DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యవసాయానికి ఉదయమే 9 గంటల విద్యుత్ : ఈపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి

వ్యవసాయానికి ఉదయమే తొమ్మిది à°—à°‚à°Ÿà°² విద్యుత్ :సీఎండీ   

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు  

ఏపిఈపిడిసిఎల్ సీఎండీ గా నాగలక్ష్మి సెల్వరాజన్

బాధ్యతల స్వీకరణ..

విశాఖపట్నం, జూన్ 27 , 2019 ( DNS Online ) : వ్యవసాయ అవసరాలకు ఉదయపు వేళల్లోనే నిరంతరాయంగా తొమ్మిది గంటల సమయం విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్

తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సి.ఎం.డి. నాగలక్ష్మి సెల్వరాజన్ తెలిపారు. విశాఖ నగరం లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ

సందర్బంగా మాట్లాడుతూ  à°¸à°‚స్థ చైర్మన్ à°—à°¾ తనపై గురుతర భాద్యతలను పెట్టిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ ధన్యవాదములు తెలిపారు. లక్షలాది

మంది ఆహారపు అవసరాలను తీరుస్తున్న రైతాంగానికి తగిన ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గతంలో వివిధ వేళల్లో వ్యవసాయ అవసరాలకు విద్యుత్

అందించడం జరిగిందని, ముఖ్యమంత్రి సూచనల మేరకు విద్యుత్ సంస్థ వినియోగదారుల్లో రైతాంగానికి పెద్దపీట వెయ్యడం జరిగిందన్నారు.  
ముఖ్యంగా వ్యవసాయ పంపుసెట్లకు 9

గంటల విద్యుత్తును నిరంతరాయంగా పగటిపూట అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 80 శాతం ఫీడర్లలో పగటిపూట విద్యుత్తును

అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో మిగిలిన ఫీడర్లలో కూడా పూర్తిస్థాయిలో పగటిపూట విద్యుత్ అందించేందుకు అవసరమైన చర్యలు ఈ

మార్చి, 2020  à°¨à°¾à°Ÿà°¿à°•à°¿ పూర్తి చేస్తామన్నారు.  

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రాధాన్యత అని తెలిపారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్

వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తానన్నారు. విశాఖ సిటిలో ఏర్పాటు చేస్తున్న భూగర్భ విద్యుత్తు కేబుల్ వ్యవస్థ

పనులను ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  à°µà°¿à°¦à±à°¯à±à°¤à± సంబంధిత సమస్యలు పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1912

à°•à°¿ ఫిర్యాదు చేయాలన్నారు.  

సంస్థ సి.ఎం.డి.గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి సెల్వరాజన్ కు ఏపిఈపిడిసిఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కె.రాజబపయ్య, చీఫ్ జనరల్

మేనేజర్లు, కార్పొరేట్ కార్యాలయ సిబ్బంది, సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల వివిధ విభాగాల సిబ్బంది, వివిధ యూనియన్ల, ఉద్యోగ సంఘాల నాయకులు అభినందనలు

తెలిపారు.

 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #botsa  #andhra  #pradesh  #minister  #satyanarayana  #municipal  #airport  #YSR  #APEPDCL  #CMD  #Nagalakshmi  #Selvarajan  #Gurudwara  #Corporate

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam