DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్లైన్ ఓటర్ల జాబితా పై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో కే. సూర్యారావు

నర్సీపట్నం మే 17, 2018 (DNS Online): ఆన్లైన్లో ఓటర్ల జాబితా నమోదు పై క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండాలని నర్సీపట్నం ఎన్నికల అధికారి అయిన రెవిన్యూ డివిజనల్ అధికారి కె

సూర్యారావు బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో బూత్ స్థాయి అధికారులకు ఆన్లైన్ ఓటర్ల జాబితా నమోదు, సవరణలపై నా

శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ ఇంతవరకు ఓటర్ల నమోదు, మార్పులుచేర్పులు కాగితాలు, రిజిస్టర్ లపై నర్వహించే వారమని, నూతన సాంకేతిక

పరిజ్ఞానం అందుబాటులోనికి వచ్చినందున ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లోనే ఓటర్ల జాబితా నమోదుకు ఎన్నికల సంఘం రూపొందించిందన్నారు. దీనివలన భారతదేశంలో ఏ

ప్రాంతంలోనైనా ఓటు హక్కు కలిగి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చన్నారు. ఒక పౌరుడు రెండుచోట్ల ఓటు హక్కును కలిగి ఉంటే గుర్తించి రద్దు చేయడం జరుగుతుందన్నారు.

అంతేకాకుండా ఓటర్ల నమోదు సవరణ వేగంగా, స్పష్టంగా చేయడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పక ఓటుహక్కు కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన ఓటర్ల

జాబితా అంటే అర్హులందరికీ ఓటుహక్కు కలిగిఉండడం, అనర్హులకు ఓటుహక్కు లేకపోవడమేనని తెలిపారు.ఓటుహక్కు పొఃదేందుకుగల అర్హతలు, అనర్హతలు గురించి వివరించారు.

ఓటర్ల నమోదు రివిజన్ ఫ్రీ రివిజన్ మార్పులు చేర్పులు చేయడం అవసరమైన నమూనా ఫారాలు, ఎన్నికలు జరిగే విధానము, నిర్వహణ ఎన్నికలలో రకాలు, ఎన్నికల యంత్రాంగం గూర్చి

విశదీకరించారు. అంతకుముందు ఏఎస్ఓ ఏపీఎస్ నాయుడు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వోటర్ల జాబితాలో తేడాలు రావడానికి గల కారణాలను, ఎపిక్ కార్డు బదిలీ విధానం,

జనాభాకు ఓటర్లకు ఉండవలసిన నిష్పత్తులు మొదలైన వాటిని గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లు వి.వి.రమణ, అంబేద్కర్, కనకారావు, ఎన్నికల డిప్యూటీ

తాసిల్దారు లక్ష్మి, నియోజకవర్గంలోని బీఎల్వోలు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam