DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు బడిలో ఓనమాలు దిద్దుదాం. . . : పరవస్తు సూరి 

పరవస్తు పద్యపీఠం లో ఆదివారం - ఆటవిడుపు 

చిన్నారులకు తెలుగు పద్య పఠనం పై ఉచిత శిక్షణ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ) . . .

విశాఖపట్నం, ఆగస్టు  02, 2019

(డిఎన్‌ఎస్‌): పర భాష మోజులో మాతృభాష నిర్లక్ష్యం అవుతుండడంతో తెలుగు భాష లో మరొక్కసారి అందరం కలిసి ఓనమాలు దిద్దుదామని, 
భాషకు పూర్వ వైభవం తీసుకు వచ్చే మహా

యజ్ఞానికి కంకణం కట్టుకున్నట్టు పరవస్తు పద్య పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి తెలిపారు. శుక్రవారం మద్దిలపాలెం కళాభారతి సమీపంలోని సంస్థ

కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ మాతృ భాషపై అభిమానాన్ని. మమకారాన్ని చిన్నారులలో కల్గించేందుకై  à°ªà°°à°µà°¸à±à°¤à± పద్య పీఠం ఆధ్వర్యంలో

ఈనెల 4 నుంచి ప్రతి ఆదివారం  “ఆదివారం - ఆటవిడుపు” శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. à°ˆ శిబిరం ఆదివారం ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుందన్నారు.

 
వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలు పిల్లలు ఆదివారం ఆటవిడుపు కార్యక్రమంలో పూర్తిగా ఉచితంగా పాల్గొనవచ్చునని తెలిపారు.  à°®à°¨ తెలుగు భాష సంస్కృతులను

భావితరాలకు తెలియజేయడం కోసం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ శిబిరంలో తెలుగు పద్యాలు, గేయాలు, కథలు, జాతీయాల పుట్టుకల గురించి

వివరించడం జరుగుతుందని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి పెద్దలకు, పిల్లలకు తెలుగు భాష అంశాలపై, పద్యాలపై పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంసపత్రాలు

అందజేస్తామన్నారు. 
ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ భాషా శిబిరంలో పాల్గొనవచ్చునని తెలిపారు. తెలుగు భాష శిక్షణా శిబిరం ద్వారా వ్యక్తిత్వ వికాస శిక్షణ

కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. à°ˆ శిబిరంలో పాల్గొనదలచిన వారు తమ కార్యాలయంలో పేర్లు నమోదు ముందుగా చేసుకోవాలని లేదా  9963848549, 9052649240 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆయన

కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam