DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చికిత్స ఏంటో  తెలియకుండానే నెలన్నరగా కెజిహెచ్  లో  పడిగాపులు

ఆపదలో ఉన్న పేదలను à°ˆ పెద్దాసుపత్రి ఆదుకోదా ?  

à°ˆ పెద్దాసుపత్రి పేదల సేవలు కోసమా? లేక సిబ్బంది జీతాల కోసమా?  

విలేకరుల మీదే విరుచుకు పడే వీరులు

వీరు 

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  10 , 2019 (డిఎన్‌ఎస్‌): నెలరోజులుగా తమకి ఏమి చికిత్స జరుగుతోందో తెలియకుండానే à°’à°•

అభ్యాగ్య నిరు పేద కుటుంబం విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రిలో పడిగాపులు కాస్తోంది. విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన మాన్యాల అప్పన్న (50 ఏళ్ళు) గేదె కు

పాలు పితుకుతుండగా గేదె తన్నడం తో తీవ్ర గాయాలపాలవ్వడంతో జూన్ నెల 6 న విశాఖ కెజిహెచ్ లో చికిత్సకై చేరడం జరిగింది. గేదె ఇతని మెడపై బలంగా తన్నడంతో స్పృహ

కోల్పోవడంతో పెద్దాసుపత్రి వైద్యులు చికిత్స చేస్తున్నట్టు తెలియచేసారు. ఇతని కుటుంబ సభ్యురాలు కుమారి నిరక్షరాస్యులు కావడం తో, గత నెల రోజులుగా అప్పన్నకు

జరుగుతున్న వైద్యం ఏంటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఊరు కానీ ఊరు కావడం, పైగా ఇంటి దగ్గర కుమారికి చిన్న పిల్లలు ఉండడం తో మరింత మనస్థాపానికి

గురవుతున్నారు. 

మెడ ఎముకలు అతకడం à°…à°‚à°¤ కష్టమా  ?

అప్పన్నకు వచ్చిన కష్టం ఏమిటంటే గేదెకి పాలు పితుకుతుండగా కాలుతో తన్నడం వలన మెడ ఎముక విరిగింది.

కొన్ని మెడ దగ్గర నరాలు కూడా దెబ్బతిన్నాయి.  à°Žà°‚తో  à°…నుభవం కల్గిన కెజిహెచ్ వైద్య బృందానికి à°ˆ నరాల చికిత్స చెయ్యడం పెద్ద బ్రహ్మ విద్యేమీ కాదు. పైగా ఇలాంటి

కేసులను ఎన్నింటినో సునాయాసంగా విజయవంతంగా చికిత్స చేసిన నేర్పురులు à°ˆ కెజిహెచ్ వైద్యులు. మరి కారణాలు ఏంటో  à°¤à±†à°²à°¿à°¯à°¡à°‚ లేదు గానీ à°ˆ వైద్యులు అప్పన్నకి చికిత్స

మాత్రం చెయ్యడం లేదు...

సిబ్బంది తీరు మారాలి : 

అప్పన్నకు రక్తం ఎక్కించవలసిన అవసరం కొద్దీ కుమారి స్థానిక టీవీ ఛానెల్ విలేకరి వివేక్ బాబు ఫోన్

చెయ్యడం తో రక్తదానం చేసేందుకు కెజిహెచ్ కు చేరుకున్నారు. తన పరిచయం చెప్పకుండా. . తానూ రక్తదానం చేసేందుకు వచ్చానని, ఏమి చెయ్యాలో చెప్పమని కెజిహెచ్ సిబ్బంది ని

కోరగా పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో. . . హ్యేయ భావంతో సమాధానం చెప్పడమే కాకుండా వివేక్ ను విసుక్కోవడంతో చాలా చికాకు అనిపించింది. ఇదే పేషంట్ పరిస్థితి లో మీ

ఇంట్లో వాళ్ళు గానీ, ఇక్కడ వైద్యుల బంధువులు గానీ ఉంటె ఇలాగె మాట్లాడతారా అని సిబ్బంది ని నేరుగా ప్రశ్నించడం తో మరింత వాగ్వాదం చెయ్యడం గమనార్హం. 

ఎందరో

మహానుభావులు ఈ పెద్దాసుపత్రి నిర్మించింది పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికో లేక సిబ్బంది కి జీతాలు ఇవ్వడానికో తెలియడం లేదనే భావన అందరిలోనూ బలపడక ముందే

à°ˆ కెజిహెచ్ వైద్యులు, సిబ్బంది పని తీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

పేషంట్  à°ªà±‡à°°à±  : అప్పన్న, 
వయసు : 50 సంవత్సరాలు, పురుషుడు 
గ్రామం: ద్వారపూడి, విజయనగరం

జిల్లా
కె జి హెచ్ లో చేరిన తేదీ : జూన్ 6 ,2019 .
సహాయకురాలు పేరు : కుమారి. . ఫో :  7286849178

 

#dns  #dnslive  #dnsonline  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #vijayanagaram  #KGH  #dwarapudi  #treatment  #hospital #doctor  #blood  #cow  #bufellow

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam