DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ది పనుల్లో అలసత్వం తగదు : మంత్రి వెలంపల్లి 

కాల్వలు క్లియర్ చెయ్యకపోతే అనారోగ్యం తప్పదు 

ప్రజలు మెచ్చే విధంగా పని చెయ్యాలని సిబ్బందికి సూచన 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్

అమరావతి). . .. 

అమరావతి, జులై  06 , 2019 (డిఎన్‌ఎస్‌) : దీర్ఘకాలికంగా ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులకు అలసత్వం తగదని, ప్రజలు మెచ్చే విదం à°—à°¾

పనిచేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. శనివారం తన నియోజక వర్గ పర్యటనలో బాగంగా మూడవ రోజు 32 వ డివిజన్ చిట్టి నగర్ సెంటర్

నుంచి పర్యటన ప్రారంభించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నియోజక వర్గ అభివృద్ది పై చిన్న చూపు చూపిందని ఈ ప్రాంతంలో రోడ్లు తాగునీరు సదుపాయం, వీధి దీపాలు ఎర్పాటు

చెయ్యటం లో కూడా నిర్లక్ష్యం వహించందని కొండ ప్రాంతంలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ తాగు నీరు, కాలువల పూడికల తీసివేత కార్యక్రమం రోజుల్లో నే

ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా ఇసుక కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామన్నారు.

కటికెల వారి వీధి

మస్తాన్ వీధి, పోతిన పాపాయమ్మ సందులలో పర్యటించిన మంత్రి కి స్థానికంగా ఉన్న కాలువలను మూసి వేస్తున్నారని దీనితో మురుగు రోడ్డు మీదకు వస్తుందని అంతర్గత రహదారుల

తో పాటు తాగునీరు ఎర్పాటు చెయ్యాలని కోరారు. కొండ ప్రాంతంలో వర్షం వస్తె కొండ చర్యలు విరిగి పడుతున్నాయని, విది దీపాలు లేక రాత్రి పూట ఇబ్బంది పడుతున్నాం అని

సమస్యలు తెలుసుకున్న మంత్రి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 

బంగారయ్య కొట్టు కొండ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య కారణం గా కాలువలో

పూడికలు బాగా పేరుకు పోయాయని మంత్రి  à°¦à±à°°à±à°·à±à°Ÿà°¿ à°•à°¿ తీసుకు వచ్చారు. à°ˆ ప్రాంతం లో కాలువల పూడికలు తీసివేత కార్యక్రమం వెంటనే చేపట్టాలని ఆంజనేయ వాగు సెంటర్ నుంచి

చిట్టినగర్ సెంటర్ వరకూ ఉన్న మెయిన్ రోడ్డు కు ఇరువైపుల ఉన్న కాలువల్లో పేరుకు పోయిన వ్యర్ధాలను తక్షణం తొలగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట

మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #endowments  #archakas  #training  #vizag  #visakhapatnam  #vijayawada  #SITA #vellampalli  #srinivas  #malladi  #vishnu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam