DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయ పరీక్షలకు అధికారులు సిద్ధం కావాలి:

పిఆర్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది 

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  06 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°—్రామ సచివాలయ

ఉద్యోగాల పోటీ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్థి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వీడియో

కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు.  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°‚ నుండి జిల్లా కలెక్టర్లుతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా

కేంద్రాలు సాధ్యమైనంత వరకు జిల్లా కేంద్రాల్లోనే ఉండేలా చూడాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, కళాశాలలను పరీక్షల నిర్వహణకు

వినియోగించుకోవాలన్నారు.  à°†à°¯à°¾ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు వ్రాయనున్న అభ్యర్థులకు కావలసిన ఫర్నీచర్, త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండేలా చూడాలని

తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾ స్థాయిలో స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేసుకొని పరీక్షా పత్రాలను భద్రపరచుకోవాలని, అక్కడ నుండి పరీక్షా కేంద్రాలకు తరలించడానికి రూట్ మ్యాప్ ను

సిద్దం చేసుకోవాలని చెప్పారు.  à°ªà°°à±€à°•à±à°·à°¾ కేంద్రాల్లో సి.సి. కెమెరాలు, వీడియో కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.   జిల్లా స్థాయిలో కలెక్టరు, జాయింట్

కలెక్టరు, జడ్.పి.సి.à°‡.à°“., à°¡à°¿.పి.à°“., à°¡à°¿.à°‡.à°“.లతో మోనిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకొని పరీక్షల నిర్వహణను సమన్వయం చేయాలని తెలిపారు.  à°ªà°°à±€à°•à±à°·à°¾ కేంద్రాల ముఖ్య

పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లను గుర్తించాలని చెప్పారు.  à°œà°¿à°²à±à°²à°¾ స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని తెలిపారు.  à°†à°°à±.à°Ÿà°¿.సి.తో సమన్వయం చేసుకొని

అభ్యర్థుల రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.   

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా నుండి సుమారు 2 లక్షల మంది

అభ్యర్థులు ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉందని చెప్పారు.  à°ˆ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, జివియంసి కమీషనర్ à°¡à°¾.జి. సృజన, జడ్పి సిఇఓ రమణమూర్తి, డిపిఓ

కృష్ణ కుమారి, తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam