DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏజన్సీ లో రోడ్లు, విద్య, వైద్యం మెరుగుదల కు కృషి. : జేసీ శివశంకర్

జిల్లా లోని ప్రధాన సమస్యలపై అవగాహనా ఉంది : 

సంయుక్త కలెక్టర్ గా శివ శంకర్ భాద్యతలు స్వీకరణ . . .

విశాఖపట్నం, జూన్ 25 , 2019 ( DNS Online ) : విశాఖ జిల్లా లోని ప్రధాన

సమస్యలపై అవగాహనా ఉందని, వాటిని సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని సంయుక్త కలెక్టర్ ఎల్. శివశంకర్ తెలిపారు. బుధవారం ఆయన పదవి భాద్యతలు చేపట్టారు. ఈ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో 11 నెలలు పాడేరు సబ్ కలెక్టర్ గాను ,6 నెలలు ఐటిడిఎ ఇంచార్జి  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± అధికారిగా పనిచేసిన అనుభవం ఉందని, గిరిజనులు

ఎదుర్కొంటున్న సమస్యలపై కొంత అవగాహనా ఉందన్నారు. మొట్టమొదటి సరిగా పట్టణ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత కల్గిన విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ గా భాద్యతలు

చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రధానంగా ఏజన్సీ లో రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్యం తదితర అంశాల మెరుగుదల పై దృష్టి సారిస్తామన్నారు. నూతన సంయుక్త కెలెక్టర్ గా

భాద్యతలు తీసుకున్న సందర్బంగా కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. 

విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన శివశంకర్,

గతంలో ఏసీటీవో, ఎంపిడిఓ గా విధులు నిర్వహించి, 2013 లో సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. రెండు సంవత్సరాల శిక్షణలో భాగంగా గుంటూరు

అసిస్టెంట్ కలెక్టర్ గాను, 2015 లో పాడేరు సబ్ కలెక్టర్ గాను, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారుగాను విధులు నిర్వహించారు. 

 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia 

#dnsonline  #vizag  #visakhapatnam  #ganta  #srinivasarao  #telugudesam  #party  #TDP  #chandrababu  #naidu  #YS  #Jagan  #Mohan  #Reddy  #vijayawada  #karakatta  #YSR  #joint  #collector  #shiva  #shankar  #Agency

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam