DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంటింటా  మంచినీళ్లు అమృత పానమే : రాజమహేంద్రి ప్రత్యేక అధికారి

ఇంటింటా  à°®à°‚చినీళ్లు అమృత పానమే : మురళీధర్ రెడ్డి

నగర పరిధి లో పేదలకు మంచి నీటి కుళాయిలు 

రాజమహేంద్రి ప్రత్యేక అధికారి మురళీధర్ రెడ్డి

...

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి జూలై 03, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±à°°à°¤à°¿ పేద కుటుంబానికి అమృత పథకం ద్వారా 
రాజమహేంద్రవరం నగర

ప్రజలకు మంచి నీటి కుళాయి మంజూరు చేస్తున్నామని రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి

తెలిపారు. జిల్లా కలెక్టర్ బుధవారం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కు విచ్చేసి కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు

కార్పొరేషన్ కార్యాలయం వివిధ విభాగాలను పరిశీలించారు. ఫీర్యాదు విభాగంలో ఏ విధంగా ప్రజల నుండి పిర్యాదు ఎలా స్వీకరిస్తున్నారు, వాటిని ఏ విధంగా

పరిష్కరిస్తున్నారు అనే అంశాలను అయన పరిశీలించారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ కార్యాలయం లో మున్సిపల్ కార్పొరేషన్ లోని అన్ని విభాగాల ముఖ్య అధికారులతో

సమీక్షించారు. అనంతరం  à°µà°¿à°²à±‡à°•à°°à±à°²à°¤à±‹ మాట్లాడుతూ నగర పరిధిలో ఇంకా పచ్చదనం ఉండాలని వీటికొఱకు మరింత దృష్టి పెడతామని అన్నారు. మురుగునీరు బయటకు వెళ్లి ప్రాంతంలో

ఎస్.టి.పి.ప్లాంటు మరో రెండు నగర పరిధిలో ఏర్పాటు చేయవలసి ఉందని అన్నారు. గోదావరినది కాలుష్యం కాకుండ తగినచర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. కొత్త

పాలకవర్గం వచ్చేంత వరకు ప్రజలకు పాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన భాద్యత మన పై ఉందని అన్నారు. నగరంలో అక్రమ కట్టడాలు గుర్తించటం జరిగిందని వాటిపై

తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైన్ల లో ప్లాస్టిక్ వస్తువులు వేయకుండ ప్లాస్టిక్ ని కూడా నిషేధించటం జరిగిందని అన్నారు. రైతులు అమ్మిన ధన్యం నకు

గిట్టుబాటు ధర అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ, అదనపు కమిషనర్ సత్యనారాయణ, ఎస్.ఈ-ఓం ప్రకాష్, ఆరోగ్య అధికారి ఎమ్.వి.మూర్తి,

డిప్యూటీ కమిషనర్ టి.రాజగోపాల్, మేనేజరు కె.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #vijayawada  #amaravati  #rajahmundry  #east   #godavari  #special  #officer  #muralidhar  #reddy  #municipal  #corporation
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam