DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిస్సహాయ చిన్నారుల కోసం వస్తు,  వస్త్ర ప్రదర్శన

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . . .

విశాఖపట్నం, ఆగస్టు  06, 2019 (డిఎన్‌ఎస్‌) : పేద, నిస్సహాయ చిన్నారులకు తమ వంతు సహకారాన్ని అందించే ప్రయత్నం లో భాగంగా రెండు రోజుల వస్తు,

వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చందమామ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దీపికా తెలియజేశారు. మంగళవారం ఉదయం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 7, 8 తేదీల్లో రామనగర్ లైన్స్ క్లబ్ హాలులో ఉదయం 9 నుంచి రాత్రి 9:30 వరకు వివిధ వస్త్ర, గృహోపకరణ వస్తువుల ఎగ్జిబిషన్ కం సేల్

నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఉన్న పేద, అనాధ పిల్లల చదువులకోసం, వారి సంక్షేమం కోసం ప్రతి ఏడాది ఇటువంటి ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని, దీనిపై వచ్చే

లాభాలను బాలల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. ఈనెల 7, 8 తేదీలలో లైన్స్ క్లబ్ వేదికగా చందమామ చిల్డ్రన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మరియు

అమ్మకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  à°¨à°¿à°°à±à°ªà±‡à°¦ విద్యార్థులకు సహాయపడాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ లో ఇంటిల్లాపాదికి  à°…వసరమయ్యే గృహోపకరణాలు

 à°¸à±à°Ÿà°¾à°²à±à°¸à± ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వారి ఉత్పత్తులను విక్రయాలు చేస్తారని తెలిపారు. సమావేశంలో  à°¸à°‚స్థ

ప్రతినిధులు దిలీప్, టీనా, కమల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం à°ˆ ప్రదర్శనకు సంబంధించిన గోడ పత్రికను సొసైటీ సభ్యులు విడుదల చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam