DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రహణానంతరం ఆలయాల పునః ప్రారంభం, యధావిధి దర్శనాలు

శ్రీవారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు దర్శనం

(రిపోర్ట్ : సాయిరాం చిలకమఱ్ఱి , బ్యూరో చీఫ్ , అమరావతి ). .

తిరుమల / అమరావతి, జులై 16, 2019  (డిఎన్‌ఎస్‌) :

మంగళవారం అర్ధరాత్రి చంద్ర గ్రహణ సమయంలో మూసి వేసిన ఆలయాలు తిరిగి తెరిచి సంప్రోక్షణ అనంతరం బుధవారం భక్తులకు మూలవరుల దర్శనాన్ని కల్పించారు. తిరుమల శ్రీవారి

ఆలయంలో బుధ‌వారం ఉదయం 11.00 à°—à°‚à°Ÿà°² నుండి సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. జూలై 17à°µ తేదీ చంద్రగ్రహణం కారణంగా జూలై 16à°¨ రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయ

ద్వారాన్ని మూసివేయడం జరిగింది. 

బుధ‌వారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. అనంతరం తోమాలసేవ, కొలువు,

పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఉద‌యం 9.00 నుండి 11.00 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు ఆల‌యంలో ఆణివార ఆస్థానం à°˜‌నంగా à°œ‌రిగింది. అనంత‌à°°à°‚ భక్తులను సర్వదర్శనానికి

అనుమతించారు. 

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాల్లో ఉద‌యం 5.45 గంటలకు తలుపులు తెరిచారు. శుద్ధి,

పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం ఉద‌యం 6.45 à°—à°‚à°Ÿ‌à°²‌కు సర్వదర్శనానికి అనుమతించారు.

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్నిఉదయం 5 గంటలకు తెరిచారు.

శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం ఉదయం 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతించారు. à°ˆ ఆల‌యంలో సాయంత్రం 5.30 గంటలకు ఆణివార ఆస్థానం

à°œ‌రుగ‌నుంది.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ

ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు భక్తులకు సర్వదర్శనం

కల్పించారు.

నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ

అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సత్రవాడలోని శ్రీ కరివరదరాజస్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆల‌యాల‌ను ఉద‌యం 5 గంటలకు తెరిచారు. ఆలయ శుద్ధి,

పుణ్యహవచనం తదితర సేవల అనంతరం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆల‌యాన్ని, చంద్రగిరి శ్రీ

కోదండరామాలయాన్ని ఉదయం 6 గంటలకు తెరిచారు. శుద్ధి అనంతరం ఉద‌యం 7 à°—à°‚à°Ÿ‌à°²‌కు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహ‌స్వామివారి

ఆలయం, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆల‌యాల‌ను ఉదయం 6 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 à°—à°‚à°Ÿà°²

నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

తిరుపతిలో అన్నప్రసాద వితరణ

తిరుపతిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం

క్యాంటీన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, 1, 2, 3à°µ సత్రాలు, ఆసుపత్రులు, తిరుచానూరులోని అన్న‌ప్ర‌సాద à°­‌à°µ‌నంలో బుధ‌వారం ఉదయం శుద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన

అనంత‌à°°à°‚ యధావిధిగా అన్నప్రసాద వితరణ à°œ‌రుగుతోంది.

విజయవాడ శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం, సింహాచల క్షేత్రం లోని శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం,

విశాఖ నగరం లోని శ్రీ కానక మహాలక్ష్మి తదితర ఆలయాల్లో  à°¬à±à°§à°µà°¾à°°à°‚ ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam