DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న నాటి చందమామ కథను ఈ అమ్మలు నిజం చేశారు. 

చంద్రయాన్ విజయం లో ఇద్దరు మహిళలే కీలకం  

ప్రాజెక్ట్ డైరక్టర్  à°µà°¨à°¿à°¤,  à°®à°¿à°·à°¨à± డైరక్టర్  à°°à°¿à°¤à± కారిదల్ లు.  

(రిపోర్ట్ : సాయిరాం, CVS , Burearu, ) . . . 

విశాఖపట్నం,

జులై  22, 2019 (డిఎన్‌ఎస్‌) : చందమామ రావే అంటూ చిన్న పిల్లలకు దూరంగా ఆకాశం లోని చందమామ ను చూపించేది అమ్మే. ఇది ఆనాటి పురాణం కాలం నుంచి నేటి సాంకేతిక విప్లవ కలం వరకూ

కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ. అయితే కాలం మారింది చిన్నప్పటి నుంచి దూరంగా చూస్తున్న చంద్రుని పై అసలు ఏముందో చూపించే ప్రక్రియ ను ఇద్దరు మహిళలు కంకణం

కట్టుకున్నారు. వారే ప్రాజెక్ట్ డైరక్టర్  à°®à±à°¤à±à°¤à°¯à±à°¯ వనిత,  à°®à°¿à°·à°¨à± డైరక్టర్  à°°à°¿à°¤à± కారిదల్ లు.  

కోట్లాది మంది భారతీయుల ఆశీస్సులతో భారతీయ అంతరిక్ష పరిశోధన

శాల (ఇస్రో) శాస్త్రవేత్తలు ఈ రోజు అత్యంత ఘానా విజయం సాధించారని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. సోమవారం నెల్లూరు జిల్లా శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి

ప్రయోగించబడిన చంద్రయాన్ 2 మొదటి దశ విజయవంతం కావడం తో అయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏళ్ళ తరబడి శాస్త్రవేత్తల బృందం నిద్రాహారాలు మరిచిపోయి మరీ ఈ అద్భుత

విజయాన్ని సాధించి అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశ కీర్తి పతాకను చాటారన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 :43 గంటల సమయంలో జూలు విదుల్చుకున్న సింహం మాదిరిగా జిఎస్ఎల్ వి

మార్క్ 3 రాకెట్ ప్రచండ వేగంతో  à°’క్క సారిగా నింగి లోకే ఎగిసింది. సుమారు 15 నిమిషాల సమయం  à°•à±à°·à°£ క్షణం కేవలం à°ˆ ప్రయోగ శాల లోని శాస్త్రవేత్తలే కాక మొత్తం దేశం

యావత్తు ఉత్కంఠ తో ఎదురుచూసింది. ప్రపంచ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కూడా భారత శాస్త్రవేత్తల మేధాశక్తిని నిశితంగా పరీక్షించారు. మొదటి దశ గమనం ఫలితం

ఉపగ్రహం నుంచి లభించిన వెంటనే ఇస్రో చైర్మన్ శివన్ సభికులను, దేశాన్ని ఉద్దేశించి తమ లక్ష్య సాధనను వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తాము నిర్దేశించి,

ఆశించిన గమనం కంటే మరింత వేంగంగా జి ఎస్ ఎల్ వి మార్క్ 3 నింగిలోకి దూసుకు వెళ్తోందన్నారు. దీనికోసం అహరహం శ్రమించిన యువ శాస్త్రవేత్తలు, సీనియర్లకు ప్రత్యేక

అభినందనలు తెలియచేసారు. పురుషులకు ధీటుగా వీరిద్దరూ అందించిన సేవలు యావత్ భారత దేశాన్ని విశ్వాంతరాళాల్లో విజేత à°—à°¾ నిలిపాయి.  

ప్రాజెక్ట్ డైరక్టర్

 à°®à±à°¤à±à°¤à°¯à±à°¯ వనిత : . . .   

గత 32 ఏళ్లుగా ఇస్రో శాస్త్రవేత్తగా ఎన్నో రికార్డు స్థాయి విజయాల్లో భాగమైన వనితా ఈ ప్రాజెక్ట్ ను విజయం చేయడానికి చాలా రోజులు సూర్య

చంద్రులను చూడలేదంటే అతిశయోక్తి కాదు. చెన్నై కు చెందిన ఈమె ఎలక్ట్రినిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ చేశారు. చిన్న స్తాయి ఇంజనీర్ గా విధుల్లో చేరిన

తానూ ఎందరో సీనియర్ల నుంచి నేర్చుకున్న విజ్ఞానం ఈ రోజు ఉపయోగపడిందన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన సిబ్బందితో కలిసి పనిచెయ్యడం వలన వారి ఆలోచన విధానాలు

తెలుసుకోగలిగి వారికి తగిన సూచనలు చెయ్యగలిగినట్టు తెలిపారు. 

మిషన్ డైరక్టర్  à°°à°¿à°¤à± కారిదల్ : . . . . 

లక్నో కు చెందిన రీతూ కారిదల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్

ఆఫ్ సైన్స్ బెంగళూరు లో ఏరో స్పేస్ ఇంజనీర్ పూర్తిచేశారు. గత 22 ఏళ్లుగా ఇస్రో లో సేవలు అందిస్తున్నారు. ఇస్రో పంపిన మంగళ్ యాన్ ప్రయోగం లో మార్స్ లోకి స్పేస్

క్రాఫ్ట్ ను ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం చంద్రయాన్ 2 à°•à°¿ మిషన్ డైరక్టర్ à°—à°¾ కీలక భాద్యతలు పోషించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam