DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి అభివృద్ధి కి రూ.30 కోట్లతో మాస్టర్ ప్లాన్: తమ్మినేని సీతారామ్

రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ –

శ్రీకాకుళం, జూలై 2, 2019  ( డిఎన్‌ఎస్‌) : రాష్ట్రం లో అత్యంత అరుదైన సూర్యదేవాలయ దేవస్థానం పరిధిలోని ఆధ్యాత్మిక

కేంద్రాలను 30  à°•à±‹à°Ÿà±à°² రూపాయలతో అభివృద్ధి చేసేందుకు  à°…రసవల్లి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ తెలిపారు.

మంగళవారం ఆలయ దర్శనానికి వచ్చిన అయన ఆలయ పరిసరాల అభివృద్ధి పై ఆలయ సిబ్బంది ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు రూ.30కోట్ల

నిధులను మంజూరుచేసినట్లు చెప్పారు. 
అరసవల్లి మాస్టర్ ప్లాన్ అమలుకు 30 కోట్ల రూపాయల నిధులను మంజూరుచేయడం జరిగిందన్నారు. ఈ నిధులను పూర్తిగా ఖర్చుచేసి ఆలయ

అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు.

          సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవమని, ఆరోగ్యప్రధాత అని అన్నారు. తన విధి నిర్వహణలో క్రమం

తప్పకుండా, సమయం తప్పకుండా ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే కలియుగ ప్రత్యక్ష దైవం  à°¸à±‚ర్యభగవానుడని, ఇటువంటి మహాపుణ్యక్షేత్రం మన జిల్లాలో ఉండటం

గర్వకారణమన్నారు. అలాగే ప్రతీ ఒక్కరూ వారి విధులను సక్రమంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో నామినేషన్

వేయడానికి ముందుగా స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని,          à°°à°¾à°·à±à°Ÿà±à°° శాసనసభాపతిగా బాధ్యతలను తీసుకున్న అనంతరం మరలా స్వామి వారిని దర్శించుకోవడం

సంతోషకరంగా ఉందన్నారు. బుధవారం నుండి శాసనసభా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని,సభను సజావుగా నడిపించేందుకు స్వామి వారి ఆశీస్సులను కోరినట్లు ఆయన

చెప్పారు. శాసనసభలో 100 మందికి పైగా నూతన సభ్యులు ఉన్నారని, వారంతా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆయన స్పష్టం చేసారు.

రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించుకునేందుకు శాసనసభ చక్కని వేదికని, కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా తమ సమస్యలను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు సభ్యులు ముందుకు

రావాలని ఆయన పిలుపునిచ్చారు.               à°—à°¤ ప్రభుత్వ మాదిరిగా కాకుండా మంచి సభ, సంప్రదాయాలను సభలోకి తీసుకురావాలనేదే తమ ధ్యేయమని, సభను నూతనపంథాలో విజయవంతంగా

నడిపించేందుకు తన వంతు కృషిచేస్తానని ఆయన  à°ˆ సందర్భంగా వివరించారు.

అంతకు ముందు శాసనసభాపతి దంపతులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి

వై. భద్రాజీ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ సభాపతి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి

వారి తీర్ధప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేసారు. 

          à°ˆ కార్యక్రమంలో à°¡à°¿.యస్.పి చక్రవర్తి, ఆలయ కార్యనిర్వహణ అధికారి వై.భద్రాజీ, జిల్లా పర్యాటక అధికారి

యన్.నారాయణరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యాలయ పర్యవేక్షకులు ప్రసాద్, సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి, శిమ్మ వెంకటరావు, సంచాన భీమారావు, ఆలయ

అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam