DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదాదేవి . .  లక్ష్య సాధనకు నిలువెత్తు నిదర్శనం. 

ఆచరణ లో అందరికీ ఆదర్శం à°ˆ ఆండాళ్ 

మానవాళికి మార్గదర్శకం చేసిన మహిళామూర్తి  

స్వామినే సొంతం చేసుకున్న నిత్య సాధకురాలు 

తమిళనాడు చిహ్నం ఈ

ఆలయ గోపురమే. . 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ) . . .

విశాఖపట్నం, ఆగస్టు  03, 2019 (డిఎన్‌ఎస్‌): భక్తి మార్గం ద్వారా నిరంతర సాధన చేసి స్వామినే తన సొంతం చేసుకున్న

నిత్యసాధకురాలు ఆండాళ్. లక్ష్య సాధన పై తదేక దీక్ష, దక్షత  à°‰à°‚టె à°Žà°‚à°¤ కాస్త సాధ్యమైన లక్ష్యమైన తప్పక సాధించవచ్చు అని నిరూపించిన మహిళా మూర్తి ఆండాళ్. శ్రీవైష్ణవ

సంప్రదాయం లో ప్రసిద్ధికెక్కిన పన్నిద్దరు ఆళ్వార్లులలో ఏకైక మహిళా à°ˆ ఆండాళ్. 

శ్రావణ మాసం ( తమిళ నాట  à°†à°£à°¿ మాసం) పూర్వ ఫల్గుణి నక్షత్రం రోజు ఆమె తిరునక్షత్ర

మహోత్సవం సందర్బంగా ఆమె సాధించి చూపించిన లక్ష్య సాధన ఇదే. 

 à°‡à°¦à°¿ పురాణం కధనం కాదు, సుమారు 5 వేల ఏళ్లకు ముందు తమిళనాడు లో జరిగిన ఘటన. ఈమె విజయానికి నిదర్శనంగా

తమిళ నాడు ప్రభుత్వం ఈమె ఆరాధించిన ఆలయ గోపురాన్ని రాష్ట్ర పభుత్వ చిహ్నంగా పెట్టుకుంది.  à°®à°¨à°¿à°·à°¿ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి ఈమె కధే ప్రత్యక్ష

నిదర్శనం. 

తమిళనాడు రాష్ట్రం లోని శ్రీవిల్లిపుత్తూరు గ్రామం లో విష్ణుచిత్తుడనే భక్తునికి ఒక తులసి వనం లో లభించిన (అయోనిజ) బాలికే ఈ ఆండాళ్. తులసి వనం లో

లభించింది కనుక కోదై ( తమిళం లో తులసి) అని పేరు పెట్టారు. à°•à°² క్రమం లో à°ˆ పేరు గోదా  à°—à°¾ మార్పు చెందింది. ఈయన  à°µà°¿à°²à±à°²à°¿à°ªà±à°¤à±à°¤à±‚రులోనే వెలసిన వటపత్ర శాయి ( శ్రీకృష్ణుడు,

మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం) నిత్యం పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం

విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని

కూడా అందించారు. 

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి à°† భక్తి కాస్తా ప్రేమగా పూరుదాల్చింది.  à°¤à°¨

తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే

పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ

భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని

మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే

ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా

ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా.

అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన

విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని

ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ,

విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు.

పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే

ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

కూడారై . . . 

కూడి ఇరిందు .  . . కుళిరిందు  . . . . అని తానూ చెప్పిన తిరుప్పావైలో

అన్నట్టుగా , , ,
సమాజం లో ఏ మంచి పని చేసిన అందర్నీ కలుపుకుంటూ వెళ్ళాలి ఆండాళ్ ఆచరించి చూపించిన కధనం ఇదే. కాత్యాయనీ వ్రతం సమయంలో తమ ఇంటి పరిసరాల్లోని వారందరినీ

కలుపుకుంటూ వెళ్లి, వాళ్ళతో కలిసి తానూ à°ˆ వ్రతాన్ని ఆచరించింది. 

ఒక లక్ష్యం ఛేదించాలి అంటే తదేక దీక్ష తో కూడిన సాధన ఒక్కటే మార్గం అని తానుచేసి చూపించిన

మహిళా మూర్తి ఈ ఆండాళ్. ఇది పురాణం కధనం కాదు, సుమారు 5 వేల ఏళ్లకు ముందు తమిళనాడు లో జరిగిన ఘటన. ఈమె విజయానికి నిదర్శనంగా తమిళ నాడు ప్రభుత్వం ఈమె ఆరాధించిన ఆలయ

గోపురాన్ని రాష్ట్ర పభుత్వ చిహ్నంగా పెట్టుకుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam