DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నువ్వంటే నువ్వు దెప్పి పొదుపుల మధ్య హోదా పై తీర్మానం 

ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో తీర్మానం

గత ప్రభుత్వ నిర్వాకంతో ఎంతో నష్టపోయాం

జాప్యం లేకుండా హోదా ఇవ్వాల‌ని అసెంబ్లీలో తీర్మానం .

.

à°…à°®‌రావ‌తి, జూన్ 18 ,2019 (DNS Online ) :  à°¨à±à°µà±à°µà°‚టే నువ్వు దెప్పి పొదుపుల మధ్య ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ప్రత్యేక హోదా పై తీర్మానం చేశారు. మంగళవారం అధికార ప్రతి పక్ష పార్టీలు

ఒకరి పై మరొకరు నిందారోపణలు చేయడంతో సభలో గందర గోళం ఏర్పడింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ పై నాటి అధికార పార్టీ తగిన ప్రయత్నం చేయడం లో

విఫలం అయ్యిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, తెలియకుండా వ్యర్ధ ప్రసంగాలు చెయ్యవద్దు అనడంతో వైఎస్ ఆర్

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒకరొకరిపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేసిన అనంతరం రాష్ట్రానికి

ప్రత్యేక హోదా ఆవశ్యకతను సభకు వివరించారు. నాటి ప్రభుత్వం లో తెలుగుదేశం, బీజేపీ లు మిత్రులుగా ఉన్నప్పటికీ చంద్రబాబు కనీసం హోదా పై ఎటువంటి ప్రయత్నం చెయ్యక

పోవడం వల్లనే కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ విషయం లో సీరియస్ గా భావించలేదన్నారు. ప్రస్తుతం ఇదే సభ ద్వారా తమకు ప్రత్యేక పేకేజీ అవసరం లేదని, హోదా మాత్రమే కావాలని

తీర్మానం చేశారు. దీన్ని సాధించే వరకూ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.  à°à°¦à± కోట్ల ప్రజల తరపున ప్రత్యేకహోదా కావాలని ప్రకటన చేస్తూ అసెంబ్లీలో

తీర్మానం ప్రవేశపెట్టారు.  à°à°ªà±€ ఆర్థికంగా నిప్పుల మీద నడవలసి వస్తుందని, ఉద్యోగాలు,అన్ని రంగాల్లో నష్టపోతామని తెలిసి మొండిగా ముందుకు

వెళ్ళామన్నారు. 

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ..

ఉమ్మడి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడంతో ఏపీకి అన్యాయం 
విభజనతో

రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది
గత ప్రభుత్వం నిర్వాకంతో అన్యాయం పెరిగింది
విభజన నష్టాలను ప్రత్యేక హోదాతోనే పూడ్చగలం
ప్రత్యేక ప్యాకేజీ వద్దు..హోదానే

కావాలని తీర్మానం చేస్తున్నాం
ప్రత్యేక హోదా కోసం మరోసారి తీర్మానం చేస్తున్నాం
రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారు.
ఆదాయాన్ని సరిగ్గా పంచలేదు
à°—à°¤

ఐదేళ్లలో రెవెన్యూ లోటు 66.362 కోట్లకు పెరిగింది.
సాప్ట్‌వేర్‌తో పాటు అన్ని రంగాల్లో అత్యుత్తమ ఆర్థిక కేంద్రం హైదరాబాద్‌
2015–2016లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14411, ఏపీ

ఆదాయం రూ.8397 కోట్లు
2014లో ఏపీ రుణం రూ.97 వేల కోట్లు, ఇప్పుడు రూ.258928 కోట్లు
ప్రతి ఏటా అసలు రూ.20 వేల కోట్లు, వడ్డీ మరో రూ.20 వేల కోట్లు చెల్లించాలి
మెజారిటీ ప్రజల

అభిప్రాయాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించారు
విభజనతో ఏపీకి 59 శాతం జనాభా ఉంటే ఆదాయం మాత్రం 47 శాతం వచ్చింది
విభజన సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు

పార్లమెంట్‌లో చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేదు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam