DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లౌకికం బంధన విసర్జనకు అనుమతివ్వండి . . . 

లౌకికం బంధన విసర్జనకు అనుమతివ్వండి . . . 

కళ్ళు చమర్చిన మాతాపితరుల వందన వేడుక 

సామాన్య లోకం నుంచి సన్యాశ్రమానికి బాల స్వామి

అడుగులు 

బాలస్వామి ఆశ్రమ స్వీకార కార్యక్రమాల అవతారిక ఆరంభం 

వైభవోపేతంగా వేడుకలకు శ్రీకారం : ఎంఎల్ఎన్ శ్రీనివాస్  

విజయవాడ,  à°œà±‚న్ 15 , 2019 (DNS Online ): లౌకిక

సమాజం లోని బంధనాల నుంచి విముక్తి కల్గించి, లౌకిక బంధన విసర్జనకు అనుమతి ఇవ్వవలసిందిగా పోణంగి కిరణ్ కుమార్ శర్మ (బాలస్వామి) తన తల్లిదండ్రులు ( పోణంగి హనుమంత

రావు, ప్రభావతమ్మ దంపతులు) లను ప్రార్ధించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. విజయవాడ కనక దుర్గ మాత సాక్షిగా కృష్ణా నదీ తీరంలో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి

కిరణ్ కుమార్ శర్మ సన్యాసాశ్రమ దీక్ష ప్రారంభం కార్యక్రమానికి శ్రీకారం లో భాగంగా శనివారం ఈ ప్రార్ధన జరిగింది. అంతకు ముందు వారిరువురికి పుష్పాభిషేకం చేసి,

బాల స్వామి లౌకిక బంధనాలు నుంచి విముక్తి కల్గించవలసింది అని ప్రార్ధించారు. ఈ సమయంలో అందరి కళ్ళూ ఉద్వేగ పూరితంగా చెమర్చాయి. ఇంతకాలం తమలో ఒకరిగా ఉన్న తమ

కుమారుడు ఈ రోజు నుంచి ఇహ బంధాలకు దూరం అవుతున్నారు అనే ఆవేదన ఒకటి కాగా, అత్యంత ప్రఖ్యాతి గాంచిన విశాఖ శ్రీ శారదా పీఠానికి ఉత్తరాధికారిగా నియమితులవుతున్నారు

అనే ఆనందం మరొక ప్రక్క దర్శనమిచ్చాయి. అయితే బహిర్గతంగా వ్యక్తం కాకపోయినా అంతర్గతంగా ఉండి ఉండవచ్చు. సన్యాస దీక్ష చేపట్టేందుకు తల్లి అనుమతి తప్పని సరి అని

అది శంకరుల చరిత్ర తెలియచేస్తోంది. అదే విధంగా ఈ అఖండ భారతావని లో సన్యాస దీక్ష స్వీకరించిన మహనీయులందరూ వారి అనుమతి తోనే ఆశ్రమ స్వీకారం చేయడం జరుగుతుంది.

ఒక్కసారిగా మాత పితరుల వందన మహోత్సవం అనంతరం బాలస్వామి ఆశ్రమ స్వీకార కార్యక్రమాల అవతారిక ఆరంభమయ్యింది. 

వైభవోపేతంగా వేడుకలకు శ్రీకారం : ఎంఎల్ఎన్

శ్రీనివాస్  

విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికార శిష్య తురీయాశ్రమ దీక్ష ను వీక్షించేందుకు వివిధ పీఠాధిపతులు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్

నర్సింహన్,  à°†à°‚ధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు, సహా, మంత్రి వర్గ సహచార్యులు, అధికారులు, అనధికారులు,

ఆధ్యాత్మిక వేత్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్టు ఆహ్వాన కమిటీ ప్రతినిధి, బ్రాహ్మణ సేవ సమాఖ్య అధ్యక్షలు ఎంఎల్ఎన్ శ్రీనివాస్ డిఎన్ఎస్ కు తెలిపారు.

 

సామాన్య జీవితం నుంచి సన్యాస ఆశ్రమ స్వీకారానికి ముందుగా నిర్వహించవలసిన యజ్ఞ యాగాదులు, యజ్ఞ యాగాదులు, శిరో ముండన, యజ్ఞోపవీత విసర్జన తదితర

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à°¨à± అవతారిక మొదలైంది.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ సన్యాసాంగ చతుష్కృత ప్రాయశ్చిత్తం తో వేడుకలు ఆరంభమయ్యాయని వివరించారు. à°ˆ కార్యక్రమానికి వీక్షించేందుకు ఉభయ

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #balaswamy  #vijayawada  #sanyasa  #deeksha  #bjp

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam