DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూర్పు నావికా దళం లో ఆకట్టుకున్న ఆక్వా యోగా 

ఆకట్టుకున్న నేవీ యోగ . . . 

ఘనంగా  à°…ంతర్జాతీయ యోగ దినోత్సవం. . 

విశాఖపట్నం,జూన్ 21 2019 (DNS Online ): 5 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు

ఉదయం తూర్పు నావికా దళం అత్యంత వైభవంగా యోగ సాధన ప్రిక్రియను నిర్వహించారు. సుమారు 18 ,000 మంది నావికాదళ సిబ్బంది, సాధారణ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొని, సామూహిక

యోగ సాధనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య ( ఆయుష్ ) శాఖ ఆధ్వర్యవం లో జరిగిన ఈ కార్యక్రమం లో యోగ ప్రక్రియ పై క్విజ్ లు, వకృత్వ పోటీలు నిర్వహించారు.

సుశిక్షుతులైన యోగ సాధకులు  à°¯à±‹à°— పై సంపూర్ణ అవగాహనా, నిత్యం చేయవలసిన సాధన తెలియచేసారు. సాగర జలాలపై విధుల్లో ఉన్న సిబ్బంది ఐ ఎన్ ఎస్ సింధు ధ్వజ్, ఐ ఎన్ ఎస్ సుమేధ, ఐ

ఎన్ ఎస్ రాజపుట్, తదితర  à°¨à±Œà°•à°²à±, జలాంతర్గాముల వద్దే  à°¯à±‹à°—ాసనాలను చేపట్టారు. à°—à°¤ నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగ దినోత్సవాల్లో భాగంగా పలు యోగ

సాధన శిబిరాలను చేపట్టారు. అత్యంత వైభవంగా, ప్రత్యేకంగా గత రెండేళ్లు గా యుద్ధ నౌకల పైనే యోగ శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ యోగా దినోత్సవం లో భారత నావికా దళ

సిబ్బంది తో పాటు పర్యటనకు వచ్చిన విదేశీ బృందాల సభ్యులు కూడా కొన్ని శిబిరాల్లో పాల్గొనడం గమనార్హం.  

నావికా దళ సిబ్బంది కి, వారి కుటుంబ సభ్యులకు వేసవి

శిబిరాలు, శీతాకాల శిబిరాలు కూడా నిర్వహించి, విద్యార్థులకు మానసిక ఆరోగ్య విధానాలపై అవగాహనా కల్పించారు. మొట్టమొదటి సారిగా నీటి లో యోగ సాధన ( ఆక్వా యోగా)

ప్రదర్శించిన బాల బాలికలను అందరూ అభినందించారు. ఇప్పడికే నావికాదళ విద్యా సంస్థల్లో యోగ ను ఒక పాఠ్యంశంగా చేర్చారు.

 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #vsakhapatnam  #Navy  #indian  #Yoga  #International  #Day 

#Ship  #sea  # waters  #INS  #Sindhudhwaj   #Sumedha

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam