DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆపరేషన్ ఆకర్ష అరకు నుంచే ఆరంభం, భాజపా లోకి గీత

ఆపరేషన్ ఆకర్ష అరకు నుంచే ఆరంభం. 

బీజేపీ లో జన జాగృతి విలీనం

అరకు లోక్ సభ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను భాజపా లోకి . . . . 

న్యూఢిల్లీ, జూన్ 18 , 2019 (DNS Online ) :

రానున్న ఎన్నికలకు ఆంధ్ర లో అడుగు పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమాన్ని అరకు నుంచే మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే అరకు లోక్ సభ మాజీ

ఎంపీ కొత్తపల్లి గీతను భారతీయ జనతా పార్టీ లోకి ఆహ్వానించడంతో ఇప్పడి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. మంగళవారం గీత బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర హోమ్

శాఖా మంత్రి అమిత్ షా ను కలిసి ఆమె ఆధ్వర్యవం లోని జన జాగృతి పార్టీని బీజేపీ లో విలీనం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా ఆమెను అభినందించారు. స్వచ్ రాజకీయ ఉద్యమం పై

సంపూర్ణ విశ్వాసం కల్గిన గీత వంటి వారు బీజేపీ కి అవసరమని, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆమె నాయకత్వం తప్పని సరి అన్నారు. గత ఎన్నికల్లో ఒక ప్రణాళిక ప్రకారం ఆమె తన

బృందాన్ని నడిపించిన విధానాన్ని గమనించామన్నారు. ఆమె తన ఆధ్వర్యవం లో నడుస్తున్న పార్టీని మొత్తం బీజేపీ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 
అంతకు ముందు

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ఇంచార్జి రామ్ మాధవ్ ను కలిసి తన రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాతే రామ్ మాధవ్ నేతృత్వంలో అమిత్ షా ను

కలిసినట్టు తెలుస్తోంది. 

 

 

#dns  #dnsnews  #dnslive  #dnsonline  #dnsmedia  #dnstv  #bjp  #amit  #shah  #kothapalli  #geetha  #Araku  #MP  #Jana  #Jagruti  #party  #merge  #Andhrapradesh  #Andhra  #Pradesh  #Vizag  #Visakhapatnam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam