DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూగర్భ జలాల కోసం జలశక్తి అభియాన్ విస్తృత పరచండి : కలెక్టర్ నివాస్

చెరువులు, డ్యామ్ లు, రిజర్వాయర్ల పనులు త్వరితంగా సాగాలి    

రిపోర్ట్ : S V  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, Burearu, ) . . .

శ్రీకాకుళం, జులై  24, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ భూగర్భ జలాల

పెంపుదలకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జలశక్తి అభియాన్

కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ మరియు వర్షపు నీరు ఇంకించు పనులు, నీటి నిల్వకోసం చెరువులు, గుంతలు నవీకరణ, తాగునీరు, సాగునీటి బోరుబావుల వద్ద రీఛార్జ్

స్ట్రక్టర్ల నిర్మాణం, వాటర్ షెడ్ అభివృద్ధి పనులు, అటవీకరణ తదితర అంశాలపై సంబందిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

à°ˆ

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జి.సిగడాం, లావేరు, రణస్థలం మండలాల్లో భూగర్భ జలాలు పెంపుదలకు జలశక్తి అభియాన్ ద్వారా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని

కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు భూగర్భ జలాల పరిరక్షణకు, వర్షపునీరు సంరక్షణకు అవసరమగు అన్ని పనులు గుర్తించాలని చెప్పారు.

భూగర్భజలాల విస్తృతికి అవసరమగు

చెరువులను అధికంగా చేపట్టాలని తెలిపారు. చెక్ డాంలు, ఇంకుడు గుంతలు, బోరుబావుల వద్ద ఇంకుడు బావులు, ట్రెంచ్లు, చిన్న తరహా నీటి వనరుల పనులు చేపట్టాలని, రణస్థలం,

లావేరు, జి.సిగడాం మండలాల్లో విస్తృత అవగాహన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాలు, కొండలు, గుట్టలపై పెద్ద ఎత్తున మొక్కలు నాటడం,

ట్రెంచ్ లు నిర్మించడం, కనీసం పది గుట్టలను మోడల్ గా చేపట్టాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేసారు. తద్వారా పచ్చదనం పెరిగి వర్షాలు కురవడానికి దోహదం చేస్తాయని

కలెక్టర్ ఆకాంక్షించారు. మత్స్యకారులతో చేపల చెరువులు చేపట్టుటకు చర్యలు చేపట్టాలని, పశుసంవర్ధక శాఖ పశు గ్రాసం అధికంగా పెంచాలని, ఉద్యానవన శాఖ, సెరీకల్చర్

సంబంధించిన మొక్కలను వేయాలని కలెక్టర్ అధికారులకు ఈ సందర్భంగా వివరించారు. ఉద్యానవన శాఖ త్వరితగతిన ఫలసాయాన్ని ఇచ్చే మొక్కలను పెంచాలని కలెక్టర్ సూచించారు.

వ్యవసాయానికి సంబంధించి వరి నుండి మొక్కజొన్నకు పంటమార్పిడి చేయడం ద్వారా అధిక లాభాలను ఆర్జించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ విషయంపై రైతులకు విస్తృతంగా

అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే తక్కువ నీటి వినియోగం, ఇంకుడు గుంతల ప్రాముఖ్యత తదితర అంశాలపై రైతుల్లో అవగాహన పెంచాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు,

పాఠశాల భవనాల్లో తాగునీటి సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. హిల్ ఏరియాలో పచ్చదనంతో వెల్లివెరిసేలా

మొక్కలను పెంచాలన్నారు. రణస్థలం, లావేరు, జి.సిగడాం మండలాల్లోని ప్రతీ గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్, ఇంకుడు గుంతలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అటవీ శాఖ

మరిన్ని నర్సరీలను అభివృద్ధి చేయాలని చెప్పారు. కళాశాలల్లో యన్.యస్.యస్ వాలంటీర్ల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ నీటి యాజమాన్య

సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హెచ్.కూర్మారావు జల శక్తి అభియాన్ లో చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ కు వివరించారు.

à°ˆ సమావేశంలో  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• అటవీ విభాగం

జిల్లా అటవీ శాఖాధికారి బి.ధనంజయరావు , డివిజనల్ అటవీ అధికారి జి.లక్ష్మణ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్లు టి. శ్రీనివాసరావు,

పి.వేణుగోపాల్,            à°œà°¿à°²à±à°²à°¾ విద్యాశాఖ అధికారి చంద్ర à°•à°³, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఏ.ఈశ్వర రావు, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు à°¡à°¾. వి.వి.కృష్ణ మూర్తి, సెట్

శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి వి.వి.ఆర్.ఎస్.మూర్తి, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు ఎం.శ్రీనివాస రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మి ప్రసాద్, ఏ.పీ.ఎం.ఐ.పి

పథక సంచాలకులు ఏవిఎస్వీ జమదగ్ని, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వి.శ్రీనివాసరావు, అటవీ శాఖ రేంజ్ అధికారి గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam