DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చదువుకు వయసు ఆటంకం కాదు ఎప్పుడైనా చదువుకోవచ్చు. . . 

యూనిసెఫ్ అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

బాలలకు జివిఎంసి కమిషనర్ జి సృజన పిలుపు  

డ్రాప్ అవుట్ ల్లోనూ ఎందరో మేధావులు ఉన్నారు

(రిపోర్ట్ : సాయిరాం చిలకమఱ్ఱి , బ్యూరో చీఫ్ ). .

విశాఖపట్నం, జూలై 17,  2019 : చదువుకోడానికి వయసు ఆటకం కాదని, కుటుంబ పరిస్థితుల వాళ్ళ మధ్యలో నిలిపేసిన వారికి

యూనిసెఫ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్  à°œà°¿. సృజన బాలలకు పిలుపు నిచ్చారు. బుధవారం నగరం లోని

వుడా చిల్డ్రన్ ఏరీనా లో యూనిసెఫ్ ఆధ్వర్యవం లో కౌమార దశలో రెండవ దశ విద్యాభ్యాసాన్ని అందిస్తున్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించిన

చిన్నారులతో ముఖ ముఖి కార్యక్రమం లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓపెన్ పరీక్ష ద్వారా పదవ తరగతి పూర్తి చేయడం, అనంతరం ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన

బాల బాలికలను అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను ప్రతి డ్రాప్ అవుట్ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్య ద్వారానే విజ్ఞానం తద్వారా

మంచి ఉపాధి లభిస్తుందన్నారు. అంతకు ముందు వివిధ ప్రాంతాలకు చెందిన బాల బాలికలు తాము యూనిసెఫ్ కార్యక్రమం ద్వారా పొందిన లబ్ది ని సభికులకు తెలియచేసారు. వీరిలో

అధిక శాతం పిల్లలు కుటుంబ పరిస్థితుల రీత్యా చదువు మధ్యలోనే నిలిపి వేసి కూలి పనులకు వెళ్లినట్టు తెలిపారు. ఈ క్రమం లోనే కొందరు స్వచ్చంద కార్యకర్తల ద్వారా

ఓపెన్ టెన్త్ పరీక్ష విధానం తెలిసిందని, తాము à°ˆ పరీక్షల్లో పాసై, మంచి ఉపాధి పొందినట్టు తెలిపారు. 

సివిల్స్ లో విజయమే లక్ష్యం : సన్యాసమ్మ . . .. 

చోడవరం కు

చెందిన సన్యాసమ్మ అనే విద్యార్థిని మాట్లాడుతూ à°ˆ పధకం ద్వారానే తానూ పదవ తరగతి పాసై, అనంతరం విద్యార్థి కళాశాల లో ఇంటర్ చేరి మొదటి సంవత్సరం లో 9 .5 గ్రేడింగ్,  à°°à±†à°‚à°¡à°µ

సంవత్సరం  à°²à±‹ 9 .4 గ్రేడింగ్ తో కళాశాలలోనే టాపర్ à°—à°¾ వచ్చినట్టు  à°¤à±†à°²à°¿à°ªà°¿à°‚ది. అనంతరం ఆర్ధిక పరిస్థితుల వాళ్ళ ఎంసెట్ వ్రాయలేక డిగ్రీలో చేరినట్టు వివరించింది. తనకు

సివిల్స్ కావాలని లక్ష్యంగా విద్యను కొనసాగిస్తున్నట్టు తెలిపింది.  .

 
రాజకీయ నేతను అవుతా: వెంకటేష్ . . . 

ఎస్ రాయవరం మండలానికి చెందిన వెంకటేష్ అనే

యువకుడు తానూ కూడా à°ˆ విధానం ద్వారానే విద్యను కొనసాగించమని, తమ గ్రామంలో స్వచ్చంద కార్యకర్తలతో కలిసి మిగిలిన డ్రాప్ అవుట్ లకు  à°µà°¿à°¦à±à°¯ పట్ల అవగాహనా

చేపడుతున్నట్టు తెలిపాడు. తనకు రాజకీయ నేతగా ఎదిగి, తమ గ్రామానికి మంచి పనులు చేయాలన్న సంకల్పం ఉందన్నాడు. 

అనంతరం వివిధ స్థాయిల్లో సేవలందిస్తున్న  à°Žà°¨à±

ఎస్ఎస్ సమన్వయ కర్తలను అభినందించారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర విశ్వ కళాపరిషత్, స్వచ్చంద సేవ సంస్థల ప్రతినిధులు, యూనిసెఫ్, యాంగ్ చేంజ్ మేకర్స్

సంయుక్తంగా నిర్వహించిన à°ˆ కార్యక్రమం లో యూనిసెఫ్ భారత దేశ ప్రతినిధి  à°¡à°¾à°•à±à°Ÿà°°à± యస్మిం అలీ హాక్, డాక్టర్ à°Žà°‚. ప్రసాద్ రావు, రెక్టార్, ఆంధ్ర విశ్వ కళాపరిషత్,

యూనిసెఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఫీల్డ్ అధికారి మెటల్ రస్దియ, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

 

#dns  #dnslive 

#dnsmedia  #dnsnews  #dnsonline  #vizag  #visakhapatnam  #unicef  #gvmc  #commissioner  #Srujana  #AU   #andhra  #university  #Children  #theatre  #Arena  #open  #tenth  #NGO  #drop  #Out

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam