్లాడించాలి.  à°—à°¤ విద్య సంవత్సరంలో పిల్లలు పొందిన అనుభూతులను  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à±‡ విధంగా ప్రోత్సహించాలి. ఉన్నత పాఠశాల విద్యార్థులకు à°ˆ విద్యా సంవత్సర

ప్రణాలికను వివరించాలి. ప్రయోగ శాలలను పరిశుభ్ర పరచాలి. 

రెండవ రోజు : (జూన్ 13 , 2019 ) : .

.రెండవ రోజు కార్యక్రమం లో ఈనెల 13 న విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణలో

భాగంగా మొక్కల ఆవశ్యకతను వివరించాలి. విద్యార్థులతో పాఠశాల ఆవరణలో మొక్కలు నటించాలి. వాటిని పిల్లలకు దత్తత ఇవ్వాలి. పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనానికి

అవసరమయ్యే కూరగాయల నిమిత్తం పాఠశాల లో వంటకై కూరగాయల పెంపు తోట ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, విత్తనాలను సేకరించేలా ప్రోత్సహించాలి.  à°ªà°¿à°²à±à°²à°²à± సేకరించిన

విత్తనాలను తదుపరి రోజుల్లో అనుకూల పరిస్థితుల్లో నటించే ప్రయత్నం చెయ్యాలి. ప్రకృతి ప్రార్ధనను చేయించాలి. అభినయ గేయాలు, పాటలు పాడించాలి. ఉన్నత పాఠశాలలో

గ్రంధాలయ పుస్తకాలతో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాలి. డిజిటల్ తరగతులు, వర్చువల్ తరగతులు ఉన్న చోట్ల చిత్ర కధలను, మహనీయుల జీవిత విశేషాలను ప్రదర్శించాలి.

 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• అవసరాలు కల్గిన పిల్లలను ప్రోత్సహిస్తూ వారిని కూడా పోటీలలో భాగస్వాములను చెయ్యాలి. 

మూడవ రోజు : (జూన్ 14 , 2019 ) :.

మూడవ రోజు (14 న) ప్రజా ప్రతినిధులు,

అధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతలు, గ్రామపెద్దలు, తల్లిదండ్రులను, పాఠశాలకు ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం చేయించాలి. ఉన్నత

పాఠశాలలో కాలనిర్ణయ పట్టికను తయారు చేసి తరగతుల్లో అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. పాఠ్య పుస్తకాలను సమరూప దుస్తులను విద్యార్థులకు అందించాలి. దాతల సహకారంతో

విద్యార్థులకు నోటు పుస్తకాలూ, పెన్నులు, మొదలైనవి పంపిణీ చెయ్యాలి. ప్రతి తరగతికి విద్యార్థి నాయకున్ని ఎన్నుకోవాలి, అదే విధంగా పాఠశాల విద్యార్ధిను నాయకున్ని

ఎన్నుకోవాలి.  à°‰à°¨à±à°¨à°¤ పాఠశాలలో బాలల సంఘాలను ఏర్పాటు చెయ్యాలి. వ్యాయమ క్రీడా పరికరాలను ప్రదర్శించి ఫిజికల్ లిటరసీ పై అవగాహనా కల్గించాలి. 

నాలుగవ  à°°à±‹à°œà± :

(జూన్ 15 , 2019 ) :.

ఆఖరి రోజున సమాజంలో వివిధ రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులను పాఠశాలకు ఆహ్వానించి వారిచే స్ఫూర్తి దాయక ఉపన్యాసాలను అందించాలి. ప్రఖ్యాతి గాంచిన

మహిళల వివరాలను తెలుపుతూ బాలికా విద్యార్భివృద్దికి తోడ్పడాలి.  à°ªà±à°°à°œà°¾ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కలిసి మధ్యాహ్న భోజన పధక

నిర్వాహకుల సహకారంతో సహపంక్తి భోజనం చెయ్యాలి.  à°¤à°²à±à°²à°¿à°¦à°‚డ్రుల సమావేశం నిర్వహించాలి. à°ˆ సమావేశంలో పాఠశాల ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ మౌలిక సదుపాయాల

కల్పనకు, పాఠశాల అభివృద్ధి సమాజ సహకారాన్ని కోరాలి. ఉన్నత పాఠశాలలో గత విద్య సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గౌరవ

సత్కారాన్ని అందించాలి. à°ˆ కార్యక్రమం లో పాఠశాల పూర్వ విద్యార్థులను భాగస్వాముల్ని చెయ్యాలి. 

నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పిల్లలను

భాగస్వాములను చెయ్యాలి. ఈ నాలుగు రోజులు నిర్వహించిన రాజన్న బడి బాట కార్యక్రమాలను క్రోడీకరించి, ఫొటోలతో కలిపి సామాజిక మాధ్యమాల ద్వారా ఉన్నతాధికారులకు

నివేదికను సమర్పించాలి. 

 

#dns  #dnsnews  #dnslive  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #amaravati  #cabinet  #andhra  #pradesh  #jagan  #meeting  #anganwadi  #raitu  #pension  #CPS  #jagan  #reddy  #rajanna  #badi  #bata  #education 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam