DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి రహిత పాలనే ధ్యేయంగా గ్రామ వలంటీర్లు సేవలు

పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ పధకాలు 

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . .

విశాఖపట్నం,

ఆగస్టు  02, 2019 (డిఎన్‌ఎస్‌):  à°…వినీతి రహిత పాలనే ధ్యేయంగా గ్రామ వలంటీర్లు సేవను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని రాజన్నప్రభుత్వం ప్రవేశ పెడుతోందని  à°°à°¾à°·à±à°Ÿà±à°°

పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.  à°ªà±†à°‚దుర్తిలోని à°¡à°¿.ఆర్.à°¡à°¿.à°Ž. మహిళా శిక్షణా ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల గ్రామ

వాలంటీర్ల శిక్షణకై జిల్లా స్థాయి à°Ÿà°¿.à°“.à°Ÿà°¿. శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు అవినీతి

లేకుండా పారదర్శకతతో ఉండాలని తెలిపారు. వాలంటీర్లకు కేటాయించిన 50 గృహాలలోని కుల, మతాలు బేధాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ పేద వారికి ప్రభుత్వ

సంక్షేమ పథకాలు అందాలని చెప్పారు. 
వాలంటీర్ కు కేటాయించబడిన 50 కుటుంబాలకు ప్రభుత్వ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాల సమాచారాన్నివాటి

ప్రయోజనాలను ప్రజల ఇంటి ముంగిట అందించాలన్నారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయంలో వివిధ శాఖల ప్రతినిధులకు చేరవేస్తూ, ఆయా సమస్యల పరిష్కారానికి

అవసరమైన సేవలను సమర్థవంతంగా అందించాలని పేర్కొన్నారు.  
గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడితే జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూం ద్వారా కలెక్టర్ కు

తెలియజేయాలని, అక్కడ న్యాయం జరగగపోతే రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూం ద్వారా  à°®à±à°–్యమంత్రి దృష్టికి తీసుకువెల్లాలన్నారు.  
దేశ వ్యాప్తంగా ఏ

రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో 2 లక్షల 70 వేల గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామాల అభివృద్థి జరగాలంటే అందరి సహకారం అవసరమని చెప్పారు.  
/> కార్యక్రమం లో  à°ªà±†à°‚దుర్తి శాసన సభ్యులు అదీప్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని à°ˆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు

చెప్పారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సంక్షేమ పథకాలు ప్రజలకు మంజూరులో రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు.  à°…ర్హులైన ప్రతీ పేదవారికి ప్రభుత్వ పథకాలు అందడానికే గ్రామ

వాలంటీర్లను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  à°—్రామ వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని, ఉపాధ్యాయులు గ్రామ వాలంటీర్లకు

దిశా నిర్దేశం చేయాలన్నారు.  à°…వినీతి లేకుండా పారదర్శకంగా ప్రజలకు పథకాలు అందాలన్నారు. జాయింట్ కలెక్టర్-2 à°Žà°‚. వెకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలన్నారు.  

జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. రమణమూర్తి మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు గ్రామాల అభివృద్థిలో ప్రముఖపాత్ర

వహించాలన్నారు. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు 240 మందిని ఎంపికచేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలం నుండి శిక్షణకు 6గురు వచ్చారని తెలిపారు.

 à°®à°‚డలాల్లో 5à°µ తేదీ నుండి 10à°µ తేదీ వరకు గ్రామ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. అందకు ముందు జ్యోతి వెలిగించి శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి

ప్రారంభించారు.  à°…నంతరం గ్రామ వాలంటీర్ల శిక్షణా కరదీపిక, నవరత్న మాలిక కరదీకను మంత్రి ఆవిష్కరించారు. 
     à°ˆ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 à°Žà°‚.

వెంకటేశ్వరరావు, జడ్పి సిఇఓ రమణమూర్తి, డిపిఓ కృష్ణకుమారి, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి తిరుపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జయప్రకాష్, డిఇఓ

లింగేశ్వర్ రెడ్డి, డిఆర్డిఎ ఇన్ చార్జ్ పిడి రామమోహన్ రావు, ఆయా మండలాల ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam