DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజ్యసభలో టీడీఎల్పీ బీజేపీ లో విలీనం . . . రామ్ బాణం దూసుకు పోయింది

ఆంధ్రా లో రామ్ బాణం బాగా పనిచేసింది

బాబు యూరప్ à°•à°¿ . . TDP MP లు  à°¬à±€à°œà±‡à°ªà±€ లోకి జంప్. . .

మమ్మల్ని వేరే గ్రూప్ గా గుర్తించండి.: రాజ్యసభకు ఎంపీ లు లేఖ

 

కాకినాడ లో కీలక నేతల సమావేశం ..

ఆపరేషన్ ఆకర్ష అరకు నుంచి . . . ఢిల్లీ దాకా. . .

బాబు ని నమ్మిన వాళ్ళే నట్టేట ముంచుతున్నారు

విశాఖపట్నం, / కాకినాడ,

జూన్ 20 ,2019 (DNS Online ): తెలుగుదేశానికి మూల స్థంబాలు అని చంద్రబాబే చెప్పుకున్న సుజనా చౌదరి, సి ఎం రమేష్, సహా మరో ఇద్దరు రాజ్య సభ సభ్యులు తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టు

రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ ఇవ్వడం తో ఒక్కసారిగా ఆంధ్ర ప్రదేశ్ ఉలిక్కి పడింది. వీరితో పాటు టి జి వెంకటేష్, గరికిపాటి మోహన్ రావు లు సహా త్వరలోనే

బీజేపీ లో చేరేందుకు à°°à°‚à°—à°‚ సిద్ధమైపోయింది. తోట సీత మహాలక్ష్మి కూడా వీరికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. 

*ఆంధ్రా లో రామ్ బాణం బాగా పనిచేసింది* :

à°—à°¤

ఏడాది కాలం బద్నాం చేసిన చంద్రబాబు నాయుడు, అతని అనుచరగణానికి గుణపాఠం చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ వదిలిన రామ్ బాణం పనిచెయ్యడం మొదలు పెట్టింది. కేంద్రం

నుంచి వచ్చిన నిధులు, ప్రాజెక్ట్ లను కేవలం తన స్వార్జిత ఘనతగా ప్రచారం చేసుకుని, బీజేపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తి బద్నాం చేసి, ఇటీవల ఎన్నికల్లో కనీస ఓటు కూడా

నమోదు కాకుండా చేయడంతో బీజేపీ అగ్ర పధం ఉగ్రరూపం దాల్చింది. దీంతో అదను చూసి వేటు వేసేందుకు క్షేత్ర స్థాయిలో పని చెయ్యడం మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే

రామ్ మాధవ్ అనే ఒక మిసైల్ ను తెలుగు రాష్ట్రాల నిర్వహణకు పంపింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలితం ఈ రోజు కనిపించింది. గతంలో వీరిలో ఇద్దరి ఎంపీ ల

ఆర్ధిక లావాదేవీల నిర్వహణ పై ఐటి దాడులు కూడా జరగడం గమనార్హం. 

ఆపరేషన్ ఆకర్ష అరకు నుంచి మొదలైంది . . 

ఆపరేషన్ ఆకర్ష అరకు నుంచి మొదలైంది . . ఇక రాష్ట్ర

వ్యాప్తంగా అన్ని జిల్లాల వెంటా సాగుతూ ఢిల్లీ వరకు వెళ్ళింది అనడానికి ఈ రోజు జరిగిన ఘటనే నిదర్శనంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం అరకు మాజీ ఎంపీ

కొత్తపల్లి గీత బీజేపీ లో చేరడం తో పాటు తన పార్టీ జన జాగృతి ని సైతం బీజేపీ లో విలీనం చేయడం తోనే మొదలైంది. అయితే దీని ప్రభావం తెలుగుదేశానికి రాదు అని అందరూ

అనుకున్నప్పటికీ చంద్రబాబు కుటుంబం తో సహా ఐరోపా పర్యటనకు వెళ్లిన సమయాన్ని ముహూర్తంగా ఖరారు చేయడంతో టీడీపీ పునాదులు కదిలి పోయినట్టే కనిపిస్తున్నాయి. 
 
/> కాకినాడలో కీలక నేతల సమావేశం :. . .

కాకినాడ లో తెలుగు దేశం కీలక నేతల అంతరంగ సమావేశం జరుగుతోంది. ఎంపీ లు పార్టీని వీడుతున్నట్టు సమాచారం అందడం తో వారి

కనుసన్నల్లో నడుస్తున్న నేతలందరూ వారి వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 
 
కక్ష సాధింపు చర్యే ఇది :  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿  

ఇది చంద్రబాబు పై కక్ష సాధింపు

చర్యగా కొందరు టిడిపి అభిమానులు ప్రకటించడం గమనార్హం. సుజనా చౌదరి, సీఎం రమేష్ లను చంద్రబాబు ఏంతో విశ్వసించారని అయితే వీరు ఇలా మోసగించడం తగదన్నారు. 

గతం

లోనూ టీడీపీ ప్రారంభించినట్టు గా ప్రచారం లో ఉన్న ఎన్ టి రామారావు నుంచి ఇదే చంద్రబాబు బలవంతంగా లాక్కున్న ఘటనలు కూడా ఇదే ప్రజలు చూసారు. ప్రస్తుతం ఇదే చంద్రబాబు

కు నలుగురు ఎంపీలు గట్టి ఝలక్ ఇవ్వడం కూడా చూస్తున్నారు. 

నేను సంఘ పరివార్ నుంచే వచ్చా: టిజి వెంకటేష్

తానూ కొత్తగా బీజేపీ లో చేరడం లేదని, తానూ సంఘ్

పరివార్ నుంచే రాజకీయాల్లోకి వచ్చానని, భారతీయ యువమోర్చా ఉపాధ్యక్షునిగా పనిచేసినట్టు ఎంపీ టిజి వెంకటేష్ తెలిపారు. మధ్యలో ఇతర పార్టీల్లోకి వెళ్లి, ప్రస్తుతం

తిరిగి మాతృ సంస్థకు వస్తున్నట్టు ఢిల్లీ లో ప్రకటించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam