DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ వరహా. . . . భూ సంరక్షక గోవిందా. . .  నమో నమ:

వరాహ రూపంలో జగన్నాధుడు-  à°¤à°°à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ భక్త జనం

వైభవంగా సాగుతున్న జగన్నాధుని ఆషాఢ మాసోత్సవాలు  . . .

విశాఖపట్నం, జులై  07 , 2019 (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ద విదియ

పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని మూడవ రోజు అవతారాల్లో భాగంగా ఆదివారం విశాఖనగరం లోని జగన్నాధ స్వామి భక్తులకు భూ సంరక్షక వరాహ స్వామి అవతారం లో

దర్శనమిచ్చారు. ప్రళయ సమయంలో సముద్ర గర్భంలోకి వెళ్లిన భూ మండలాన్ని సంరక్షించేందుకు శ్రీమహావిష్ణువు అవతరించిన రూపం ఆదివరాహం. సముద్ర గర్భంలోకి వెళ్లగలిగి,

భూమండలాన్ని బయటకు తీసుకు వచ్చే అవకాశం ఉన్న ఏకైక రూపం వరాహం మాత్రమే. స్వామి ఈ రూపాన్నే ధరించి సకల జీవులను రక్షించినట్టు పురాణాలు మనకి

తెలియచేస్తున్నాయి.

ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహ స్వామి ఇదే అవతారం లో విశాఖ సమీపంలోని సింహగిరి క్షేత్రం లో కూడా దర్శనమిచ్చారు. అందుకే సింహగిరి స్వామి

శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి అని పిలుస్తారు. 


ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే రథయాత్రను పురస్కరించుకుని  à°¦à±‡à°¶ వ్యాప్తంగా అన్ని

ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ నగరంలోని జగన్నాధ ఆలయాల్లోను రథయాత్రను గురువారం సాయంత్రం చేపట్టి అనంతరం స్వామిని దశావతార అలంకారం లో

దర్శింపచేస్తున్నట్టు టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధ స్వామి ఆలయ ఈఓ బండారు ప్రసాద్ à°¡à°¿ ఎన్ ఎస్ కు తెలిపారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ దశాబ్దాలుగా విశాఖపట్నం

టౌన్ కొత్తరోడ్ లో గల జగన్నాధ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ఆషాఢమాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భారీ శోభాయాత్రగా స్వామిని కొత్త రోడ్ నుంచి చౌల్ట్రీ

వరకూ తీసుకు వచ్చి రానున్న పది రోజుల పాటు స్వామిని దశావతారాల అలంకారం లో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా రెండవ రోజైన శని వారం స్వామి

కూర్మ అవతారం లో దర్శనమిచ్చారన్నారు. 

కార్యక్రమాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా

చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేలు కొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చనల,

శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగనున్నాయి.  

1964 నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ముందుగా

 à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి.  

దశావతార వైభవం :.

దీనిలో భాగంగా   జూలై 5 ( తదియ శుక్ర వారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  6à°¨ (చవితి శని వారము)

 à°•à±‚ర్మావతారము, 7 à°¨ (పంచమి అది వారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 8 à°¨ (  à°·à°·à±à° à°¿ సోమ వారము ) నృసింహవతారము, 9 à°¨ ( సప్తమి మంగళ వారము )  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°®à± తో పాటు పరశురామావతారము, 10 à°¨ (  à°…ష్టమి, తత్కాల నవమి

బుధవారం)  à°¨à°¾à°¡à± రామావతారము,  11 à°¨ ( దశమి గురువారం) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 12 నాడు (తొలి ఏకాదశి శుక్రవారము)  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà± అవతారం లో  (పాల కడలిలో వేంచేసిన శ్రీ

మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తులకు  à°¦à°°à±à°¶à°¨à°‚) స్వామి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఆఖరి రోజు అవతారాన్ని తదుపరి  à°ˆà°¨à±†à°² 13 à°¨ ద్వాదశి శనివారం రోజు భక్తులకు దర్శనం

కల్పించనున్నట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam