DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రత్యేక ప్యాకేజి తో ఉత్తరాంధ్రను ఆదుకోండి, గవర్నర్ కు విజెఎఫ్ వినతి

వెనుకబడిన ఉత్తరాంధ్ర కు చేయూత అందించాలి. . .

గవర్నర్‌ బిశ్వ భూషణ్ ను కలిసిన అధ్యక్షుడు శ్రీనుబాబు  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . .

విశాఖపట్నం,

ఆగస్టు  01, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా à°—à°¾ గుర్తింపు పొందిన ఉత్తరాంధ్రకు అవసరమైన చేయూతను అందించే విధంగా కేంద్రం చర్యలు  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¾à°²à°¨à°¿ రాష్ట్ర

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం కోరింది. గురువారం ఇక్కడ ప్రభుత్వ అతిధి గృహంలో ఫోరం అధ్యక్షు గంట్ల శ్రీనుబాబు

ఆధ్వర్యంలో కార్యవర్గం ప్రతినిధులు  à°—వర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై కార్యవర్గం గవర్నర్‌కు వినతి పత్రం

సమర్పించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్రంలో రాయలసీమలోని మరికొన్ని జిల్లా అభివృద్దికి గతంలో కేంద్రం రూ. 23,500 కోట్లు ప్రకటించిందన్నారు.

అయితే  à°… తరువాత నిధులు విడుదల మాత్రం జరగలేదని గవర్నర్‌కు అందచేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. తరచు ఉత్తరాంధ్రలో విపత్తు సంభవించడం, అనేక తుఫాన్‌లు ఇక్కడే

తీరం దాటడంతో నిరంతరం అయా జిల్లాలు ప్రకృతి విధ్వంసానికి  à°—ురవుతున్నట్టు  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¶à°¾à°°à±. అంతే కాకుండా ఉద్ధాన కిడ్నీ బాధితులు సమస్యలు , ఉపాధి అవకాశాలు

లేకపోవడంతో ప్రజలు నిరంతరం ఇక్కడ కరవుతో అల్లాడుతున్నారని గవర్నర్‌కు వివరించారు. తక్షణమే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి క్రింద కేంద్రం గతంలో

ప్రకటించిన విధంగా నిధులు విడుదల చేయాలని  à°•à±‹à°°à°¾à°°à±. వీజేఎఫ్‌ కార్యదర్శి ఎస్‌ దుర్గారావు, ఉపాధ్యక్షుడు ఆర్‌ నాగరాజ్‌ పట్నాయక్‌, జాయింట్‌ సెక్రటరీ దాడి

రవికుమార్  à°œà°¿à°²à±à°²à°¾ అభివృద్దికి సంబంధించిన అంశాలను, వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్‌కు విపులంగా వివరించారు. అనంతరం

గవర్నర్‌ను సాదరంగా సత్కరించి సింహాద్రినాధుని చిత్రపటాన్ని , చందన ప్రసాదాన్ని అందచేశారు. సింహాచలం ఆలయం గొప్పతనం, చందనం యొక్క విశిష్టతను గవర్నర్‌కు

వీజేఎఫ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలియచేశారు. కార్యక్రమంలో కార్యవర్గసభ్యులు ఇరోతి ఈశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam