DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నో సమస్యలకు మూల కారణం మానసిక రుగ్మతలే : డాక్టర్ MVR రాజు  

ఖైదీల పరివర్తనకు సైకాలజిస్ట్ సేవలు తప్పని సరి 

అన్ని విభాగాల్లోనూ సైకాలజిస్ట్ లను నియమించాలి .

ప్రతి స్కూల్లోనూ à°’à°• సైకాలజిస్ట్  à°‰à°‚డాలి

:.

గత ప్రాజెక్ట్ మంచి ఫలితాలు ఇచ్చింది :..

రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్ à°Žà°‚ వి ఆర్ రాజు  à°¸à±‚చనలు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . 

విశాఖపట్నం, ఆగస్టు  02,

2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à°®à°¾à°œà°‚ లో అధిక శతం ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు మూల కారణం మానసిక రుగ్మతలేనన్ని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఎయు) సైకాలజీ విభాగాధిపతి డాక్టర్

à°Žà°‚ వి ఆర్ రాజు తెలిపారు. శుక్రవారం 
కళాశాల విభాగం లో ఖైదీలు - మానసిక ప్రవర్తన అనే అంశంపై  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ అవగాహనా సదస్సులో అయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా

సంచలనం సృష్టించిన ఘటన రాజమహేంద్ర వరం జైలు లో 27 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకడమే అన్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలోనూ ఖైదీలకు తక్షణం వైద్య

పరీక్షలు నిర్వహించవలసిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర  à°¹à±ˆà°•à±‹à°°à±à°Ÿà± చేసిన సూచనల మేరకు జైళ్ల శాఖా తన తప్పులను దిద్దుకునే పనిలో పడిందన్నారు. 

మానసిక

పరిస్థితి సక్రమంగా లేనప్పుడే ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. ముఖ్యంగా 
ఖైదీలకు మానసిక ఒత్తిడి పై కౌన్సలింగ్ నిర్వహించినట్టయితే వాళ్ళ ఆలోచనల్లో

ఉద్రిక్తతలు తగ్గి సామాన్య ఆలోచన శక్తి కలుగుతుందన్నారు. 

గత ప్రాజెక్ట్ మంచి ఫలితాలు ఇచ్చింది :.. . .

గతం లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యవం లో చేపట్టిన

ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సైక్రియాటిస్టులు, సైకాలజిస్ట్ లు, కౌన్సిలర్లు, విద్యార్థులకు అవగాహనా సదస్సులు నిర్వహించామని డాక్టర్ రాజు తెలిపారు.

తద్వారా రాష్ట్రంలో ఎయిడ్స్ కేసులు పూర్తిగా నివారించగలిగామన్నారు. ఆసుపత్రులు, కార్యాలయాలు, కార్మిక వర్గాలు, కామ ప్రకోపం సంస్థలు, ప్రాంతాల్లోని వారందరికీ

ఎయిడ్స్ నిరోధక విధానాలను తెలియచేయడం జరిగిందన్నారు. బహిరంగ ప్రాంతాల్లో ఉచితంగా ఏ ఆర్ à°Ÿà°¿ మందులు, నిరోద్ కండోమ్ à°²  à°ªà°‚పిణీ చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా à°ˆ

నిరోధక సదస్సులు నిర్గహించి సంపూర్ణ ఫలితాలు రాబట్టామన్నారు. 
అయితే ఆ ప్రాజెక్ట్ 2007 లోనే ముగిసిందని, తదుపరి కొనసాగించక పోవడంతో అవగాహనా కార్యక్రమాలకు

ముగింపు పలికినట్టయిందన్నారు. అయితే నేడు రాష్ట్రం లో సుమారు 600 వరకూ ఎయిడ్స్ కేసులు అధికారికంగానే ఉన్నాయన్నారు. ఈ విధమైన కౌన్సలింగ్ లు ఇవ్వడం ద్వారా మానసిక

ఒత్తిడికి లోను కాకుండా ఉండే అవకాశం ఉందన్నారు. 

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎయిడ్స్ నివారణకై ప్రత్యేక కార్యాచరణ ఏదీ లేదన్నారు. కేవలం తూతూ గానే

నడిపిస్తున్నారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు వ్రాయడం జరిగిందని తెలిపారు. ఈ విధమైన కౌన్సలింగ్ కేంద్రాలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసి, ప్రభుత్వ,

ప్రయివేట్, కార్మిక, స్వచ్చంద సంస్థలు, సైకాలజీ విద్యార్థులకు నిరంతర శిక్షణ అందించి, వీరి ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అవగాహనా

చేపట్టవచ్చన్నారు. 

తెలంగాణాలో అమలు. . . 

ఈ విధమైన కౌన్సలింగ్ కమిటీని తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ చింతలపూడి బీనా (సైకాలజిస్ట్) నేతృత్వంలో

నియమించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమిటీ పర్యటించి ప్రజల్లో చైతన్యం కల్గిస్తున్నారన్నారు. గతం లో తాము కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లో ఈమె కూడా ఒక

సభ్యురాలు అని తెలిపారు. 

తమ కళాశాలలోని సైకాలజీ విద్యార్థిలచే వివిధ ప్రాంతాల్లో అవగాహస శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

ప్రతి స్కూల్లోనూ

à°’à°• సైకాలజిస్ట్  à°‰à°‚డాలి :. . . 

జాతీయ విద్య హక్కు చట్టం 2012 ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతీ ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో ఒక సైకాలజిస్ట్ తప్పని సరిగా

ఉండాలన్నారు. అయితే కేవలం కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే (సైనిక్ స్కూళ్ళు, కేంద్రీయ విద్యాలయ, నవోదయ తదితర,) సైకాలజిస్ట్ ల సేవలను వినియోగిస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో గానీ ప్రయివేట్  à°¸à°‚స్థల్లో గానీ మచ్చుకైనా సైకాలజిస్ట్  à°²à± కానరారారు అని తెలిపారు. à°ˆ విధంగా సైకాలజిస్ట్ అందుబాటులో ఉంటె

విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, మానసిక వ్యధలకు తగిన పరిష్కార మార్గం చూపించడం జరుగుతుందన్నారు. తద్వారా స్కూళ్లలో జరుగుతున్నా విద్యార్థుల ఆత్మహత్యలు

తగ్గుతాయన్నారు. 

ఈ అవగాహనా సదస్సులో ఎయు సైకాలజీ విభాగం సీనియర్ విద్యార్థి గంట్ల శ్రీనుబాబు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పై తాము ఏ విధంగా పరిశోధన చేసి,

వారికి కౌన్సిలింగ్ చేస్తున్నది వివరించారు. సదస్సులో ప్రధమ, ద్వితియా సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam