DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనీసం గన్ మాన్ కే ఏమీ చెప్పలేని వారు జనానికేమి చెప్తారు? విశాఖ ఎంపీ తీరు పై అనుయాయులు

రాష్ట్రం లో బీజేపీ కి శంకరగిరి మాన్యాలు పట్టించిందెవరు?

కనీసం గన్ మాన్ కే ఏమీ చెప్పలేని వారు జనానికేమి చెప్తారు ?

విశాఖ ఎంపీ తీరు పై అనుయాయులు . .

.

విశాఖపట్నం, మే : ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ వైఫల్యం వెనుక గతంలో రాష్ట్ర అధ్యక్షుడి గా పనిచేసిన విశాఖ ఎంపీ హరిబాబు పాత్ర ప్రధానమైనది గా కనపడుతోంది. అత్యంత

క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే కనీసం వార్డు స్థాయి కార్యకర్తల కె కాదు పార్టీ కీలక నేతలకు కూడా అందుబాటులో లేని స్థితి. ఇక ఈయన హయం లో విశాఖ

నగరాన్నీఏమైనా ముంబాయి తరహా లో మార్చారా అంటే కనీసం మురికి వాడలని కూడా మార్చలేక పోయారు. విగ్రహ పుష్టి తప్ప, ఈయన వల్ల ఉపయోగం లేదు అనే విషయం అయన పార్టీ లో కీలక

నేతలే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అత్యంత కీలక పదవులు ఈయన చేతిలో పెట్టిన పార్టీకి ఈయన ఒరగబెట్టిందేంటో ఆయనకే తెలియాలి.

ఇక కేంద్ర మంత్రి మండలి

ఆంధ్రాకి కేంద్ర విశ్వ విద్యాలయం కేటాయిస్తే అత్యంత ఆర్భాటం గా ప్రచారం చెయ్యాల్సింది పోయి చిన్న పత్రిక ప్రకటనతో సరిపెట్టారంటే ఈయనకు పార్టీ అభివృద్ధి పట్ల

ఎంత నిబద్దత ఉందో బహిర్గతం అవుతోంది. గతం లోనూ 11 జాతీయ విద్య సంస్థలను ఆంధ్రా కి కేటాయిస్తే ప్రచారం చేసుకోడం చేతగానితనం కారణంగా ప్రజల్లో పార్టీ పరువు

పూర్తిగా పోయింది. బహుమానం ఇఛ్చి కూడా బ్రష్టుపట్టి పోవడం అంటే ఈయన నిర్వాకమే కారణంగా తెలుస్తోంది.

కనీసం గన్ మాన్ కే ఏమీ చెప్పలేని వాడు జనానికేమి

చెప్తారు ? అనే అబాండం నిత్యం అయన వెంట తిరిగే వారే ప్రకటించారంటే ఈయన సత్తా ఏంటో తెలుస్తోంది. గత నాలుగేళ్ల కాలం తో ప్రజలకే కాదు, కనీసం పార్టీ కార్యకర్తలకు

కూడా ఈయన వల్ల ఉపయోగం జరగలేదంటే. . . . ఈయన పట్ల కార్యకర్తల్లో ఏ స్తాయి లో నైరాశ్యం ఉందొ తెలుస్తోంది. ఇప్పడికే చాలా మంది కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి మారే

ఆలోచనల్లో ఉన్నారంటే పూర్తి భాద్యత ఈయనదే అనే అభిప్రాయాలూ ఉన్నాయి.

కేంద్రం లో అధికారం లో ఉండి, ఈయన అదే పార్టీ అధికార ఎంపీ గా ఉన్నా కూడా ఈయన ప్రాతినిధ్యం

వహిస్తున్న నియోజక వర్గానికి దమ్మిడీ లాభం చేకూరలేదంటే ఈయన శక్తి ఏంటో పూర్తిగా బహిర్గతం అవుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam