DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆ ఆరుగురికి బీజేపీ లోకి ప్రవేశం లేదు : కన్నా లక్ష్మీనారాయణ

అవినితి చంద్రబాబు పాలన పై  à°¸à°¿à°¬à°¿à° విచారణ జరపాలి:

అభిమానం తో వస్తే ఎవరినైనా భాజపా లోకి ఆహ్వానిస్తాం: 
 
12 కోట్లకు పైగా సభ్యతం ఉన్న పార్టీ బీజేపీ - ఇదొక

 à°ªà±à°°à°ªà°‚à°š రికార్డు. . .

కర్ణాటక సంక్షోభంతో సంబంధం లేదు :

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 

భాజపా లో చేరిన పారిశ్రామిక వేత్తలు

 

(రిపోర్ట్ : సాయిరామ్ చిలకమఱ్ఱి, బ్యూరో,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  11 , 2019 (డిఎన్‌ఎస్‌): భారతీయ జనతా పార్టీలో భారీగా సభ్యత్వ నమోదు జరుగుతోందని, అయితే

ఆరుగురిని తప్ప మిగిలిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సగౌరవంగా ఆహ్వానిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరుతున్నారు. 
గురువారం నగర

పర్యటనకు వచ్చిన ఆయన విశాఖ నగరం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది కి పైగా సభ్యత్వ నమోదు

కల్గిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు అని తెలిపారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలపై విశ్వాసం, నమ్మకం తో వచ్చిన

వారిని పార్టీలోకి బేషరతుగా స్వాగతం పలుకుతామని తెలిపారు.

పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ఆరుగురిని తప్ప మిగిలిన వారు ఏ

పార్టీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని నిర్ణయించినట్టు వివరించారు. à°† ఆరుగురు ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. 

ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు

ప్రక్రియ దిగ్విజయంగా సాగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారన్నారు. ఇదే కార్యక్రమం లో భాగంగా

విశాఖపట్నం లో పలువురు పారిశ్రామిక వేత్తలు పార్టీలో చేరుతున్న సందర్బంగా నగర పర్యటనకు వచ్చినట్టు తెలిపారు. 

ప్రపంచం లోనే అత్యధిక సభ్యత్యం ఉన్న పార్టీ

బీజేపీ నే. 

ప్రపంచంలోనే  12 కోట్ల సభ్యత్వం తో అత్యధిక సభ్యులగల పార్టీ à°—à°¾ బీజేపీ అవతరించిందని, ఇదొక రికార్డు à°—à°¾ తెలిపారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రోజా

వివిధ పార్టీ ల నుంచి చేరికలు జరుగుతున్నాయన్నారు. మోడీ నాయకత్వంలోనే దేశంలోని సమస్యలన్నింటికి పరిష్కారం ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. బీజేపీ

ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదన్నారు. వారు ఇష్టపూర్వకంగానే బీజేపీలోకి వస్తున్నారన్నారు. 

కర్ణాటక సంక్షోభంతో సంబంధం లేదు :

కర్ణాటక లో కాంగ్రెస్ -

జనతా దళ్ ఎస్ పార్టీల మధ్య విభేదాల కారణంగా ఏర్పడిన రాజకీయా సంక్షోభంలో కర్ణాటక లో ప్రభుత్వం కూలిపోయే స్థితి కి వచ్చిందన్నారు. అయితే ఈ ప్రక్రియ లో భాజపా కి

ఎటువంటి సంబంధం లేదన్నారు. 

బాబు ఐదేళ్ల పాలన పై సిబిఐ విచారణ చేయాలి :

ఆర్ధికంగా నష్టాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను మరింత అప్పుల ఊబిలోకి దింపేసి

చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతి పాలన పై సీబీఐ విచారణ జరిపించాలని కన్నా కోరారు. అయితే నాలుగేళ్ళ కాలం అదే ప్రభుత్వం లో తమ పార్టీ భాగస్వామిగా ఉన్న సమయంలో

కూడా అవినీతి పై ఎన్నో సార్లు హెచ్చరించామన్నారు. టీడీపీలో చంద్రబాబు ఉండగా ఎవరు కొనసాగలేరు. ఈ విషయం గ్రహించిన వారు మా పార్టీ లోకి వస్తున్నారు

పార్టీ లోకి

పారిశ్రామిక వేత్తలు :

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నగర పర్యటన సందర్బంగా విశాఖ లో జరిగిన కార్యక్రమం లో నగరానికి చెందిన పలువురు

పారిశ్రామిక వేత్తలు బీజేపీ లో చేరారు. వారందరిని పార్టీ కండువాలు కప్పి కన్నా బీజేపీ లోకి స్వాగతం పలికారు. 

ఈ విలేకరుల సమావేశం బీజేపీ మహిళా మోర్చా జాతీయ

కమిటీ ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ నగర ఎంపీ డాక్టర్ కె. హరిబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశి విశ్వనాధ రాజు, మాజీ

మేయర్ పులుసు జనార్దన్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నగర కమిటీ అధ్యక్షులు ఎం. నాగేంద్ర అధ్యక్షత

వహించారు. 

 

#dns  #dnslive  #dnsnews #dnsmedia  #dnsonline  #vijayawada #bezawada  #amaravati  #andhra  #pradesh  #government  #minister  #vizag  #visakhapatnam  #BJP  #bharatiya  #janata  #party  #kanna  #lakshminarayana  #telugudesam  #TDP  #membership  #Union

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam